Deputy CM Pawan Kalyan
పొలిటికల్ లీడర్స్ , పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ వాళ్ల కష్టాలను స్వయంగా వినడం అనేది సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ రూట్‌లో వెళ్లి ఏజెన్సీ జనాల్లో కొత్త జోష్ నింపుతూ వారి కంట్లోనే కాదు మనసుల్లో కూడా కొత్త వెలుగులు తీసుకువచ్చారు.
సచివాలయాల బిల్డింగ్‌లు, ఏసీ రూమ్‌లను పక్కనపెట్టి ఏకంగా కొండకోనల మధ్య ఉన్న గిరిజన గూడేనికి పవన్ వెళ్లారు. అక్కడ ఎలాంటి హంగులు లేకుండా, సెలబ్రెటీ అన్న గర్వం, ఏపీ డిప్యూటీ సీఎం అన్న అహంకారం లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా అందరితో కలిసి చింతచెట్టు కింద.. రచ్చబండపై కూర్చొని అడవి బిడ్డల సమస్యలను వారి నోటి వెంటే ఓపికగా విన్నారు. వినడమే కాదు, వారి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతూ కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు ఆర్డర్స్ ఇచ్చి గిరిపుత్రులకు కొండంత భరోసాను నింపారు.
తాజాగా పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో రాకోట అనే గిరిశిఖర గ్రామంలో పవన్ ‘అడవి తల్లి బాట 2.0’ అనే ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా కాకవాడ, రాకోట, సువర్లవాడ, అలాగే వేములకొండ గ్రామాలను కలిపే 3.4 కిలోమీటర్ల ముఖ్యమైన కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2.29 కోట్లతో శంకుస్థాపనను చేశారు.
ఆ తర్వాత రాకోట ఊరిలో చింతచెట్టు కింద ఏర్పాటు చేసిన మాటా-మంతి రచ్చబండ ప్రోగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకోటతో పాటు చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా వచ్చిన ప్రజలు తమ స్కూళ్లు, హాస్పిటళ్లు, రోడ్ల కష్టాలను ఆయన ముందుంచారు.
జనాలు చెప్పిన సమస్యలపై పవన్ వెంటనే రియాక్ట్ అయ్యారు. బాగా పాడైపోయి కూలిపోయేలా ఉన్న రాకోట స్కూల్ రిపేర్లకు రూ. 20 లక్షలు, గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు రూ. 15 లక్షలు, హనుమాన్ టెంపుల్ డెవలప్‌మెంట్‌కు మరో రూ. 20 లక్షలు అక్కడికక్కడే సాంక్షన్ చేశారు. ఇవే కాకుండా చుట్టుపక్కల ఉన్న గిరిజన పల్లెల్లో కొత్తగా అంగన్‌వాడీ సెంటర్లు, స్కూళ్లు, హెల్త్ క్లినిక్స్ కట్టడానికి వేర్వేరు పథకాల కింద ఏకంగా రూ. 5 కోట్ల వరకూ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించి గూడెం జనానికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.
అంతకుముందు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఊరిలోకి రాగానే గిరిజన మహిళలు పూల వర్షాన్ని కురిపిస్తూ, దిష్టి తీసి హారతులతో ఘన స్వాగతం చెప్పారు. టూర్‌లో భాగంగా లోకల్ ఎంపీపీ స్కూల్‌ను పవన్ విజిట్ చేసి అక్కడ చదువుకుంటున్న చిన్నపిల్లలతో కాసేపు సరదాగా గడిపారు.
ఆ తర్వాత వెదురు బొంగుల ఉత్పత్తులను తయారు చేస్తూ పొట్ట పోసుకుంటున్న కుటుంబాలను కలిసి మాట్లాడి, గవర్నమెంట్ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే పీఎం కృషి సించాయి యోజన స్కీమ్ కింద రైతులకు కావలసిన అగ్రికల్చర్ పనిముట్లను కూడా పంపిణీ చేశారు. స్వయంగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రే(Deputy CM Pawan Kalyan) తమ ఊరికి వచ్చి తమ కష్టాలు తీర్చడంతో గిరిజన పుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Jantar Mantar 2.0 : జంతర్ మంతర్ 2.0 రచ్చ.. రెండో రోజూ ఢిల్లీ అష్టదిగ్బంధం..
