Chicken : చికెన్ ఎక్కువగా తింటే డేంజరే…వారానికి ఎంత తినాలో తెలుసా ?

Chicken : వారానికి ఎంత చికెన్ తినాలో చాలా మందికి తెలియదు. చికెన్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిదేనా

Chicken

ఏదైనా మితంగా తింటే ఆరోగ్యం.. అతిగా తింటే విషంతో సమానం.. ఇది అన్నింటికీ వర్తిస్తుంది. ప్రోటీన్లు, విటమిన్లు ఉండే ఆహారమైనా, శక్తిని పెంచే ఇతర పదార్థాలైనా లిమిట్ గానే తినాలి. ఎక్కువ తింటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చాలా మంది చికెన్‌(Chicken)ను ప్రోటీన్ ను అందించే ఫుడ్ గా చూస్తారు. బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాల్ని ఇది అందిస్తుంది. అందుకే చాలా మంది జిమ్‌కి వెళ్లేవారు ప్రోటీన్ కోసం చికెన్ నే ఎక్కువగా తింటారు.

ప్రోటీన్ ఇచ్చేదే కదా ఎంతైనా తినొచ్చు అనుకుంటారు. అయితే వారానికి ఎంత చికెన్(Chicken) తినాలో చాలా మందికి తెలియదు. చికెన్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. అనే అంశంపై తరచుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాయి. చికెన్ ఎక్కువగా తింటే ఏమౌతుంది.. అసలు వారానికి ఎన్ని గ్రాముల వరకూ చికెన్ తినొచ్చు వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి.

​న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చికెన్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలింది. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారికి కొన్ని సమస్యలు వస్తాయట. కడుపు, పేగు వ్యాధులు వచ్చే అవకాశం ఉందనీ పరిశోధకులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా మహిళల కంటే పురుషులకే ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలో ఇటలీకి చెందిన 4869 మందిపై రీసెర్చ్ చేయగా.. ఎక్కువ చికెన్ తినేవారు పేగు క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని తేలింది.

Chicken

వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినే వారు.. 100 గ్రాముల కంటే తక్కువ చికెన్ తినేవారి కంటే 27 శాతం ఎక్కువ మరణ ప్రమాదం కలిగి ఉన్నారని పరిశోధనలో తేలింది.ముఖ్యంగా పురుషులలో ఈ ప్రమాద తీవ్రత 61 శాతానికి పెరిగింది. అంటే 100 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినే పురుషుల్లో అకాల మరణం దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని తేల్చారు.

వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారికి జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్ తో చనిపోయే అవకాశం 127 శాతం ఎక్కువగా ఉందని తేలింది. మొత్తం మీద వారానికి చికెన్ 300 గ్రాముల కంటే తక్కువ తినడం మంచిదని తాజా పరిశోధన ద్వారా వెల్లడైంది. స్పైసీ, ్రై చేసిన చికెన్ ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని కూడా తెలుసుకున్నారు.

పైగా కోళ్లకు ఇంజెక్షన్లు ఇచ్చి పెంచుతున్న ఘటనలు కూడా చూస్తున్నామని, ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రోటీన్లు లభించే శాఖాహారానికి చెందిన ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

Black Salt : బ్లాక్ సాల్ట్ పోషకాల నిధి…ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో

Exit mobile version