Air India : విదేశాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపర్ ఆఫర్.. విమాన టికెట్ ధరలు భారీగా డౌన్..

Air India : యూరప్ దేశాలు, యూకే వైపు వెళ్లే విమాన సర్వీసులపై కూడా ఎయిరిండియా సర్‌ఛార్జీలను భారీగా తగ్గించింది. అంతకుముందు ఈ రూట్లలో ఉన్న 205 డాలర్ల ఎక్స్‌ట్రా ఛార్జీని ఇప్పుడు 125 డాలర్లకు తగ్గించింది

Air India

విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని.. ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీ ఎయిరిండియా(Air India) ఒక శుభవార్త చెప్పింది. గతంలో గ్లోబల్ మార్కెట్‌లో విమాన ఇంధన (ATF) ధరలు ఆకాశాన్ని తాకిన సమయంలో ఫ్లైట్ టికెట్లపై విధించిన అదనపు ఫ్యూయల్ సర్‌ఛార్జీ భారాన్ని ఇప్పుడు భారీగా తగ్గిస్తూ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

పశ్చిమాసియా దేశాల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ మేఘాలు మెల్లగా తొలగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. దీంతోనే ఎయిరిండియా(Air India) ఇప్పుడు టికెట్ రేట్లను తగ్గించి ప్రయాణీకులకు ఊరటనిచ్చింది.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు విమానాల్లో ప్రయాణించే వారికి మంచి లాభం చేకూరబోతోంది. ఆ దేశాలకు వెళ్లే ఫ్లైట్ టికెట్ ధరలు ఇప్పుడు ముందు కంటే చాలా తక్కువకే రాబోతున్నాయి.

హయ్యర్ స్టడీస్‌ కోసం ఫారిన్ వెళ్లే స్టూడెంట్స్‌కు, ఐటీ ఎంప్లాయిస్‌ అలాగే బిజినెస్ పనుల కోసం తరచూ ఇంటర్నేషనల్ జర్నీ చేసే మధ్యతరగతి వర్గాలకు ఎయిరిండియా తగ్గించిన ఈ ఫ్యూయల్ ఛార్జీలు ఆర్థికంగా చాలా పెద్ద సపోర్ట్ ఇస్తాయని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

Air India

అమెరికా, ఆస్ట్రేలియా వెళ్లే లాంగ్ రూట్ ఫ్లైట్ టికెట్లపై గతంలో వసూలు చేసిన ఎక్స్‌ట్రా ఇంధన సర్‌ఛార్జీని 280 డాలర్ల నుంచి ఏకంగా 200 డాలర్లకు కుదించారు. అంటే సుమారు ఒకేసారి 80 డాలర్ల వరకూ భారం తగ్గింది. ఈ తగ్గింపుల వల్ల లాంగ్ జర్నీలు చేసే కుటుంబాలకు వేల రూపాయల ఆదా అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

అలాగే యూరప్ దేశాలు, యూకే వైపు వెళ్లే విమాన సర్వీసులపై కూడా ఎయిరిండియా సర్‌ఛార్జీలను భారీగా తగ్గించింది. అంతకుముందు ఈ రూట్లలో ఉన్న 205 డాలర్ల ఎక్స్‌ట్రా ఛార్జీని ఇప్పుడు 125 డాలర్లకు తగ్గించింది. ఈ సవరించిన కొత్త టికెట్ కాస్ట్ ఈ జూలై 1 నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు కంట్రోల్‌లోకి రావడం వల్ల ఏవియేషన్ రంగానికి, ప్రయాణీకులకు ఇద్దరికీ కూడా ఇది మంచి ఊరటనిచ్చే అంశం.

Brown Rice : బ్రౌన్ రైస్ తింటూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే..

Exit mobile version