Jantar Mantar 2.0 : జంతర్ మంతర్ 2.0 రచ్చ.. రెండో రోజూ ఢిల్లీ అష్టదిగ్బంధం..

Jantar Mantar 2.0 : అర్ధరాత్రి దాటాక కొంతమందిని పోలీసులు రిలీజ్ చేసినా కూడా.. అభిజీత్ దీప్కే, ధ్రువ్ రాఠీ వంటి కీలక వ్యక్తులను మాత్రం ఇంకా అదుపులోనే ఉంచారు.

Jantar Mantar 2.0

దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ చుట్టూ అలుముకున్న వివాదాలు, నేతల అరెస్టులతో పాలిటిక్స్ పీక్స్‌కి చేరి హస్తిన అట్టుడికిపోతోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవి నుంచి తప్పుకునే వరకు తగ్గేది లేదని కాక్రోజ్ జనతా పార్టీ (CJP) స్పష్టం చేసింది. శనివారం రోజు నిరసనను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆదివారం జంతర్ మంతర్ 2.0(Jantar Mantar 2.0) పేరుతో మరోసారి పోరాటానికి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకల్లా జంతర్ మంతర్ వద్ద ఈ విషయాన్ని తేల్చుకుంటామని సీజేపీ హెచ్చరించడంతో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

దాదాపు 13 కోట్ల ఓట్లను కావాలనే ఓటర్ల జాబితా నుంచి గల్లంతు చేశారంటూ ఆరోపిస్తున్న సీజేపీ.. దీనికి సీఈసీ డైరెక్ట్‌గా జవాబిచ్చే వరకు ఢిల్లీని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. ఇక శనివారం రోజు పోలీసులు వేసిన మాస్టర్ ప్లాన్ పొలిటికల్ సీన్‌ను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. ముంబై నుంచి ఫ్లైట్‌లో ఢిల్లీ చేరిన సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేను రన్‌వే పైనే అదుపులోకి తీసుకుని షాకిచ్చారు. తనతో పాటు సౌరవ్‌దాస్, అశుతోష్ రంకా, పాపులర్ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా రాత్రికి రాత్రే కస్టడీలోకి తీసుకున్నారు. లీడర్ల ఆచూకీ కూడా 12 గంటల పాటు చెప్పకపోవడంతో కేడర్ రగిలిపోతోంది.

దీంతో మహారాష్ట్ర నేత అజింక్య శిందే సీన్‌లోకి దిగి లీడర్‌షిప్ బాధ్యతలను తీసుకున్నారు. ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మండిపడ్డ అజింక్య శిందే, పోలీసులు ఎక్కడ ఆపితే అక్కడే కూర్చుని .. రోడ్లపైనే బైఠాయించి ధర్నా చేయాలని పిలుపునిచ్చారు.

మరోవైపు ఈ నిరసనలో సీజేపీకి మద్దతుగా నిలిచి కేరళ భవన్ దగ్గర ప్రొటెస్ట్ చేసిన మాజీ సీఎం విజయన్, జంతర్ మంతర్ వెళ్లడానికి ట్రై చేసిన కేజ్రీవాల్‌తో పాటు, సౌత్ అవెన్యూ దగ్గర మమతా బెనర్జీని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. సుప్రీంకోర్టు లాయర్లను కూడా రోడ్లపైనే అడ్డుకున్న పోలీసులు శనివారం ఒక్క రోజే దాదాపు 7000 మందిని నిర్బంధ కేంద్రాలకు బలవంతంగా తరలించారు. అర్ధరాత్రి దాటాక కొంతమందిని రిలీజ్ చేసినా కూడా.. అభిజీత్ దీప్కే, ధ్రువ్ రాఠీ వంటి కీలక వ్యక్తులను మాత్రం ఇంకా అదుపులోనే ఉంచారు.

Jantar Mantar 2.0

ఇక రెండో రోజు జంతర్ మంతర్ 2.0(Jantar Mantar 2.0) పేరిట ఆందోళనలతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అల్ట్రా అలర్ట్ మోడ్‌లోకి వెళ్లారు. సెంట్రల్ ఢిల్లీలో ఉదయం 6 గంటల నుంచే రూట్ డైవర్షన్లు మొదలయిపోయాయి. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లకు వెళ్లేవారంతా చాలా ముందే బయలుదేరాలని, అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఒకవైపు సీఈసీ రాజీనామా డిమాండ్, మరోవైపు వేలాది మంది పోలీస్ బలగాల మోహరింపు మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ దేనికి దారి తీస్తుందో చూడాలి మరి.

Solar Storm : భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాన్..మన మొబైల్స్, ఇంటర్నెట్‌ల పరిస్థితి ఏంటి?

↑
Exit mobile version