Laser Hair Removal : లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందా? నల్లగా ఉన్న వారికి ఇది సేఫేనా?

Laser Hair Removal : ఎక్కడ చూసినా లేజర్ హెయిర్ రిమూవల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అవాంఛిత హెయిర్‌ను వదిలించుకోవడానికి ఇదొక బెస్ట్ అండ్ ఈజీ ఆప్షన్‌లా మారిపోయింది.

Laser Hair Removal

ఈ రోజుల్లో చాలామంది తమ స్కిన్ క్లియర్‌గా, నీట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే దీని కోసం ఎప్పటి నుంచో వాడుతున్న షేవింగ్ రేజర్లు, వ్యాక్సింగ్ వంటి పాత పద్ధతులు వారికి నొప్పితో పాటు విసుగును తెప్పిస్తున్నాయి.

స్కిన్ పైన చిన్న చిన్న గుల్లలు రావడం, నొప్పి వంటివి రావడంతో అవి చిరాకును తెప్పిస్తున్నాయి. పైగా ఇవన్నీ ఎక్కువ టైమ్‌ను వేస్ట్ చేస్తూ, కేవలం కొన్ని రోజులు మాత్రమే రిజల్ట్ ఇచ్చే పద్ధతులుగా మిగిలిపోతున్నాయి.

అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా లేజర్ హెయిర్ రిమూవల్ (Laser Hair Removal) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అవాంఛిత హెయిర్‌ను వదిలించుకోవడానికి ఇదొక బెస్ట్ అండ్ ఈజీ ఆప్షన్‌లా మారిపోయింది.

అయితే, ఈ ట్రీట్‌మెంట్ గురించి కొన్ని వార్తలు ప్రచారంలో ఉండటంతో చాలా మంది భయపడుతున్నారు. దీనిలో చాలా మందిని వేధించే మొదటి ప్రశ్న.. లేజర్ హెయిర్ రిమూవల్(Laser Hair Removal) వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుందా అనేదే. అయితే దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదని డాక్టర్లు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ ట్రీట్మెంట్‌లో ఉపయోగించే లేజర్ కిరణాలు కేవలం స్కిన్‌ పైపైన ఉండే వెంట్రుకల కుదుళ్లను మాత్రమే టార్గెట్ చేస్తాయి. అంతేకాకుండా, ఈ లేజర్లలో ఎలాంటి హానికరమైన యూవీ (UV) కిరణాలు కూడా ఉండవు.

ఈ లేజర్ కాంతి స్కిన్ లోపల ఉండే జుట్టు కుదుళ్ల వరకు మాత్రమే వెళుతుంది. బాడీ లోపలి భాగాల్లోకి ఏమాత్రం చొచ్చుకుపోదు. కాబట్టి క్యాన్సర్ భయాలు పూర్తిగా అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు.

అయితే, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నవారికి చర్మంపై కాస్త ఎరుపుదనం ,చిన్నపాటి మంట వంటివి అనిపించొచ్చు. కానీ ఇవి కొన్ని గంటల్లోనే పూర్తిగా తగ్గిపోతాయి. అయితే ఈ ట్రీట్మెంట్ కోసం మంచి డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో, లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న క్లినిక్స్‌ను ఎంచుకుంటేనే మంచిది.

అలాగే బ్లాక్ స్కిన్, ఎండకు కమిలిన స్కిన్ టోన్ ఉన్న వారికి లేజర్ ట్రీట్‌మెంట్ సురక్షితం కాదని ఇంకొక టాక్ కూడా నడుస్తోంది. కానీ అది కూడా అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటి లేటెస్ట్ లేజర్ మిషన్లు చర్మానికి, వెంట్రుకల రంగుకు మధ్య ఉన్న తేడాను చాలా క్లియర్‌గా గుర్తిస్తాయి. కాబట్టి స్కిన్ టోన్ ఏదైనా.. నల్లగా ఉన్న వారికి కూడా ఇప్పుడు లేజర్ ట్రీట్‌మెంట్ ఎంతో సేఫ్ గా పనిచేస్తోంది.

Laser Hair Removal

చివరిగా, చాలా మంది కేవలం ఒక్క సిట్టింగ్‌తోనే హెయిర్ మొత్తం పర్మినెంట్‌గా పోతుందని అనుకుంటారు. అయితే ఒకే ఒక్క సిట్టింగ్‌లో ఛేంజ్‌ను గమనించొచ్చు కానీ, పూర్తి రిజల్ట్ రాదు.ఎందుకంటే మన శరీరంలో జుట్టు అనేది వేర్వేరు దశల్లో పెరుగుతూనే ఉంటుంది.
అందువల్ల ప్రతీ వెంట్రుక కుదురును క్లియర్‌గా టార్గెట్ చేసి, లాంగ్ టర్మ్ రిజల్ట్ పొందాలంటే మాత్రం స్పెషలిస్టులు సూచించిన విధంగా కొన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి.

ఏదేమైనా, మీ స్కిన్ తత్వాన్ని బట్టి ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు ఒక మంచి స్కిన్ స్పెషలిస్ట్‌ను కలవాలి. అక్కడ మీ అనుమానాలన్నిటినీ క్లియర్ చేసుకున్న తర్వాతే.. నెక్స్ట్ స్టెప్ వేయడం మంచిది.

People : తప్పు చేసినవాడు హ్యాపీగా నిద్రపోతుంటే, మంచివాళ్లే ఎందుకు ఏడుస్తారు?..దీనిపై సైకాలజీ ఏం చెబుతుంది.

జస్ట్ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version