Weight loss : డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమేనట.. ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్న 4 స్టెప్స్ ఇవే..

Weight loss: అత్యంత కఠినమైన పద్ధతులు కాకుండా మన డైలీ లైఫ్‌కు అలవాటు పడేలా ఉండే విధానాలే పర్మనెంట్ రిజల్ట్స్ ఇస్తాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

Weight loss

బరువు తగ్గడం (Weight loss)అనేది చాలా మంది అసాధ్యమైన, చాలా కష్టమైన పనిగా అనుకుంటారు. అందుకే త్వరగా ఫలితాలు రావాలని మార్కెట్‌లో దొరికే రకరకాల డైట్లను అనుసరించి..తర్వాత నిరాశ చెందుతారు. అయితే, అత్యంత కఠినమైన పద్ధతులు కాకుండా మన డైలీ లైఫ్‌కు అలవాటు పడేలా ఉండే విధానాలే పర్మనెంట్ రిజల్ట్స్ ఇస్తాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. దాదాపు 900 మందికి పైగా వ్యక్తులు తమ బరువును మెల్లగా తగ్గించుకోవడానికి వాడిన 4-స్టెప్ ప్లాన్ గురించి వివరించారు.

ఈ స్టెప్‌లో మొదటిది , అత్యంత ఇంపార్టెంట్ అయినది పోషకాహారం. డైట్ కోసం మీ లైఫ్‌ను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు తగ్గట్టుగా డైట్‌ను మలచుకోవాలి. ఎప్పుడూ కూడా మీ శరీరం బరువును కంట్రోల్‌లో ఉంచడానికి అవసరమైన క్యాలరీల కంటే 500 క్యాలరీలను తక్కువగానే తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

అలాగే, కండరాల పుష్టికి ప్రతి పౌండు బాడీ వెయిట్‌కు 0.8 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. గందరగోళం లేకుండా ఉండటానికి మీకు బాగా నచ్చిన ఒక 5 – 10 ఆరోగ్యకరమైన వంటకాలను ఎంచుకుని, వాటినే రెగ్యులర్‌గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రయాణాల్లో, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఏది పడితే అది తినకుండా ఉండటానికి, ముందే మీ ఆర్డర్‌ను నిర్ణయించుకోవాలి.

రెండవ అడుగు ఎక్సర్‌సైజ్. రోజూ జిమ్‌లో గంటల తరబడి గడపాల్సిన అవసరం లేకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు(Weight loss) వారానికి 3 నుంచి 4 సార్లు కానీ లేదా ప్రతీ రోజు 45 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయడం సరిపోతుంది. మీ వీలును బట్టి శరీరంలోని పై భాగం, కింది భాగం, మొత్తం శరీరానికి సంబంధించిన రకరకాల వ్యాయామాలను ఎంచుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఫాలో అవ్వాల్సిన సూత్రం ఏమిటంటే ‘ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్’. అంటే లాస్ట్ వీక్ కంటే ఈ వారం కొంచెం ఎక్కువ బరువులు ఎత్తడం , వ్యాయామ తీవ్రతను పెంచుతూ మీ శరీరానికి మీరు సవాల్ విసరాలి.

మూడవ స్టెప్ శారీరక శ్రమను పెంచుకోవడం. మనం తిన్న ఆహారం శక్తిగా మారి ఖర్చవ్వడానికి కదలిక చాలా అవసరం. కేవలం 2,000 అడుగులు నడిచే వ్యక్తి 10,000 అడుగుల టార్గెట్‌ను యాడ్ చేసుకుంటే ..అదనంగా రోజుకు 400 నుంచి 500 క్యాలరీలు ఖర్చవుతాయి. అంటే ఇది వారానికి ఒక పౌండు ఫ్యాట్‌ను కరిగించడానికి సమానమన్నమాట. దీంతో పాటు వారానికి రెండు మూడు సార్లు 20 – 40 నిమిషాల పాటు సాధారణ కార్డియో వ్యాయామాలు, వేగంగా నడవడం వంటివి మీ డైలీ లైఫ్‌లో భాగం చేసుకోవాలి.

Weight loss

చివరిది అతి ముఖ్యమైనది స్టెప్ .. నిద్ర. నిద్ర తక్కువైతే బాడీలో ఆకలిని పెంచే హార్మోన్లు రిలీజవుతాయి. దీంతో జంక్ ఫుడ్ తినాలనే కోరికను పెంచుతాయి. అందుకే రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. నిద్రపోయే ముందు 30 నిమిషాల పాటు ఫోన్ , టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. అలాగే పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే డిన్నర్ ముగించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది.

ఈ నాలుగు సూత్రాలను, లేదా స్టెప్‌లను తూచా తప్పకుండా పాటిస్తే వెయిట్‌ను అదుపులో ఉంచుకుంటారు. అలాగే వయస్సు పెరిగినా సరే మీరు ఎంతో ఉత్సాహంగా , దృఢంగా ఉంటారు. 40 ఏళ్ల వయస్సులో ఈ 4 అలవాట్లు పాటించే వ్యక్తి తన 50 ఏళ్ల ప్రాయంలో ఇతరుల కంటే చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు.

Barry Marshall:వైద్య లోకాన్ని గడగడలాడించిన డాక్టర్ సాహసం.. నోబెల్ విజేత బారీ మార్షల్ వీరగాథ మీకు తెలుసా?

Exit mobile version