Just LifestyleLatest News

Dunning Kruger Effect:డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ .. సబ్జెక్ట్ లేకపోయినా బిల్డప్ ఇచ్చే వారు మీ ముందే ఉంటారు

Dunning Kruger Effect: పక్కవాడి ఆలోచనలను కాపీ కొట్టి ఆ ఆలోచనలు తమవే అన్నట్లు బాసుల ముందు, మిగిలిన వారి ముందు బిల్డప్ ఇస్తుంటారు.

Dunning Kruger Effect

సొసైటీలో మనం తరచూ రకరకాల మనుషులను చూస్తుంటాం. ఇలాంటివారిలో ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండకపోయినా కానీ, తమకు అన్నీ తెలుసని, తామే మేధావులమని భ్రమపడుతూ ఉండే మేధావులు కూడా కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్లు పక్కవాడి ఆలోచనలను కాపీ కొట్టి ఆ ఆలోచనలు తమవే అన్నట్లు బాసుల ముందు, మిగిలిన వారి ముందు బిల్డప్ ఇస్తుంటారు. సైకాలజీ భాషలో దీనిని డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ (Dunning-Kruger Effect) అని పిలుస్తారు.

డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ (Dunning Kruger Effect) ప్రకారం, తక్కువ స్కిల్, ట్యాలెంట్ కలిగిన వ్యక్తులు తమ సొంత కెపాసిటీని చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటారు. వీరు తామెంత అజ్ఞానంలో ఉన్నామో కూడా గుర్తించలేని స్థితిలో ఉంటారు. అందుకే సొంతంగా ఏమీ క్రియేట్ చేయలేక, ఇతరుల కష్టాన్ని కాపీ కొడుతూ కాలం వెల్లదీస్తుంటారు.

వీరిలో మరో లక్షణం కూడా ఉంటుంది. వీరు ఇతరులను తమ బుట్టలో వేసుకోవడానికి లవ్ బాంబింగ్ అనే ట్రిక్కును ఎక్కువగా వాడుతుంటారు. అంటే అవసరం ఉన్నప్పుడు అవతలి వ్యక్తిని మాటలతో బురిడీ కొట్టించి తమ తియ్యటి మాటలతో వారిని లోబర్చుకుంటారు. నీ అంత గొప్పవాడు లేడు, నువ్వు చెబితేనే నేను వింటానంటూ పక్కవాడి ఈగోను సంతృప్తి పరుస్తూనే, నెమ్మదిగా వారి దగ్గర ఉన్న సమాచారాన్ని లేదా ఐడియాలను దొంగిలిస్తారు.

ఒకసారి వారి పని పూర్తయిన తర్వాత అదే వ్యక్తిని కించపరచడానికి, తొక్కేయడానికి కూడా వీరు ఏమాత్రం వెనుకాడరు. నిజానికి ఇలా బిల్డప్ ఇచ్చే వారి వెనుక తీవ్రమైన ఆత్మన్యూనత భావం (Inferiority Complex) దాగి ఉంటుందట. దానిని కప్పిపుచ్చుకోవడానికే వీరు ఈ డ్రామాలు ఆడుతుంటారు.

Dunning Kruger Effect
Dunning Kruger Effect

వీరిలో సెల్ఫ్ ఐడెంటిటీ అనేది సున్నా.. ఎప్పుడూ ఎవరికో ఒకరికి తొత్తుగా ఉండటం, వేరొకరిని ఫాలో అవడం, కాపీ కొట్టడం ద్వారా మాత్రమే వీరు గుర్తింపు పొందాలని చూస్తుంటారు. కానీ ఒరిజనల్ తెలివితేటలు, పట్టుదల లేని చోట ఇలాంటి ట్రిక్కులు ఎక్కువ కాలం పని చేయవన్న విషయాన్ని వీరు గుర్తించాలి. నిప్పును ఎంత కాలం దాచలేమో, వారి అజ్ఞానం కూడా ఏదో ఒక రోజు బయటపడుతుందన్న సంగతి గ్రహించాలి.

తెలివైన వారెప్పుడూ నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకు పోతుంటారు. బిల్డప్ రాయుళ్లే ఎప్పుడూ ఇలా బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటి వారిని గుర్తించి.. వారికి దూరంగా ఉండటమే మన మానసిక ఆరోగ్యానికి మంచిదని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.

Voters : తమిళనాడులో 85… బెంగాల్ లో 90 శాతం..రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు

Related Articles

Back to top button