GLP 1 Injection : జీఎల్పీ ఇంజెక్షన్లతో వెయిట్ లాస్‌ మాత్రమేనా? క్యాన్సర్ రాకుండా కూడా వాడొచ్చా?

GLP 1 Injection : అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జీఎల్పీ-1 (GLP-1) ఇంజెక్షన్లు , క్యాన్సర్ ముప్పు తగ్గుదలపై భారీ అధ్యయనం చేశారు

GLP 1 Injection

ఈమధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా వెయిట్ తగ్గడానికి వాడుతున్న జీఎల్పీ-1 (GLP-1) ఇంజెక్షన్లు సెన్సేషన్ సృష్టిస్తున్నాయనే చెప్పాలి. అయితే ఈ ఇంజెక్షన్ల వల్ల కేవలం వెయిట్ లాస్ మాత్రమే కాదని.. కొన్ని రకాల భయంకరమైన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందనే హాట్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దీంతో ఇది నిజమేనా, అసలు దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏంటి, అలాగే కేవలం క్యాన్సర్ రాకుండా ఉండటం కోసం దీనిని వాడొచ్చా అనే రకరకాల ప్రశ్నలు నెట్టింట్లో వినిపిస్తున్నాయి.

మొదటి ప్రశ్న విషయానికి వస్తే, జీఎల్పీ-1 ఇంజెక్షన్ల(GLP 1 Injection) వల్ల కొన్ని రకాలైన క్యాన్సర్ల ముప్పు తగ్గుతుందనే వార్త నూటికి నూరు శాతం నిజం .

ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల ప్రకారం, ఈ ఇంజెక్షన్లు ముఖ్యంగా ఊబకాయం , ఓవర్ వెయిట్‌కు సంబంధించిన సుమారు 13 రకాల క్యాన్సర్లను ఉదాహరణకు ప్రేగు, కిడ్నీ, ప్యాంక్రియాస్, అండాశయం, కాలేయం ,థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు తేలింది.

దీనికి గల ముఖ్య కారణాలను సైంటిస్టులు చాలా ఆసక్తికరంగా వివరించారు. మొదటిది, మనిషి బాడీలో విపరీతంగా ఉన్న కొవ్వు.. క్యాన్సర్ కణాల ఎదుగుదలకు ఇంధనంలా పని చేస్తుంది. ఈ ఇంజెక్షన్లు వెయిట్‌ను, ఫ్యాట్‌ను వేగంగా తగ్గించడం వల్ల క్యాన్సర్ కణాలకు అందే ఆ ఇంధనం కట్ అయిపోతుంది.

రెండోది, జీఎల్పీ-1 మందులు శరీరంలో క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్‌ను అంటే దీర్ఘకాలిక వాపులను అద్భుతంగా తగ్గిస్తాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ ఎంత తక్కువగా ఉంటే, డీఎన్ఏ దెబ్బతినే ఛాన్స్ అంతగా తగ్గి క్యాన్సర్ వచ్చే అవకాశం పడిపోతుంది.

ఇక మూడోది, ఇవి బ్లడ్ షుగర్ , ఇన్సులిన్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. హై ఇన్సులిన్ స్థాయిలు కూడా క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తాయి కాబట్టి, ఇన్సులిన్‌ను కంట్రోల్‌లో ఉంచడం ద్వారా ఇది క్యాన్సర్‌కు బ్రేక్ వేస్తుంది.

ఈ విషయాన్ని ఎలా ప్రూవ్ చేశారంటే.. అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జీఎల్పీ-1 (GLP-1) ఇంజెక్షన్లు(GLP 1 Injection) , క్యాన్సర్ ముప్పు తగ్గుదలపై భారీ అధ్యయనం చేశారు.

సుమారు 16 లక్షల మంది టైప్-2 డయాబెటిస్ రోగుల మెడికల్ రికార్డులను ఎనాలసిస్ చేసి ఈ డేటాను సేకరించారు. ఈ ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో ఒబెసిటీ సంబంధిత క్యాన్సర్లు వచ్చే రేటు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నట్లు క్లినికల్ డేటా ఆధారంగా వీరు ప్రూవ్ చేశారు.

GLP 1 Injection

అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి కేవలం క్యాన్సర్ రాకూడదనే ఒకే ఒక్క కారణంతో, బరువు నార్మల్‌గా ఉన్నవాళ్లు ఈ ఇంజెక్షన్లు అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఇవి ప్రధానంగా వెయిట్ తగ్గించడానికి, డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి డిజైన్ చేసిన ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మాత్రమే.

దీని వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గడమనేది ఒక ఎక్స్‌ట్రా బెనిఫిట్ మాత్రమే తప్ప.. ఇది క్యాన్సర్‌ను నిరోధించే వ్యాక్సిన్ కాదు. ఓవర్ వెయిట్ లేని వాళ్లు, డయాబెటిస్ లేనివాళ్లు దీనిని వాడితే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సమస్యలు, ప్యాంక్రియాటైటిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఉంది.

కాబట్టి కేవలం మెడికల్ గైడెన్స్ ప్రకారం, ఒబెసిటీ ఉన్నవారు మాత్రమే ఈ ఇంజెక్షన్ ఉపయోగించడం సేఫ్ అని డాక్టర్లు క్లారిటీ ఇస్తున్నారు.

Cancer : సున్నితమైన మనసు తరచూ మారే మూడ్స్.. కర్కాటకరాశికి ఏ నెంబర్ కలిసి వస్తుంది?

Exit mobile version