Megaverse : నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ హంగామా.. సంక్రాంతికి చిరు మెగావర్స్ డిజిటల్ ఎంట్రీ..
Megaverse : మెగావర్స్ షోలో ప్రతి ఎపిసోడ్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే కొన్ని కీలక ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
Megaverse
మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి సరికొత్త అవతారంలో అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మెగావర్స్(Megaverse) పేరుతో రెడీ అవుతున్న ఒక సంచలనాత్మక టాక్ షోకు చిరు..హోస్ట్ వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఈమధ్య అఫీషియల్‌గా ప్రకటించడంతో పాటు నిర్మాణ పనులను కూడా స్పీడప్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ మెగావర్స్(Megaverse) గ్రాండ్ షోను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ సుదీర్ఘ సినీ ప్రస్థానం, చిరు లైఫ్‌లో చోటుచేసుకున్న మలుపులు, వ్యక్తిగత జ్ఞాపకాలు, పొలిటికల్ జర్నీతో పాటు సినీ ప్రముఖులతో ఆయనకున్న అనుబంధాన్ని ఈ షో ద్వారా సరికొత్తగా ఆవిష్కరిస్తూ ఆడియన్స్‌తో పంచుకోనున్నారు.
ఈ మెగావర్స్ షోలో ప్రతి ఎపిసోడ్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే కొన్ని కీలక ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ కోసం లోకనాయకుడు కమల్ హాసన్ హాజరై చిరంజీవితో ఉన్న దశాబ్దాల స్నేహాన్ని పంచుకోబోతున్నారు. అలాగే మరో ఎపిసోడ్లో టాలీవుడ్ హాస్య నటులు బ్రహ్మానందం, సునీల్, సత్య పాల్గొని నవ్వుల పూవులు పూయించడానికి రెడీ అయ్యారు. చిరుతో తమకున్న అనుభవాలను హాస్యభరితంగా పంచుకున్న ఈ ఎపిసోడ్ ఆడియన్స్‌ను ఎంతగానో అలరించనుంది.
ఇదిలా ఉండగా, రీసెంట్గా అక్కినేని కుటుంబం మొత్తం ఈ షోలో సందడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ నలుగురూ కలిసి ఒకే ఎపిసోడ్లో చిరంజీవితో ముచ్చటిస్తూ తమ గురించి ఆడియన్స్‌కు తెలీని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునల మధ్య ఉన్న సత్సంబంధాలు, వారి ఫ్యామిలీల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ ఎపిసోడ్లో మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ అక్కినేని స్పెషల్ ఎపిసోడ్‌ను వచ్చే ఏడాది 2027 సంక్రాంతి పండుగ కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరు అండ్ నాగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులందరూ కూడా మెగావర్స్ బిగ్ ఓటీటీ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





