HealthLatest News

Brown Rice : బ్రౌన్ రైస్ తింటూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే..

Brown Rice : నిజంగానే తెల్ల అన్నం మానేసి బ్రౌన్ రైస్ తింటే వెయిట్ లాస్ అవుతారా అంటే అదంతా భ్రమ అని ఆరోగ్య నిపుణులు కొట్టిపడేస్తున్నారు.

Brown Rice

ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా మంది నానా పాట్లు పడుతున్నారు. ఆఫీస్ సీట్లలో గంటల తరబడి కూర్చోవడం, కనీస ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంతో చాలా మంది ఒబెసిటీ బారిన పడుతున్నారు. వెయిట్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి కొందరు జిమ్‌కి వెళ్తుంటే.. మరికొందరు తిండి తగ్గించి డైటింగ్ బాట పడుతున్నారు.

అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్లు చేసే మొదటి పని ఏంటంటే.. వైట్ రైస్‌ను పక్కన పెట్టి బ్రౌన్ రైస్ తినడం. మరి నిజంగానే తెల్ల అన్నం మానేసి బ్రౌన్ రైస్(Brown Rice) తింటే వెయిట్ లాస్ అయిపోతారా అంటే అదంతా భ్రమ అని ఆరోగ్య నిపుణులు కొట్టిపడేస్తున్నారు. దీనికి కారణాలను కూడా వివరిస్తున్నారు.

మనం తినే వైట్ రైస్ తెల్లగా మెరవడం కోసం దానిపై ఉండే పొరలన్నింటినీ పాలిష్ చేసి తీసేస్తారు. కానీ బ్రౌన్ రైస్(Brown Rice) అలా కాదు, దానిపై ఉండే తవుడు, మొలక పొరలను అలాగే ఉంచుతారు. అందుకే బ్రౌన్‌ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి.

అలాగే ఈ అన్నంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయదు, మనం తినే క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అంతేకాదు ఇది పొట్టలో నెమ్మదిగా అరగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగకుండా కంట్రోల్‌లో ఉంటాయి.

చాలా మంది బ్రౌన్ రైస్(Brown Rice) హెల్తీ ఫుడ్ కదా అనుకుని నార్మల్ రైస్‌లాగే ఎక్కువగా తినేస్తుంటారు. అయితే ఇలా చేయకూడదట ..ఎందుకంటే వైట్ రైస్‌లో ఎన్ని క్యాలరీలు ఉంటాయో, బ్రౌన్ రైస్‌లోనూ సుమారు అంతే క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బ్రౌన్ రైస్ కదా అని ఎక్కువ తింటే బరువు తగ్గిపోతాం అనుకోవడం కరెక్ట్ కాదు.

అలాగే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అందరి జీర్ణవ్యవస్థకి దీనిని తట్టుకునే శక్తి ఉండదు. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవాళ్లు బ్రౌన్ రైస్ తింటే త్వరగా అరగకపోవడం వల్ల పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది.

అలాంటి వాళ్లు ఒకేసారి బ్రౌన్ రైస్ తినకుండా, మొదట్లో కొద్దిగా వైట్ రైస్, కొద్దిగా బ్రౌన్ రైస్ కలిపి వండుకుని తర్వాత బ్రౌన్ రైస్‌కు షిప్ట్ అయితే మంచిది. అలాగే ఈ బియ్యం గట్టిగా ఉంటాయి కాబట్టి వండడానికి ఒక గంట ముందే నీటిలో నానబెట్టుకుంటే అన్నం మెత్తగా ఉడకడంతో పాటు తిన్నాక ఈజీగా అరుగుతుంది.

మీరు వైట్ రైస్ తిన్నా, బ్రౌన్ అన్నం తిన్నా సరే.. ప్లేట్‌లో అన్నం పరిమాణాన్ని తగ్గించి కూరలు, ఆకుకూరలు, పప్పు , గుడ్లు, చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్‌ను ఎక్కువగా పెట్టుకోవాలి. ఒకవైపు బిర్యానీలు, స్వీట్లు, ఫ్రైలు తింటూ.. కేవలం అన్నం ఒక్కటే మారిస్తే ఏమీ ఉపయోగం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Brown Rice
Brown Rice

మీకు వైట్ రైస్ తినడమే ఇష్టమైతే దాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కాకపోతే క్వాంటిటీ కంట్రోల్ అంటే పోర్షన్ సైజ్ చాలా ముఖ్యం.అలాగే అన్నాన్ని గబగబా మింగేయకుండా మెల్లగా నములుతూ తినాలి. దీంతో పాటు ఎలాంటి ఒత్తిడులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటూ, బాగా నీళ్లు తాగుతూ లైఫ్‌స్టైల్ మార్చుకుంటేనే అనుకున్న రిజల్ట్ వస్తుంది.

ఇంకా చెప్పాలంటే వెయిట్ లాస్ అనేది కేవలం తినే రైస్‌ను మార్చినంత మాత్రాన జరిగిపోయే మ్యాజిక్ కాదు. మనం రోజంతా తీసుకునే మొత్తం క్యాలరీల లెక్కతో పాటు సరైన వ్యాయామం, రాత్రిపూట కంటినిండా నిద్రపైన ఆధారపడి ఉంటుంది.

Date Of Birth : ఈ శుక్రవారం వీరికి తిరుగులేని సక్సెస్.. మీరు మాత్రం గొడవల్లో అస్సలు తలదూర్చొద్దు..

Related Articles

Back to top button