Body : మీ బాడీలో ఈ 7 సిగ్నల్స్ లైట్ తీసుకుంటున్నారా? అవి మీ ఆరోగ్యంపై శరీరం ఇచ్చే లీకులట..

Body : మన బాడీలో వచ్చే ఏ చిన్న మార్పు అయినా సరే.. మన లోపల ఏదో పెద్ద సమస్య మొదలవుతోందని మనకు ముందే పంపుతున్న హెచ్చరిక అని గుర్తించాలని అంటున్నారు.

Body

చాలామంది తమ డైలీ లైఫ్‌లో ఎదురయ్యే చిన్న చిన్న మార్పులను పని ఒత్తిడో, అలసటో అని అనుకుని లైట్ తీసుకుంటారు. కానీ వైద్యులు మాత్రం, మన బాడీ(Body)లో వచ్చే ఏ చిన్న మార్పు అయినా సరే.. మన లోపల ఏదో పెద్ద సమస్య మొదలవుతోందని మనకు ముందే పంపుతున్న హెచ్చరిక అని గుర్తించాలని అంటున్నారు.

వీటిలో ఎంత నిద్రపోయినా కూడా తీవ్రమైన అలసట ఉండటం అనేది మొదటి సంకేతం. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు హ్యాపీగా నిద్రపోయినా, ఉదయం లేవాలనిపించకపోవడం, విపరీతమైన నీరసం, రోజంతా బద్ధకంగా అనిపిస్తుంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదట. ఇది బాడీలో విటమిన్ బి-12, విటమిన్- డి లోపానికి లేదా థైరాయిడ్, రక్తహీనత వంటి సమస్యలకు ప్రధాన సంకేతం కావచ్చు.

హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గిపోవడం రెండో సంకేతం. డైట్ కంట్రోల్ చేయకపోయినా, ఎలాంటి వర్కవుట్స్ చేయకపోయినా కూడా అకస్మాత్తుగా బరువు తగ్గిపోతుంటే అది డయాబెటిస్ లేదా జీర్ణక్రియ సమస్యల వల్ల కావొచ్చు. అలాగే తిండి తగ్గించినా కూడా బరువు పెరిగిపోతుంటే హార్మోన్ల అసమతుల్యత లేదా మెటబాలిజం పూర్తిగా దెబ్బతిందని అర్థం. అలాగే థైరాయిడ్‌కు హెచ్చరికగా కూడా దీనిని గుర్తించాలి.

తరచూ తలనొప్పి, కళ్లనొప్పి వస్తుంటే అది మూడో సంకేతం. చాలామంది తలనొప్పి రాగానే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని సరిపెట్టుకుంటారు. కానీ వీక్‌లో 2,3 సార్లు ఇలా జరుగుతుంటే అది విపరీతమైన మానసిక ఒత్తిడి, మైగ్రేన్, హైబీపీ లేదా కంటి చూపు సమస్యలకు సంకేతంగా తెలుసుకోవాలి.

విపరీతంగా జుట్టు రాలడం అలాగే గోళ్లు విరిగిపోవడం జరుగుతుంటే దాన్ని బాడీ(Body) పంపే నాల్గవ సంకేతంగా భావించాలి. రోజుకు వంద లోపు వెంట్రుకలు ఊడటం కామనే అయినా, గుత్తులు గుత్తులుగా రాలిపోతుంటే మాత్రం బాడీలో ఐరన్, ప్రొటీన్లు లేదా జింక్ వంటి పోషకాలు పూర్తిగా తగ్గిపోయాయని బాడీ మనకు చెబుతున్నట్లే అర్ధం.

చర్మం విపరీతంగా పొడిబారడం లేదా తరచూ మొటిమలు రావడాన్ని ఐదవ సంకేతంగా అనుకోవాలి. బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోయినా, కాలేయం పనితీరు మందగించినా లేదా హార్మోన్లు తలకిందులైనా ఆ ఇంపాక్ట్ ముందుగా మన చర్మంపైనే కనిపిస్తుంది. స్కిన్ గ్లో కోల్పోయి డల్‌గా మారుతుంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిందనో, లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉందనో అర్థం చేసుకోవాలి.

నోటి దుర్వాసన , చిగుళ్ల నుంచి రక్తం రావడాన్ని ఆరవ సంకేతంగా భావించాలి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసినా సరే నోరు వాసన వస్తోందంటే అది కేవలం పంటి సమస్యే కాకపోవచ్చు. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోయినా లేదా కిడ్నీ,కాలేయ సమస్యలు ఉన్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది. అలాగే చిగుళ్ల నుంచి రక్తం వస్తే కనుక విటమిన్ సి లోపం ఉన్నట్లు అర్ధం.

Body

తరచూ కడుపు ఉబ్బరం , మలబద్ధకం ఉంటే అది ఏడవ సంకేతం. తినే ఫుడ్ సరిగ్గా అరగకపోవడం, గ్యాస్ ఫామ్ అవ్వడం అనేది చాలామందిలో సాధారణంగా కనిపిస్తుంది. కానీ ప్రతిరోజూ ఇదే సమస్య వేధిస్తుంటే మాత్రం పేగుల ఆరోగ్యం అంటే గట్ హెల్త్ పాడైందని, బాడీ(Body)లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయిందని గుర్తించాలి.

కాబట్టి ఇకపై మీ బాడీలో ఇలాంటి ఏడు సంకేతాలలో ఏ ఒక్కటి రెగ్యులర్‌గా కనిపిస్తున్నా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే డాక్టర్‌ను కలిసి టెస్టులు చేయించుకోవడం చాలా మంచిది. ముందే బాడీ ఇచ్చే ఇలాంటి హెచ్చరికలను గుర్తిస్తే పెద్ద సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు.

England : బుమ్రా రీఎంట్రీ..జైస్వాల్ ఔట్..ఫిట్ అయితేనే ఇంగ్లాండ్ టూర్ కు కోహ్లీ

Exit mobile version