Diet Plan:16:8 డైట్ ప్లాన్ అంటే ఏంటి? ఎవరెవరు ఈ డైట్ చేయకూడదో తెలుసా

Diet Plan : రోజులో 16 గంటల పాటు ఏమీ తినకుండా కేవలం మంచి నీళ్లు, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ వంటివి మాత్రమే తీసుకోవాలి.

Diet Plan

ఈ మధ్య కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పేరు చాలా రెగ్యులర్‌గా వినిపిస్తుంది. బరువు తగ్గడానికి , హెల్త్‌పై కేర్ తీసుకోవడానికి చాలా మంది ఎంచుకుంటున్న పాపులర్ డైట్ పద్ధతి(Diet Plan )ఇది . మనం ఏం తింటున్నామనే దాని కంటే, ఏ సమయంలో తింటున్నామనే దానిపై ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉంటుంది.

ఇంటర్మిటెంట్ డైట్‌లో రోజును రెండు భాగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి తినే సమయం (ఈటింగ్ విండో), రెండోది ఫాస్టింగ్ ఉండే సమయం (ఫాస్టింగ్ విండో) అన్నమాట. దీనిలో బాగా ఫేమస్ అయిన మెథడ్ .. 16:8 పద్ధతి. అంటే రోజులో 16 గంటల పాటు ఏమీ తినకుండా కేవలం మంచి నీళ్లు, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ వంటివి మాత్రమే తీసుకోవాలి.

మిగిలిన 8 గంటల సమయంలో మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు. 16 గంటల గ్యాప్ ఎలా తీసుకోవాలంటే..ఉదాహరణకు ఉదయం 11 గంటలకు మొదటి భోజనం చేస్తే, రాత్రి 7 గంటల కల్లా చివరి భోజనం ముగించేలా ఉండాలి.

ఈ డైట్(Diet Plan)  వల్ల కలిగే మెయిన్ లాభం వెయిట్ తగ్గడం. మనం ఎక్కువ సేపు ఫాస్టింగ్ ఉన్నప్పుడు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తగ్గి, పేరుకుపోయిన ఫ్యాట్ .. ఎనర్జీగా మారుతుంది. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీరంలో కణాల మరమ్మత్తుకు (ఆటోఫాగి) హెల్ప్ చేస్తుంది. బ్లడ్‌లో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి కూడా ఇది కీలకంగా పనిచేస్తుంది.

అయితే దీనివల్ల కొన్ని నష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఉండొచ్చు. ఈ డైట్‌లో ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో విపరీతమైన ఆకలి, నీరసం, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడొచ్చు. అలాగే ఈ డైట్‌లో సరైన పోషకాహారం తీసుకోకపోతే జుట్టు రాలడం, కండరాల క్షీణత వంటి సమస్యలు కూడా రావొచ్చు. ముఖ్యంగా తినే ఆ 8 గంటల సమయంలో జంక్ ఫుడ్ తింటే మాత్రం ఈ డైట్ వల్ల వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు.

తినే సమయంలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, చికెన్, పప్పు ధాన్యాలు, పనీర్ వంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ , తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

Diet Plan

చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, కూల్ డ్రింక్స్, మైదా పిండితో చేసిన ఫుడ్స్ , ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఉపవాసం ఉండే సమయంలో పాలు పోసిన కాఫీ, టీలు లేదా చక్కెర కలిపిన పానీయాలు అస్సలు తీసుకోకూడదు. వీలయితే స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. అలాగే ఈ సమయంలో కేవలం నిమ్మరసం చక్కెర లేకుండా తీసుకోవడం మంచిది.

ఓవర్ వెయిట్ ఉన్నవారు, టైప్ 2 డయాబెటిస్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవారు, జీర్ణక్రియ సమస్యలున్నవారు డాక్టర్ సలహాతో ఈ డైట్ చేస్తే మంచిది. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, తక్కువ బరువున్నవారు ఈ డైట్ కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు, 18 ఏళ్ల లోపు పిల్లలు , టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఇది చేయకూడదు. ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారు ఇంటర్మిటెంట్ డైట్ స్టార్ట్ చేసే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Chicken Biryani : చికెన్ దమ్ బిర్యానీ వెర్సస్ చికెన్ బిర్యానీ.. దేని రెసిపీ ఏంటి?

Exit mobile version