Metformin
మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ పేరు ఈమధ్య చాలామంది దగ్గర వినిపిస్తోంది. దీనిని మెయిన్‌గా టైప్-2 డయాబెటిస్ (Type-2 Diabetes) కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది కేవలం డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికే కాకుండా బాడీలో మెటబాలిజాన్ని మెరుగుపరచడానికి అలాగే ఇతర హెల్త్ ఇష్యూస్‌కు చెక్ పెట్టడానికి కూడా ఉపయోగపడుతుందని డాక్టర్లు అంటున్నారు.
ఇది టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్‌లో గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించడానికి పనిచేస్తుంది. వేరే మధుమేహం మాత్రల లాగా ఇది ఇన్సులిన్‌ను డైరెక్టుగా ప్రొడ్యూస్ చేయదు. దీనికి బదులుగా లివర్ అనవసరంగా ఎక్కువ గ్లూకోజ్‌ను తయారు చేయకుండా అడ్డుకుంటుంది. అలాగే బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంటే మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్‌ను కణాలు సమర్థవంతంగా వాడుకునేలా చేస్తుంది.
మహిళల్లో వచ్చే పీసీఓఎస్ లేదా పీసీఓడీ (PCOS/PCOD)ప్రాబ్లెమ్‌కు కూడా మెట్‌ఫార్మిన్‌ను ఉపయోగిస్తారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, హార్మోనల్ బ్యాలెన్స్‌ను మెరుగుపరచడం ద్వారా పీరియడ్స్ సరికావడానికి, సంతానోత్పత్తి అవకాశాలు పెరగడానికి సహాయపడుతుంది.
అలాగే ఇన్సులిన్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడం ద్వారా ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి కూడా కొంతవరకు తోడ్పడుతుంది. అంతేకాకుండా బాడీలో మంటను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
మెట్‌ఫార్మిన్ వాడటం వల్ల అనేక రకాల ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఇది ఫుడ్ తిన్న తర్వాత అలాగే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు పెరిగే గ్లూకోజ్ లెవల్స్‌ను చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. కొన్ని డయాబెటిస్ టాబ్లెట్ల వల్ల రక్తంలో షుగర్ సడన్‌గా పడిపోయే (హైపోగ్లైసీమియా) ఛాన్స్ ఉంటుంది.
కానీ మెట్‌ఫార్మిన్(Metformin) వల్ల అలాంటి భయం చాలా తక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ,ట్రైగ్లిజరైడ్లను తగ్గించి, గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది. చాలా రకాల డయాబెటిస్ మాత్రలు వాడితే బరువు పెరుగుతారు, కానీ మెట్‌ఫార్మిన్ వాడితే బరువు పెరగకుండా స్థిరంగా ఉండటమే కాదు కొంతమందిలో బరువు తగ్గడం కూడా కనిపిస్తుంది. అండ్ ఇది చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉండే బెస్ట్ మెడిసిన్.
అదే సమయంలో దీని వల్ల కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. టాబ్లెట్లు వేసుకోవడం స్టార్ట్ చేశాక కొత్తలో కొంతమందికి కడుపులో తిప్పడం, వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం, ఆకలి తగ్గిపోవడం, నోటిలో లోహపు రుచి రావడం వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయి.
అయితే ఆహారంతో పాటు లేదా తిన్న వెంటనే టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని..డాక్టర్లు అంటున్నారు. అంతేకాదు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా ఇవి ఒకటి లేదా రెండు వారాల్లో తగ్గిపోతాయని చెబుతున్నారు.
అలాగే మెట్‌ఫార్మిన్(Metformin) టాబ్లెట్‌ను సంవత్సరాల తరబడి వాడేవారిలో బాడీలో విటమిన్ బి12 శోషణ తగ్గిపోతుంది. దీనివల్ల నరాల బలహీనత, కాళ్లలో తిమ్మిర్లు, నీరసం రావొచ్చు. కాబట్టి బి12 స్థాయిలను చెక్ చేయించుకుంటూ వీలయితే సప్లిమెంట్స్‌ను వాడటం మంచిది.
అలాగే కిడ్నీలు సరిగ్గా పనిచేయని వారికి, కాలేయ సమస్యలు ఉన్నవారికి లేదా బాగా లిక్కర్ తాగే అలవాటు ఉన్నవారికి ల్యాక్టిక్ అసిడోసిస్ అనే ప్రమాదకరమైన పరిస్థితి వచ్చే అవకాశం కొంతమందిలో చాలా అరుదుగా ఉంటుంది. మెట్‌ఫార్మిన్ ఎంత మంచిది అయినా కూడా.. దీనిని డాక్టర్ సలహా లేకుండా అస్సలు వాడకూడదు.
Bank Jobs : రూ. 45 వేలకు పైగా జీతంతో సొంత జిల్లాలోనే బ్యాంక్ ఉద్యోగం..ఎలా అప్లై చేయాలి?
