Hospital : ఆసుపత్రి బాట పడుతున్న 45 ఏళ్లు దాటినవాళ్లు.. NSSO సర్వే ఏం చెప్పింది?

Hospital : నార్మల్ డెలివరీల కోసం వచ్చే వారిని మినహాయించి చూసినా, అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య మెల్లగా పెరుగుతోంది.

Hospital

జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) 2026 నివేదిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీని ప్రకారం భారత దేశంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. గతంతో పోలిస్తే ఆసుపత్రు(Hospital) ల్లో చేరుతున్న వారి సంఖ్య రెట్టింపు అయిందని, ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉందని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

నార్మల్ డెలివరీ కోసం వచ్చే వారిని మినహాయించి చూసినా, అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఈ వయసు వారిలో ప్రతి వెయ్యి మందికి 42 మంది హాస్పిటల్స్‌లో చేరుతుండగా, 60 ఏళ్లు దాటిన వారిలో ఈ సంఖ్య 81కి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఇది దేశంలోని అన్ని హాస్పిటల్స్‌పై పడుతున్న తీవ్రమైన ఒత్తిడికి అద్దం పడుతోంది.

NSSO సర్వే రిపోర్ట్ ప్రకారం 45 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదొక ఆరోగ్య సమస్యతో సతమతమవుతున్నారు. దీనికోసం ఇరవయ్యేళ్ల గణాంకాలను ఒకసారి పరిశీలించగా.. ఇప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రు(Hospital)లలో చేరుతున్న రేటు రెండు రెట్లు పెరిగింది. ఇన్ఫెక్షన్లు, హార్ట్ జబ్బులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో పాటు ప్రమాదాల వల్ల కలిగే గాయాల వల్ల ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు.

కలుషితమైన ఆహారం, మారుతున్న వాతావరణ పరిస్థితులు ఈ వ్యాధుల వ్యాప్తికి దోహదం చేస్తున్నాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారకరమైన విషయం ఏంటంటే, ఈ ఆరోగ్య సమస్యలు ఇప్పుడు కేవలం వృద్ధులకే పరిమితం కాకుండా 25 ఏళ్ల వారిలో కూడా కనిపిస్తున్నాయి.

మధుమేహం, గుండె జబ్బులు ఇప్పుడు నిశ్శబ్దంగా మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాయి. 45 ఏళ్లు దాటిన వారిలో డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఈ వ్యాధులు ఎటువంటి లక్షణాలు లేకుండానే బాడీని దెబ్బతీస్తాయి. అందుకే వీటిని స్టార్టింగ్ దశలోనే గుర్తించడం చాలా అవసరం.

గతంలో ఆరోగ్య పరీక్షలపై ఉన్న కేర్ ఇప్పుడు తగ్గడం వల్ల వ్యాధులు ముదిరిన తర్వాతే ఆసుపత్రులకు వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రెగ్యులర్‌గా రక్తంలో గ్లూకోజు పరీక్షలు చేయించుకోవడం వల్ల డయాబెటిస్ వల్ల కలిగే దుష్ప్రభావాలను అడ్డుకోవచ్చు.

Hospital

ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ముందుగా ఎవరి ఆరోగ్యం గురించి వారే శ్రద్ధ తీసుకోవాలి. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వంటి టెస్టులతో పాటు బీఎమ్‌ఐ రెగ్యులర్‌గా చెక్ చేయించుకోవాలి. అప్పుడు ఒకవేళ ఎటువంటి హాని కలిగించే లక్షణాలు లేకపోతే 50 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ రెండు, మూడేళ్లకు ఒకసారి అయినా పరీక్షలు చేయించుకున్నా సరిపోతుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ ఈసీజీ, 2డి ఎకో వంటి పరీక్షల ద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలి. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు, యోగాతో పాటు సరైన ఆహార నియమాలు పాటిస్తే.. ఆసుపత్రు(Hospital)ల పాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. జంక్ ఫుడ్, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉంటేనే ఫ్యూచర్‌లో ఆరోగ్యంగా జీవించడం సాధ్యమవుతుంది.

Change : అక్కడ మార్పు కోరుకున్నారు..ఇక్కడ మార్పు వద్దనుకున్నారు

Exit mobile version