Just SportsLatest News

SRH vs KKR : సన్ రైజర్స్ కు ఎదురుందా ?..సొంతగడ్డపై కోల్ కతాతో మ్యాచ్

SRH vs KKR : ఐపీఎల్ 19వ సీజన్ లో ఆదివారం రెండు మ్యాచ్ లు అభిమానులను అలరించబోతున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది

SRH vs KKR

ఐపీఎల్ 19వ సీజన్ లో ఆదివారం రెండు మ్యాచ్ లు అభిమానులను అలరించబోతున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్(SRH vs KKR) తో తలపడబోతోంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత అద్భుతంగా పుంజుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేసులో దూసుకెళుతోంది.

ప్రస్తుతం 9 మ్యాచ్ లు ఆడి ఆరింటిలో గెలిచింది. 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచిన సన్ రైజర్స్ సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ అదరగొడుతున్న సన్ రైజర్స్ ఇప్పుడు హోంగ్రౌండ్ లో మరో విజయంపై కన్నేసింది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెడ్ , క్లాసెన్ ఫామ్ లో ఉన్నారు.

నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ కూడా మెరుపులు మెరిపిస్తే తిరుగులేనట్టే. అటు బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ పటిష్టంగా మారింది. కమిన్స్ వచ్చిన తర్వాత యువ పేసర్లు, సీనియర్లతో సన్ రైజర్స్ బౌలింగ్ ఫుల్ ఫామ్ లో ఉంది. వరుసగా సాధించిన ఐదు విజయాల్లో బౌలర్ల పాత్ర కూడా ఎంతో ఉంది. దాదాపు ఓడిపోయే మ్యాచ్ లను కూడా అద్భుతమైన బౌలింగ్ తో గెలిచిందంటే బౌలింగే కారణం. దీంతో అన్ని విభాగాల్లోనూ సూపర్ ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ పేలవ ఫామ్ నుంచి బయటపడే క్రమంలో వరుసగా రెండు విజయాలు సాధించింది. ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్ రెండు విజయాలు, ఒకటి వర్షంతో రద్దవడంతో 5 పాయింట్లు సాధించింది. ఐదింటిలో ఓడిన కోల్ కతా గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై సూపర్ ఓవర్ విక్టరీ అందుకుంది.

SRH vs KKR
SRH vs KKR

చేసింది 155 పరుగులే అయినా అద్భుతమైన బౌలింగ్ తో ఆ స్కోరును కాపాడుకుంది. ఈ సీజన్ లో తొలిసారి కేకేఆర్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఈ జోష్ తో ఇప్పుడు సన్ రైజర్స్ ను ఓడించాలని ఎదురుచూస్తోంది. కానీ ఈ మ్యాచ్ కోల్ కతా కు పెద్ద సవాలే. ముఖ్యంగా హోంగ్రౌండ్ లో అత్యంత బలంగా ఉండే సన్ రైజర్స్ ను నిలువరించాలంటే అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది.

బ్యాటింగ్ లో రింకూ సింగ్ ఫామ్ లోకి రావడం అడ్వాంటేజ్. మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తేనే మంచి స్కోర్లు చేయగలదు. అటు బౌలర్లు గాడిలో పడినా సరే భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ ను కట్టడి చేయడం అంత ఈజీ కాదు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో పరుగుల వరద పారడం ఖాయమని చెప్పొచ్చు.

OTT : ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్..ఈ ఓటీటీ థ్రిల్లర్ ను అస్సలు మిస్సవ్వొద్దు

Related Articles

Back to top button