Liver Cirrhosis
రోజురోజుకు మారుతున్న ఆహార అలవాట్లతో పాటు అస్సలు ఫిజికల్‌గా శ్రమ లేకపోవడం వల్ల .. చాలా మంది ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్యతో బాధపడుతున్నారు. మనిషి ఒంట్లో ఉండే కాలేయ కణాలలో సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు.
మొదట్లో దీని లక్షణాలు పెద్దగా బయటపడకపోవడం వల్ల డాక్టర్లు దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తుంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే మెల్లగా లివర్ దెబ్బతిని ప్రాణాంతక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి విపరీతంగా లిక్కర్ తాగడం వల్ల వచ్చేది (Alcoholic Fatty Liver), కాగా రెండోది లిక్కర్ తాగే అలవాటు లేకపోయినా వచ్చే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NAFLD).
లిక్కర్ తాగని వాళ్లలో కూడా ఈ ఫ్యాటీ లివర్ రావడానికి జంక్ ఫుడ్స్ విపరీతంగా తినడం, ఓవర్ వెయిట్, డయాబెటిస్, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం వంటివి ముఖ్య కారణాలుగా చెబుతారు. ముఖ్యంగా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేసే వారిలో ఈ(Liver Cirrhosis) సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
మొదటి దశలో ఫ్యాటీ లివర్ ఉన్నట్లు అస్సలు తెలీదు. కానీ ఫ్యాట్ పేరుకుపోయే కొద్దీ బాడీలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఎప్పుడూ లేనంతగా విపరీతమైన అలసట, నీరసంగా అనిపించడం, కొద్దిగా పనిచేసినా ఓపిక లేకపోవడం వంటివి జరుగుతాయి. అలాగే కడుపులో కుడివైపు పైభాగంలో అంటే సరిగ్గా లివర్ ఉండే చోట ఏదో బరువుగా ఉన్నట్లు, నొక్కినట్లు అన్ ఈజీగా అనిపిస్తుంది. ఆకలి బాగా తగ్గిపోవడం, తిన్న అన్నం అరగకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండటం కూడా దీని మెయిన్ లక్షణాలుగా డాక్టర్లు చెబుతారు.
ఈ సమస్యను గాని స్టార్టింగ్‌లోనే గుర్తించి లైఫ్‌స్టైల్ మార్చుకోకపోతే, లివర్ లోపల వాపు (ఇన్‌ఫ్లమేషన్) మొదలవుతుంది. దీనిని స్టీటోహెపటైటిస్ అంటారు. దీనివల్ల కాలేయ కణాలు మెల్లమెల్లగా చనిపోవడం స్టార్టవుతాయి. ఇంకా లేట్ చేస్తే లివర్ మొత్తం గట్టిపడిపోయి, ఆ పైన మచ్చలు పడిపోయే లివర్ సిర్రోసిస్(Liver Cirrhosis) అనే భయంకరమైన స్టేజ్‌కి వెళ్తుంది.
ఈ లివర్ సిర్రోసిస్(Liver Cirrhosis) స్టేజ్‌కి వస్తే కాలేయం తన పని తాను సరిగ్గా చేయలేదు. చివరికి లివర్ పూర్తిగా ఫెయిల్ అవ్వడం, లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. లివర్ సిరోసిస్ వస్తే కడుపులో నీరు చేరడం, కాళ్లు వాపులు రావడం, బ్లడ్ నష్టపోవడం వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురవుతాయి.
అయితే ఒక మంచి విషయం ఏంటంటే, మన లైఫ్ స్టైల్ లో సరైన మార్పులు చేయటం ద్వారా ఈ ఫ్యాటీ లివర్ సమస్యను నూటికి నూరు శాతం మళ్లీ నార్మల్ స్టేజ్‌కి తెచ్చుకోవచ్చు అంటే రివర్స్ చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. దీని కోసం డైలీ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు , తృణధాన్యాలను భాగం చేసుకోవాలి. ప్యాకెట్లలో వచ్చే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, మైదా, ఎక్కువ పంచదార ఉండే పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేయాలి.
రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా వాకింగ్ చేయడం, యోగా లేదా ఏదైనా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల లివర్‌లో పేరుకుపోయిన ఎక్స్‌ట్రా ఫ్యాట్ కరిగిపోతుంది. వెయిట్‌ను ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుకోవడం, షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం , ఏడాదికి ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్లి అల్ట్రాసౌండ్ , లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT) చేయించుకుంటే.. ఫ్యాటీ లివర్ బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Rishikesh : హిమాలయాల ఒడిలో అద్భుత ఆధ్యాత్మిక నగరం.. టూరిస్టులను కట్టిపడేస్తున్న రిషికేశ్ అందాలు
