Impulse Control Disorder:మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ కావొచ్చు..

Impulse Control Disorder: మెదడులోని తార్కిక ఆలోచనలు చేసే భాగం కంటే, ఎమోషన్స్‌ను ప్రేరేపించే భాగం క్షణికావేశంలో చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతుంది.

Impulse Control Disorder

మనిషి తన ప్రయాణంలో ఎదగడం అంటే కేవలం సంపాదనో, డిగ్రీనో అనుకుంటారు కానీ ఇది కాదు. నిజమైన ఎదుగుదల అంటే మన భావోద్వేగాలను మనం ఎంతలా కంట్రోల్ చేసుకున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారైనా కూడా, అందరితో ఎంతో మర్యాదగా ప్రవర్తించే వ్యక్తులు కూడా ఒక్కోసారి చిన్న మాటకో, సంఘటనకో అతి కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.

ఫోన్లను విసిరికొట్టడం, ఎదుటివారిని అసభ్య పదజాలంతో దూషించడం, చివరికి అవతలి వారిపై చేతులు చేసుకోవడంతో పాటు తనను తాను గాయపరచుకునే వరకూ వెళ్తుంటారు. అయితే బయట ప్రపంచానికి ఇది కేవలం కోపంగా కనిపిస్తుంది కానీ, దీని వెనుక ఒక బలమైన మానసిక సంఘర్షణ దాగి ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

సాధారణంగా ఇలాంటి ప్రవర్తనను సైకాలజీలో ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ (Impulse Control Disorder) అని లేదంటే ఎమోషనల్ డిస్కోగ్యులేషన్ అని పిలుస్తుంటారు. అంటే వారి మెదడులోని తార్కిక ఆలోచనలు చేసే భాగం కంటే, ఎమోషన్స్‌ను ప్రేరేపించే భాగమే క్షణికావేశంలో చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతుంది. ఆ సమయంలో వారికి తామెక్కడ ఉన్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనే విచక్షణ వారిలో పూర్తిగా పోతుంది.

Impulse Control Disorder

చదువుకున్న వారు కూడా ఇలా వింతగా , వయొలెంట్‌గా ప్రవర్తించడానికి కారణం వారిలోని ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ లేదా లోతైన అసంతృప్తి కావొచ్చు. చిన్నప్పుడు వారు గమనించిన గొడవలు కానీ ఇప్పుడు వారికి దక్కాల్సిన గుర్తింపు దక్కకపోవడం వంటివి వారి మనసు లోపల పెరుగుతూ ఒక రకమైన క్రోధాన్ని నింపి ఉంచుతాయి. అది ఒక చిన్న నెపం దొరకగానే పెద్ద లావాలా బద్దలవుతుంది.

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్( Impulse Control Disorder)తో బాధపడే వ్యక్తులు తమ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్లుగా భావిస్తారు. అవతలి వారు చిన్న మాట అన్నా కూడా తమ వ్యక్తిత్వంపై జరిగిన దాడిగా భావించి, దానిని తిప్పికొట్టడానికి మృగాల్లా ప్రవర్తిస్తారు. అయితే ఈ ప్రవర్తనను మార్చడం సాధ్యమేనా అంటే, అది ఆ వ్యక్తి తలుచుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది. కోపం అనేది బలహీనత అని, అది బలం కాదని వారే తెలుసుకోవాలి. తమ కోపం వల్ల సంబంధాలు ఎంతలా దెబ్బతింటున్నాయో, సొసైటీలో తమ విలువ ఎలా పడిపోతుందో గుర్తించాలి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version