Ustaad Bhagat Singh : గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీటైందా ?..ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ

Ustaad Bhagat Singh : 2012లో హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. నాకు కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది అంటూ పవన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు

Ustaad Bhagat Singh

2012లో హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. నాకు కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది అంటూ పవన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మళ్లీ చాలా ఏళ్ళకు హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh).. దాదాపు నాలుగేళ్ళ క్రితమే ఈ మూవీ మొదలైనా..

పవన్ పొలిటికల్ బిజీతో వాయిదా పడుతూ ఆలస్యంగా చిత్రీకరణ జరుపుకుని ఈ ఉగాదికి విడుదలైంది. పవన్ వీరాభిమాని హరీశ్ శంకర్ డైరెక్టర్ కావడం, గబ్బర్ సింగ్ సినిమాలోలానే పవన్ పోలీస్ గెటప్ కనిపించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఉస్తాద్ అందుకున్నాడా ?

చిన్నప్పుడు తనను చేరదీసిన ఓ హెడ్మాస్టర్ స్ఫూర్తితో అన్యాయాలను ఎదుర్కొనే తత్వం ఉన్న పోలీస్ అధికారిగా ఎదిగిన వ్యక్తి సస్పెండైన తర్వాత స్థానికంగా ఉండే ఎమ్మెల్యేతో ఏర్పడిన వైరం కారణంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే కథ. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కథ ఏమీ ఉండదు.

రొటీన్ కథకు పవన్ మార్క్ హీరోయిజం, డైలాగ్స్ , ఫైట్స్ తోడైతే ఎలా ఉంటుందో అదే ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మూవీ. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా పవన్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని హరీశ్ శంకర్ తీసిన సినిమా ఇది. గతంలో గబ్బర్ సింగ్ మూవీతో పవన్ ను అభిమానులు ఎలా చూడడానికి ఇష్టపడతారో అలా చూపించిన హరీశ్ శంకర్ మరోసారి అలాంటి ప్రయత్నమే చేశాడు. ఆ ప్రయత్నంలో మూడొంతుల వరకూ సక్సెస్ అయ్యాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్ పక్కాగా దించేశాడు. ముఖ్యంగా గత సినిమాలతో పోలిస్తే ఇందులో పవన్ వేసిన స్టెప్పులు సినిమాను నిలబెట్టాయి. ఫస్టాఫ్‌లో పవన్ తో పాటు ఇతర పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో లెంగ్తీగా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ లో మాత్రం వేగం పుంజుకుంటుంది.

సినిమా నిలబడిందంటే కారణం సెకండాఫే. పవన్ మార్క్ హీరోయిజానికి, విలన్ గా నటించిన పార్థీబన్ తో సీన్స్ బాగా రావడం సినిమాకు ప్లస్ అయింది. మధ్యలో హీరోయిన్ శ్రీలీలతో సీన్స్ కూడా బాగా వచ్చాయి. పవన్ తో శ్రీలీల కెమిస్ట్రీ పండింది. పవన్ ఐడియాలజీకి, ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన డైలాగ్స్ కు విజిల్స్ పడ్డాయి. ఓవరాల్ గా రొటీన్ కథనే ఎంచుకున్నా పవన్ లుక్స్ , డాన్సులు, డైలాగ్స్ , శ్రీలీలతో కెమిస్ట్రీతో పాటు థమన్ బీజీఎం ఉస్తాద్ భగత్ సింగ్ ను నిలబెట్టాయని చెప్పొచ్చు.

Ustaad Bhagat Singh

హరీశ్ శంకర్ పవన్ ను వింటేజ్ లుక్ చూపించడం మాత్రమే కాదు పీకే పాత సినిమాల్లోని కొన్ని పాటలను కూడా వాడుకుని ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాడు.అలాగే వేరే హీరోల పాటలకు పవన్ స్టెప్పులు వేయడం వంటివి కూడా సినిమాకు ఎట్రాక్షన్ తెచ్చాయి. శ్రీలీలకు ప్రాధాన్యత ఉన్న పాత్రే దక్కినా.. రాశిఖన్నాకు మాత్రం పెద్దగా స్కోప్ లేదు. ఇక నెగెటివ్ రోల్ లో నటించిన పార్దీబన్ కు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ తర్వాత పార్థీబన్ కు టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడతాయని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులంతా పర్వాలేదనిపించారు.

చివరిగా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మూవీ రొటీన్ స్టోరీతో వచ్చి పవన్ హీరోయిజం, పార్థీబన్ విలనిజంతో అభిమానులను అలరించే మూవీ అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ స్థాయిలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన హరీశ్ శంకర్ ఓవరాల్ గా పవన్ అభిమానులను మాత్రం సంతృప్తి పరిచాడు. కథ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ జాబితాలో చేరేది. ప్రస్తుతానికి చెప్పాలంటే ఈ ఉగాదికి అంచనాలు పెట్టుకోకుండా రెండున్నర గంటలు ఎంజాయ్ చేయాలంటే ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) మంచి ఛాయిసే.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version