Peddi : చెర్రీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఓటీటీలోకి పెద్ది ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ఆరోజే..

Peddi : పెద్ది మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఏకంగా రూ. 105 కోట్ల రికార్డ్ ధరకు సొంతం చేసుకుంది

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన విలేజ్ స్పోర్ట్స్ డ్రామా.. పెద్ది(Peddi) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తోన్న విషయం తెలిసిందే. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చెర్రీ మూవీ.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ ఇప్పటికే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డుల మోత మోగిస్తోంది.

రామ్ చరణ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ , ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌కు జాన్వీ కపూర్ గ్లామర్ యాడ్ అవడంతో.. థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. ఈ క్రేజీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.

పెద్ది మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఏకంగా రూ. 105 కోట్ల రికార్డ్ ధరకు సొంతం చేసుకుంది. జూలై చివరి వారంలో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ పెద్ది మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఓటీటీలో రానున్న పెద్ది మూవీ కోసం మేకర్స్ ఒక క్రేజీ న్యూస్ రెడీ చేస్తున్నారు.

Peddi

థియేటర్లలో మూవీ రన్‌టైమ్ ఎక్కువవుతుందని కట్ చేసిన జగపతి బాబు, జాన్వీ కపూర్‌లకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్లను.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేసి ఆడియన్స్‌కు స్పెషల్ గిఫ్ట్‌గా అందించనున్నారు.

థియేటర్లలో చూడని ఎన్నో ఆసక్తికరమైన సీన్లతో ఏకంగా 3 గంటల 25 నిమిషాల లాంగ్ రన్‌తో ఎక్స్‌టెండెడ్ వెర్షన్.. నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోందన్న న్యూస్ మెగా ఫ్యాన్స్‌లో సంతోషాన్ని నింపుతుంది. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ విలేజ్ డ్రామా.. ఓటీటీలో ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందో చూడాలి మరి.

Temple : గుడి పక్కన ఎత్తైన భవనాలు ఎందుకు కట్టకూడదు? ఈ నియమం వెనుకున్న ఆ 4 కారణాలేంటి

Exit mobile version