Pregnancy
గర్భధారణ సమయంలో మహిళలు యూజ్ చేసే కొన్ని రకాల కాస్మెటిక్ వస్తువులు, ప్లాస్టిక్ సామాగ్రి, పర్సనల్ కేర్ ప్రొడెక్ట్‌లలో ఉండే కెమికల్స్ తల్లితో పాటు కడుపులోని శిశువు ఆరోగ్యంపై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందని ప్రముఖ వైద్య సంస్థ ఎయిమ్స్ (AIIMS) నేతృత్వంలో జరిగిన ఒక తాజా స్టడీ వెల్లడించింది.
ముఖ్యంగా ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని పిలిచే కొన్ని కెమికల్స్ గర్భిణుల బాడీలోకి ప్రవేశించి, అక్కడి హార్మోన్ల సహజ సిద్ధమైన పనితీరును పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉందని పరిశోధకులు స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్నారు.
ఈ పరిశోధనలో మరికొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి. గర్భిణుల శరీరంలో ఫ్తాలేట్స్, పారాబెన్స్ వంటి హానికర రసాయనాల ఆనవాళ్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో బయటపడింది.
మనమంతా డైలీ వాడే రకరకాల సుగంధ ద్రవ్యాలు, బాడీ లోషన్లు, షాంపూలు, మేకప్ కిట్స్, ప్లాస్టిక్ కంటైనర్ల ద్వారానే ఇవి చాలా ఈజీగా మహిళల బాడీలోకి చేరిపోతున్నట్లు తేలింది. ఇవి బాడీలో ఉండే హార్మోన్ల సమతుల్యతను మార్చడంతో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రారంభం అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు..
అందుకే గర్భధారణ(Pregnancy) సమయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్యూటీ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ వాడకాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికే చూడాలి. మార్కెట్లో ఏ ప్రొడక్ట్ కొన్నా సరే, దాని వెనుక ఉండే ఇంగ్రీడియెంట్స్ లిస్ట్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఆ తర్వాతే కొనడం అలవాటు చేసుకోవాలి.
ముఖ్యంగా పారాబెన్స్, ఫ్తాలేట్స్, ట్రైక్లోసన్, రెటినాయిడ్స్ వంటి కెమికల్స్ ఉన్న బ్రాండ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఘాటైన సువాసనలు వచ్చే పర్ఫ్యూమ్స్ లేదా క్రీమ్స్ కంటే, అస్సలు స్మెల్ లేని లేదా కెమికల్స్ చాలా తక్కువగా ఉండే నేచురల్ ప్రొడక్ట్స్‌ను ఎంచుకోవడమే మంచిది. స్కిన్ కేర్ లేదా బ్యూటీ కిట్స్‌ని ఉపయోగించే ముందు ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి సలహా తీసుకుంటే ఇంకా మంచిది.
అయితే గర్భవతిగా(Pregnancy) ఉన్న సమయంలో వాడే ..తాము వాడే ప్రతీ ప్రొడెక్ట్ హానికరమని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకున్న కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఉన్న వస్తువులను కొనేటప్పుడు మాత్రం కాస్త చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవడం, అనుమానం ఉంటే వెంటనే డాక్టర్లను అడిగి తెలుసుకోవడం చేయాలి. అప్పుడే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
Vaibhav : తొందరపాటే కొంపముంచిందా ?..వైభవ్ విషయంలో బీసీసీఐపై విమర్శలు
