Sleep
రోజంతా యాక్టివ్‌గా ఉండాల్సిన టైమ్‌లో కూడా ఎప్పుడూ నిద్ర వస్తున్నట్లు అనిపించడం, రాత్రిళ్లు నిద్ర పోవాల్సిన సమయమంతా పడుకున్నా సరే ఉదయం లేవగానే మళ్లీ బెడ్ పై నుంచి కదలలేనంత నీరసంగా ఉండటాన్ని ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు. దీనిని చాలా మంది కేవలం బద్ధకం అనో నీర్సం అనో అనుకుని లైట్ తీసుకుంటారు. అయితే మెడికల్ సైన్స్ ప్రకారం చూస్తే.. ఈ కంటిన్యూస్ స్లీపినెస్ వెనుక కొన్ని బలమైన శారీరక, మానసిక కారణాలు దాగి ఉంటాయి.
బాడీలో ఇంటర్నల్‌గా ఏదైనా ఇంబాలెన్స్ జరిగినప్పుడు బ్రెయిన్ ఈ విధంగా నిత్యం అలసట, నిద్ర (sleep) రూపంలో సిగ్నల్స్ ఇస్తుంది. దీనిలో ముఖ్యంగా విటమిన్ బి12 , విటమిన్ డి3 లెవెల్స్ పడిపోయినప్పుడు నరాల బలహీనత, లాక్ ఆఫ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీనివల్ల బాడీ ఎప్పుడూ అలసిపోయినట్లు ఉండి, అలా నిద్రపోవాలనే ఫీలింగ్ కలుగుతుంది.
అలాగే థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ప్రొడ్యూస్ చేయనప్పుడు కూడా మెటబాలిజం స్లో అయిపోతుంది. దీనిని హైపోథైరాయిడిజం అంటారు, దీనివల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగా పడిపోయి రోజంతా విపరీతమైన నీరసం, నిద్రమత్తు వెంటాడుతాయి. దీంతో పాటు రక్తంలో ఎర్ర రక్త కణాలు లేదా హీమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు శరీర భాగాలకు, ముఖ్యంగా బ్రెయిన్‌కు అందాల్సిన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల తల భారంగా ఉండి, ఎప్పుడూ నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది.
చాలా మంది రాత్రి 7 నుంచి 8 గంటలు పడుకున్నామని అనుకుంటారు. కానీ వారిలో డీప్ స్లీప్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. స్లీప్ అప్నియా వల్ల రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడటం వల్ల బ్రెయిన్ రిలాక్స్ అవ్వదు. దీనివల్ల ఎంతసేపు పడుకున్నా బాడీ రీఛార్జ్ అవ్వకపోవడంతో.. ఉదయం మళ్లీ నిద్ర వస్తుంది. క్రానిక్ స్ట్రెస్, యాంగ్జైటీ లేదా డిప్రెషన్ ఉన్నవారిలో కూడా హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ఇలాంటి నిద్ర రుగ్మతలు వస్తాయి.
ఈ నిరంతర నిద్రమత్తు నుంచి బయటపడి రోజంతా ఎనర్జిటిక్‌గా మారడానికి కొన్ని లైఫ్‌స్టైల్ చేంజెస్ , మెడికల్ ప్రికాషన్స్ అవసరం అవుతాయి. ఫస్ట్ స్టెప్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి విటమిన్ బి12, విటమిన్ డి3, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ ప్రొఫైల్ టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ వీటిలో ఏదైనా లోపం ఉంటే డాక్టర్ సలహాతో మెడిసిన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ వాడటం ద్వారా కొద్ది రోజుల్లోనే నిద్రమత్తు మాయమవుతుంది.
దీంతో పాటు రాత్రి పడుకోవడానికి కనీసం ఒక గంట ముందే మొబైల్ ఫోన్స్, లాప్‌టాప్స్ , టీవీలకు దూరంగా ఉండాలి. బెడ్‌రూమ్‌ను చీకటిగా, ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల మెదడులో మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ రిలీజ్ అయి క్వాలిటీ స్లీప్ దొరుకుతుంది. రోజువారీ పడుకునే, లేచే సమయాలను ఒకేలా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు కూడా విపరీతమైన నీరసం, నిద్ర వస్తుంటాయి. కాబట్టి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. జంక్ ఫుడ్స్ తగ్గించి డైట్‌లో పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ వంటి న్యూట్రీషియస్ ఫుడ్స్ పెంచాలి. అలాగే ఉదయం పూట కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్ , యోగా చేయడం వల్ల బాడీలో ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
ఇది బ్రెయిన్‌ను అలర్ట్ చేసి రోజంతా యాక్టివ్‌గా ఉండేలా బూస్ట్ ఇస్తుంది. ఎప్పుడూ నిద్ర(sleep) రావడమనేది కేవలం అలసట మాత్రమే కాదు, అది శరీరం లోపల ఉన్న ఏదైనా హెల్త్ ఇష్యూకి ఒక ముఖ్యమైన అలర్ట్ సైన్ కూడా కావచ్చు. కాబట్టి దీనిని అశ్రద్ధ చేయకుండా సరైన రీతిలో లైఫ్‌స్టైల్ మార్చుకుంటూ, అవసరమైతే డాక్టర్ల సహాయం తీసుకోవడం ఎంతో మంచిది.
SRH vs CSK : గెలుపు బాట పట్టేదెవరు ?..చెపాక్ లో చెన్నై, సన్ రైజర్స్ ఢీ
