Just LifestyleLatest News

Isabgol : ఇసబ్‌గోల్ గురించి ఎప్పుడైనా విన్నారా? చిన్న టీస్పూన్ పొడితో ఎన్నో అద్భుతాలు

Isabgol : ఇసబ్‌గోల్ అనేది ప్లాంటాగో ఓవాటా అనే ప్లాంట్‌ విత్తనాల నుంచి తీసే పొట్టు. దీనిలో కరిగే పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.

Isabgol

ఈ రోజుల్లో చాలామందికి రాత్రిపూట కడుపులో తిప్పడం, పొద్దున్న సరిగ్గా మోషన్ అవ్వక ఇబ్బంది పడటం, ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా అనిపించడం.. వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీనికోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ టాబ్లెట్లు మింగుతూ ఉంటారు.

కానీ ఇప్పుడు ఇసబ్‌గోల్ పేరు పెద్దగా వినకపోయినా.. మన పూర్వీకుల కాలంలో దీనిని బాగా వాడేవారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం ఒకే ఒక్క టీస్పూన్ పొడితో జీర్ణక్రియ మొత్తాన్ని రీసెట్ చేసే ఒక నేచురల్ సూపర్ ఫుడ్‌గా ఉపయోగించేవారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఇసబ్‌గోల్‌ని ఇంగ్లీష్‌లో సైలియం హస్క్ (Psyllium Husk) అని పిలుస్తారు.

ఇసబ్‌గోల్(Isabgol) అనేది ప్లాంటాగో ఓవాటా అనే ప్లాంట్‌ విత్తనాల నుంచి తీసే పొట్టు. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీనిలో కరిగే పీచు పదార్థం (Soluble Fiber) చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నీటిలో ఇలా వేయగానే వెంటనే జెల్ లాగా మారిపోతుంది. మన జీర్ణవ్యవస్థను క్లీన్ చేయడంలో ఇది ఒక నేచురల్ స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది.

మలబద్ధకం (Constipation) ప్రాబ్లెమ్‌తో బాధపడేవాళ్లు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదంటే నీళ్లలో ఒక స్పూన్ ఇసబ్‌గోల్ పొడి కలుపుకుని తాగితే, మర్నాడు ఉదయాన్నే కడుపు క్లియర్‌ అయిపోతుంది. విచిత్రం ఏంటంటే..ఇదే పొడిని మోషన్స్ (Diarrhea) అవుతున్నప్పుడు పెరుగులో కలుపుకొని తింటే కడుపులోని అదనపు నీటిని పీల్చి వెంటనే కంట్రోల్ చేస్తుంది.

Isabgol
Isabgol

ఇక బరువు తగ్గాలనుకునే వారికి ఇసబ్‌గోల్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఉదయం పరగడుపున కానీ భోజనానికి అరగంట ముందు కానీ గోరువెచ్చని నీళ్లలో ఇసబ్‌గోల్, కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే.. కడుపు నిండిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. దీనివల్ల ఎక్కువ ఫుడ్ తినలేరు. అలాగే ఇది ఆహారంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను, గ్లూకోజ్‌ను బాడీ త్వరగా పీల్చుకోకుండా నిరోధిస్తుంది. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఇసబ్‌గోల్‌(Isabgol)ను రోజుకి 1 నుంచి 2 టీస్పూన్లు తీసుకుంటే చాలు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన నియమం ఏంటంటే.. ఇసబ్‌గోల్ తీసుకున్నప్పుడు రోజంతా సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు తక్కువగా తాగితే ఇది ప్రేగుల్లో గడ్డకట్టుకుపోయే అవకాశం ఉంది. నీళ్లలో, పాలలో, మజ్జిగలో ఇలా పొడిని వేసి అలా వెంటనే తాగేయాలి. అలా కాకుండా నీళ్లలో వేసి ఎక్కువసేపు ఉంచితే అది గడ్డలా మారి మింగడానికి కష్టమవుతుంది.

Online Payments : అక్టోబర్ 15 నుంచి రూల్స్ ఛేంజ్..ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేముందు వీటి గురించి తెలుసుకోండి..

Related Articles

Back to top button