Constipation
ఉరుకుల పరుగుల జీవితంలో అందరి ఆహారపు అలవాట్లు మారిపోయి చాలామంది మలబద్ధకం(Constipation) , గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీనికి యోగా శాస్త్రంలో అపాన ముద్ర అనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉందని అంటున్నారు యోగా నిపుణులు.
ఈ ముద్ర వేయడం వల్ల మన బాడీలోని ఆకాశ, భూమి మూలకాల మధ్య బ్యాలెన్స్ ఏర్పడి జీర్ణాశయాంతర భాగం బాగా స్ట్రాంగ్ అవుతుందట. దీనిని వేసే పద్ధతి చాలా ఈజీ. మీ మధ్య వేలు , ఉంగరపు వేలు చివరలను బొటనవేలు చివరతో తాకించాలి. మిగిలిన చూపుడు వేలు, చిటికెన వేలు నేరుగా ఉండాలి.
ఈ ముద్రను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కనీసం 15 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది కేవలం మలబద్ధకాన్ని తగ్గించడమే కాకుండా, దంతాల నొప్పిని పోగొట్టడానికి, మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి, అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుంది.
యోగ ముద్రలతో పాటు మనం తీసుకునే జాగ్రత్తలు కూడా ముఖ్యమే. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం లోపల శుద్ధి జరుగుతుంది. ఆహారంలో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.
మనం ఎంత ఖరీదైన మందులు వాడినా, మన లైఫ్ స్టైల్‌లో మార్పు రానంత వరకు సమస్యలు పూర్తిగా తొలగిపోవు. అపాన ముద్ర వంటి నేచురల్ పద్ధతులను రెగ్యులర్‌గా పాటిస్తూ, సరైన ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి మన శరీరం చాలా త్వరగా తేలికగా మారుతుంది. మలబద్ధకం(Constipation) , గ్యాస్ సమస్యల నుంచి బయటపడొచ్చు. అందుకే ఈ ముద్ర మన ఇంటర్నల్ అవయవాలను బలపరిచే ఒక సహజమైన ట్రీట్మెంట్ వంటిది అంటారు యోగా నిపుణులు.
