Trisha :త్రిషను ఆహ్వానించని మూవీ యూనిట్..కరుప్పు మేకర్స్ పై ఫ్యాన్స్ ఫైర్

Trisha : గత కొంతకాలంగా హీరోయిన్ త్రిష సినిమాల కంటే కూడా ఇతర అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది

Trisha

గత కొంతకాలంగా హీరోయిన్ త్రిష(Trisha) సినిమాల కంటే కూడా ఇతర అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తమిళ హీరో విజయ్ తో లవ్ ఎఫైర్, అతనితో కలిసి ఫంక్షన్లకు హాజరవడం వంటి విషయాలతో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు ఎన్నికల వేళ పలు సందర్భాల్లో ట్వీట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది.

తాజాగా మరోసారి త్రిష తమ ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారింది. అటు త్రిష ఫ్యాన్స్ సైతం తమ హీరోయిన్ ను అవమానించారంటూ కరుప్పు మేకర్స్ పై మండిపడుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలవుతోంది.

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించింది. మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్ననేపథ్యంలో. ఇటీవల ఆడియో లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ ఫంక్షన్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరైనా త్రిష మాత్రం కనిపించలేదు. దీంతో ఆమె ప్రమోషన్లలో పాల్గొనడం లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

Trisha

ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు కూడా త్రిషను ట్విట్టర్ లో ప్రశ్నించారు. దీనిపై ఆమె కూడా రిప్లై ఇచ్చింది.సినిమాలో లాయర్ ప్రీతిగా తన లుక్‌ను ప్రశంసించిన ఒక నెటిజన్‌కు రిప్లై ఇస్తూ, చిత్ర బృందం తన ఉనికిని గుర్తించినందుకు సంతోషంగా ఉందంటూ సెటైర్లు వేసింది. ఆడియో లాంచ్‌ ఫంక్షన్ కు ఓ అభిమాని ప్రశ్నించగా.. తన ఆహ్వాన పత్రిక బహుశా మెయిల్‌లో మిస్ అయి ఉంటుందంటూ సెటైర్లు వేసింది.

దీంతో తమ హీరోయిన్ ను ఫంక్షన్ కు పిలవకుండా అవమానిస్తారా అంటూ త్రిష ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పోస్టర్లలో పేరు, ఫోటో వేసి ఆడియో ఫంక్షన్ కు పిలవకుండా అవమానించారంటూ మండిపడుతున్నారు. దీనిపై చిత్ర బృందం ఇంత వరకూ స్పందించలేదు.

SRH vs KKR : సన్ రైజర్స్ కు ఎదురుందా ?..సొంతగడ్డపై కోల్ కతాతో మ్యాచ్

Exit mobile version