Chia seeds : చియా సీడ్స్, సబ్జా గింజలు,బ్లాక్ కాఫీ అన్నీ పరగడుపునే తాగాలా? ఈ 7 రోజుల ప్లాన్ ట్రై చేయండి..

Chia seeds : ఆరోగ్యానికి మంచివని చెప్పే సబ్జా, చియా సీడ్స్, డిటాక్స్ వాటర్, బ్లాక్ కాఫీ వంటివి హెల్త్‌కు చాలా మంచివే కానీ.. వాటన్నింటినీ ఒకే రోజు ఉదయాన్నే పరగడుపున తాగడం అస్సలు మంచి పద్ధతి కాదు.

Chia seeds

హలీం గింజలు, సబ్జా గింజలు, చియా సీడ్స్(Chia seeds), డిటాక్స్ వాటర్, బ్లాక్ కాఫీ…ఇలా ఇవన్నీ బాడీకి చాలా మంచివే. కానీ వీటన్నింటినీ కూడా పరగడుపునే తాగాలని వినడం వల్ల, రోజూ ఉదయాన్నే ఇన్ని లీటర్ల లిక్విడ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా తాగాలో అర్థం కాదు. నిజానికి ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ ఉన్న ప్రతి ఒక్కరికీ వచ్చే పెద్ద కన్ఫ్యూజన్ ఇది.

అయితే ఇక్కడో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆరోగ్యానికి మంచివని చెప్పే సబ్జా, చియా సీడ్స్(Chia seeds), డిటాక్స్ వాటర్, బ్లాక్ కాఫీ వంటివి హెల్త్‌కు చాలా మంచివే కానీ.. వాటన్నింటినీ ఒకే రోజు ఉదయాన్నే పరగడుపున తాగడం అస్సలు మంచి పద్ధతి కాదు. మన పొట్ట సైజు చాలా చిన్నగా ఉంటుంది.

అలాగే వాటి పనితీరు శరీరంపై ప్రభావం చూపించడానికి టైమ్ పడుతుంది. అలా అని గంట, రెండు గంటల గ్యాప్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి తాగితే జీర్ణవ్యవస్థపై విపరీతమైన లోడ్ పడుతుంది.

అందుకే వీటన్నింటినీ వారంలో వేర్వేరు రోజుల్లోకి పంచుకోవడం కానీ, రోజులో వేర్వేరు సమయాల్లో తాగడం కానీ మంచిది. ఉదాహరణకు, బరువు తగ్గడానికి లేదా శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి డిటాక్స్ వాటర్ తాగాలనుకుంటే, వారంలో ఒక మూడు రోజులు ఉదయాన్నే పరగడుపున కేవలం డిటాక్స్ వాటర్ మాత్రమే తాగడానికి ప్రయత్నించాలి.

మిగిలిన 3 రోజులు ఉదయాన్నే చియా సీడ్స్ కానీ సబ్జా గింజల వాటర్ కానీ తాగడానికి కేటాయించాలి. ఇలా రోజు మార్చి రోజు మార్చుకుంటూ తాగడం వల్ల బాడీకి అన్ని రకాల పోషకాలు అందడంతో పాటు, పొట్టకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇక హలీం గింజలు, చియా సీడ్స్(Chia seeds), సబ్జా గింజల విషయానికి వస్తే, వీటిని పరగడుపున తాగడం కుదరనప్పుడు అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. వీటిని సాయంత్రం నాలుగు , ఐదు గంటల సమయంలో, అంటే లంచ్ తిన్న రెండు మూడు గంటల తర్వాత పొట్ట కాస్త ఖాళీగా ఉన్నప్పుడు తాగొచ్చు.

ముఖ్యంగా సబ్జా గింజలు బాడీని చల్లబరుస్తాయి కాబట్టి, ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్నం కానీ సాయంత్రం పూట కానీ తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. హలీం గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయం లేదా సాయంత్రం నీళ్లలో లెమన్ యాడ్ చేసి గానీ, మజ్జిగలో గానీ కలుపుకుని తాగొచ్చు.

హలీం గింజలు వేడి చేస్తాయి కాబట్టి రోజుకు అర చెంచా, చెంచా కంటే ఎక్కువ వాడకూడదు, అదే సబ్జా లేదా చియా సీడ్స్ అయితే ఒక చెంచా వరకు వాడుకోవచ్చు.కాకపోతే చియా సీడ్స్ త్వరగానే నానిపోతాయి కాబట్టి.. తాగాలి అనుకున్నప్పుడు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది.

Chia seeds

అలాగే చాలామంది నిద్ర లేవగానే పరగడుపున బ్లాక్ కాఫీ తాగుతుంటారు. అయితే ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్స్ ఎక్కువై గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. బ్లాక్ కాఫీని ఎప్పుడూ కూడా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన గంట తర్వాత కానీ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కానీ తాగడం చాలా మంచిది. వర్కవుట్స్ చేసే అలవాటు ఉంటే, ఎక్సర్‌సైజ్ చేయడానికి ముందు బ్లాక్ కాఫీ తాగితే బాడీకి మంచి ఎనర్జీ వస్తుంది.

ఇక దోసకాయ, నిమ్మకాయ, పుదీనా వంటివి నీళ్లలో వేసి తయారుచేసే డిటాక్స్ వాటర్‌ను కేవలం ఉదయమే కాదు, రోజంతా నార్మల్ వాటర్‌కు బదులుగా కొద్దికొద్దిగా తాగినా సరిపోతుంది. చివరిగా చెప్పాలంటే అన్నీ మంచివే కదా అని ఒకే రోజు ఉదయాన్నే పొట్ట నిండా ఇలాంటి లిక్విడ్స్ పోసేయకుండా… ఒక రోజు డిటాక్స్ వాటర్, ఇంకో రోజు చియా సీడ్స్ నీళ్లు.. ఇలా మార్చుకుంటూ తాగితే మంచిది.

Look Young: వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా? ఈ 5 ఎస్-మెడ్స్ ఫాలో అవ్వండి..

Exit mobile version