Bilibili : ఫస్ట్ వీడియోకే చేతికి డబ్బులు..యూట్యూబ్‌కి పోటీగా గ్లోబల్ రేసులోకి కొత్త యాప్ బిలిబిలి..

Bilibili : చైనాలో ఇప్పటికే దుమ్మురేపిన ఈ బిలిబిలి.. ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా యూట్యూబ్‌కి మైండ్ బ్లాకింగ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.

Bilibili

ఇప్పటి వరకూ ఆన్‌లైన్ వీడియో వరల్డ్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన యూట్యూబ్‌ సింహాసనాన్ని కదిలించడానికి ఒక కొత్త ప్లేయర్ గ్లోబల్ రేసులోకి దిగాడు. ఇన్నాళ్లూ కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్‌ను మించిన గతి లేదనుకుంటున్న సమయంలో, చైనాకు చెందిన బిలిబిలి అనే యాప్ అంతర్జాతీయ మార్కెట్లో జెండా పాతడానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది.

సొంత దేశంలో ఇప్పటికే దుమ్మురేపిన ఈ బిలిబిలి(Bilibili).. ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా యూట్యూబ్‌కి మైండ్ బ్లాకింగ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. నెలకు సుమారు 37 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో ఊపుమీదున్న ఈ యాప్, ఇటీవల ఇంటర్నేషనల్ వెర్షన్‌ను కూడా మార్కెట్‌లోకి వదిలింది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండగా.. త్వరలోనే యాపిల్ ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుంది.

కాగా ఈ కొత్త యాప్ యూట్యూబ్‌తో ఎలా పోటీ పడబోతోందనేది ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. యూట్యూబ్‌లో ఉన్నట్టే దీనిలో కూడా వీడియోలు అప్‌లోడ్ చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ కంపెనీ మెయిన్‌గా ఈ తరం యువతను, క్రియేటర్లను టార్గెట్ చేస్తోంది.

అంతర్జాతీయ స్థాయి కంటెంట్‌ను పెంచడం, లోకల్ పీపుల్ టేస్ట్‌కు తగ్గట్లు వీడియోలను అందించడం, యాప్‌లో అకౌంట్ ఓపెన్ చేసే విధానాన్ని చాలా ఈజీ చేయడం వంటి క్రేజీ ఛేంజెస్‌తో మార్కెట్ లోకి వచ్చింది. క్రియేటర్లు ఈజీగా లాగిన్ అవడానికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ఐడెంటిటీ వెరిఫికేషన్ అవసరం లేదని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే ఈ యాప్‌లో మనీ సంపాదించే ఛాన్స్ ఈజీగా ఉండటం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. యూట్యూబ్‌లో డబ్బులు రావాలంటే కొన్ని వేల గంటల వాచ్ టైమ్, సబ్‌స్క్రైబర్లు ఉండాలనే స్ట్రిక్ట్ కండీషన్లు ఉంటాయి. కానీ బిలిబిలి అలా కాకుండా, క్రియేటర్లు తమ ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే ఇన్కమ్ జనరేట్ అవుతుందని అనౌన్స్ చేసి క్రియేటర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

మిస్టర్ బీస్ట్ వంటి వరల్డ్ ఫేమస్ క్రియేటర్లు కూడా ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్‌ వైపు అడుగులు వేయడం విశేషం. ఏ కండీషన్లు లేకుండా ఫస్ట్ డే నుంచే ఇన్కమ్ ఇస్తామని చెప్పడం కొత్తగా వీడియోలు చేసేవారికి చాలా పెద్ద ఛాన్స్‌గా మారింది.

Bilibili

అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు, స్ట్రాంగ్ సిస్టమ్ ఉన్న యూట్యూబ్‌ను దాటుకొని ముందుకు వెళ్లడం బిలిబిలికి(Bilibili) అనుకున్నంత ఈజీ ఏం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు వేర్వేరు దేశాల్లో ఉండే కంటెంట్ కంట్రోల్ చట్టాలు, యూజర్ల డేటా సేఫ్టీ నియమాలు ఈ చైనా యాప్‌కు పెద్ద ఛాలెంజ్‌గా మారే ప్రమాదం ఉంది.

ఏది ఏమైనా కూడా, ఇలాంటి పోటీ పెరిగితే సాధారణ యూజర్లకు, క్రియేటర్లకు మంచి లాభమే ఉంటుంది. కొత్త తరహా కంటెంట్ అందుబాటులోకి రావడమే కాకుండా, క్రియేటర్లకు ఎక్స్‌ట్రా ఇన్కమ్ సోర్స్‌ పెరుగుతాయి. మరి ఈ బిలిబిలి నిజంగానే యూట్యూబ్‌కి ఆల్టర్‌నేట్‌గా మారుతుందా లేదా మామూలు యాప్‌లాగే మిగిలిపోతుందో వేచి చూడాలి మరి.

Devdutt Padikkal : సెంచరీతో చెలరేగిన దేవదత్ పడిక్కల్..లంకతో సమంగా తొలి రోజు పోరు..

Exit mobile version