Ram Charan : గ్లోబల్ స్టార్ సరికొత్త రికార్డు..ఎస్క్వైర్ ఇండియా కవర్‌పై రామ్ చరణ్ మెరుపులు

Ram Charan : టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్.. కీర్తి కిరీటంలో మరో అరుదైన మైలురాయి వచ్చి చేరింది

Ram Charan

టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్(Ram Charan).. కీర్తి కిరీటంలో మరో అరుదైన మైలురాయి వచ్చి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ఎస్క్వైర్ (Esquire) ఇండియా ఎడిషన్ కవర్ పేజీపై రామ్ చరణ్(Ram Charan) మెరిశారు. ఒక తెలుగు హీరోకి అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఇంపార్టెన్స్ లభించడం మెగా అభిమానులకే కాకుండా యావత్ భారతీయ సినీ ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన చరణ్, అప్పటి నుంచి తన మార్కెట్‌ను , బ్రాండ్ వాల్యూను అంతర్జాతీయ స్థాయికి పెంచుకుంటూనే పోతున్నారు.

ఈ ఫోటోషూట్ కోసం రామ్ చరణ్ చాలా స్టైలిష్‌గా, రాయల్ లుక్‌లో కనిపించారు. లండన్‌లో ఈ షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఎస్క్వైర్ మ్యాగజైన్ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ చూపే వ్యక్తులు, స్టైల్ ఐకాన్స్ , పాపులర్ సెలబ్రిటీలను మాత్రమే తన కవర్ పేజీపై ప్రచురిస్తుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి రామ్ చరణ్ చేరడంపై చెర్రీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. గతంలో హాలీవుడ్ దిగ్గజాలు, బాలీవుడ్ అగ్ర తారలు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన అతికొద్ది మందిలో చరణ్ ఒకరిగా నిలిచారు.

Ram Charan

గతంలో ఎస్క్వైర్ మ్యాగజైన్ అంతర్జాతీయ కవర్ పేజీలపై టామ్ హాంక్స్, లియోనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్ దిగ్గజాలు ఉండేవారు. ఇండియన్ ఎడిషన్ విషయానికి వస్తే, గతంలో బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్, హృతిక్ రోషన్, విరాట్ కోహ్లీ వంటి వాళ్లు ఈ కవర్ పేజీపై కనిపించారు.

అయితే, ఎన్టీఆర్ కూడా అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకున్నారు. RRR సినిమా ఆస్కార్ రేసులో ఉన్న సమయంలో, ప్రపంచ ప్రఖ్యాత వెరైటీ (Variety) మ్యాగజైన్ కవర్ పేజీపై ఎన్టీఆర్ ప్లేస్ సంపాదించారు. చరణ్ కంటే ముందు మన దేశం నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా వంటి వారు కూడా ఎస్క్వైర్ మ్యాగజైన్ కవర్‌పై మెరిశారు.మొత్తంగా ఈ ఎస్క్వైర్ కవర్ స్టోరీ చరణ్ కెరీర్‌లో.. ఒక మరుపురాని అధ్యాయంగా నిలిచిపోతుంది.

Fatty Liver: ఫ్యాటీ లివర్‌లో ఎన్ని స్టేజ్‌లు ఉంటాయి ? ఏ దశలో ఏ లక్షణాలుంటాయి?

Exit mobile version