Paneer : హెల్దీ ప్రోటీన్ అని పనీర్‌ను కొంటున్నారా?అది ప్యూర్ పాల పనీరా లేక కెమికల్ అనలాగ్ పనీర్ అనేది తెలుసా?

Paneer : మార్కెట్‌లో ఒరిజినల్ పనీర్ రూపాన్ని, టేస్ట్‌ని డిట్టో దించేస్తూ అనలాగ్ పనీర్ పేరుతో ఒక పవర్‌ఫుల్ డూప్లికేట్ వర్షన్ విచ్చలవిడిగా రాజ్యమేలుతోంది.

Paneer

జిమ్‌కి వెళ్లేవారైనా సరే, వెజ్ డైట్ ఫాలో అయ్యేవారైనా సరే ప్రోటీన్ కోసం ఎంచుకునే మొదటి ఆప్షన్ పనీరే అవుతుంది. కానీ అలా తింటున్న పనీర్ నిజంగా పాలతోనే తయారైనదేనా? లేక మన హెల్త్‌తో ఆడుకునే ఒక కెమికల్ డూప్లికేటా అనేది మాత్రం తెలీదు. ఎందుకంటే మార్కెట్‌లో ఒరిజినల్ పనీర్ రూపాన్ని, టేస్ట్‌ని డిట్టో దించేస్తూ అనలాగ్ పనీర్ పేరుతో ఒక పవర్‌ఫుల్ డూప్లికేట్ వర్షన్ విచ్చలవిడిగా రాజ్యమేలుతోంది.

చవకగా దొరకడంతో, ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో దీనినే చాలామంది అమ్ముతున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ పనీర్ వల్ల తీవ్రమైన రోగాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కల్తీ లేబులింగ్ దందాను అరికట్టడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆల్రెడీ మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఈ అనలాగ్ పనీర్‌పై నిషేధాన్ని కూడా విధించింది.

అసలు ఈ అనలాగ్ పనీర్‌కు, ప్యూర్ పనీర్‌కు తేడా ఏంటంటే.. ఒరిజినల్ పనీర్ 100% ప్యూర్ పాలతో తయారై, కేసీన్, వెయ్ వంటి పవర్‌ఫుల్ ప్రోటీన్లతో మన శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లను అందిస్తుంది.

కానీ అనలాగ్ పనీర్‌లో స్కిమ్డ్ మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్ వంటి చౌకబారు వెజిటబుల్ ఫ్యాట్స్, స్టార్చ్, కెమికల్ ఎమల్సిఫయర్లు, స్టెబిలైజర్లు వాడతారు. దీనివల్ల దీనిలో ప్రోటీన్ కౌంట్ బాగా తగ్గిపోవడమే కాకుండా, వాడే పామ్ ఆయిల్ వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇక ప్రాసెసింగ్ విషయానికొస్తే, నిజమైన పనీర్(Paneer) నేచురల్‌గా తయారైతే, అనలాగ్ పనీర్ మాత్రం కెమికల్స్ వల్ల ఒక డేంజరస్ అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్‌లా మారుతుంది. దీనివల్ల 100 గ్రాములకు 260-320 కిలోక్యాలరీల శక్తి, 20-25 గ్రాముల ఫ్యాట్‌తో పాటు విపరీతమైన సోడియం కూడా బాడీలోకి చేరుతుంది. ప్రోటీన్ అయితే 18-21 గ్రాముల కంటే తక్కువగా పడిపోతుంది. దీంతో హై బీపీ, గుండె జబ్బులు ఉన్నవారికి ఇది స్లో పాయిజన్‌లా మారుతుంది.

Paneer

నిజమైన పనీర్‌(Paneer)ను గుర్తించడానికి కొనేటప్పుడు ప్యాకెట్ వెనుక ఇంగ్రీడియంట్స్ (Ingredients) చెక్ చేయండి. అందులో వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్, ఎమల్సిఫయర్లు అని ఉంటే అది ఫేక్ అని ఫిక్స్ అయిపోవాలి. ఇక షేప్ పరంగా అయితే ప్యూర్ పనీర్ మెత్తగా ఉండి వండితే కాస్త విడిపోతుంది, అలాగే చేతితో విరిచినా సాఫ్ట్‌గా తునుగుతుంది.

కానీ అనలాగ్ పనీర్ మాత్రం రబ్బర్‌లా సాగుతూ, వండినా కూడా తన షేప్‌ మారకుండా అలాగే గట్టిగా ఉంచుకుంటుంది. కాబట్టి ప్యాకెట్ లేబుల్ పక్కాగా చదువుకుని.. మంచి బ్రాండ్స్ ఎంచుకోవడం వల్ల మనతో పాటు మన కుటుంబంలోని వారి హెల్త్‌ను కూడా కాపాడుకోవచ్చు.

Lac Bangles : చార్మినార్ చుట్టూ మెరిసే లక్క గాజుల సీక్రెట్..రాయల్ బ్యాంగిల్స్ హిస్టరీ తెలుసా?

Exit mobile version