Srivari Brahmotsavams : రెండోసారి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..గరుడ వాహనం నుంచి చక్రస్నానం వరకూ షెడ్యూల్..

Srivari Brahmotsavams : ధ్వజారోహణం, ధ్వజావరోహణం లేకుండా డైరెక్టుగా అంకురార్పణతోనే ప్రారంభమై చక్రస్నానంతో ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడం వీటి ప్రత్యేకం.

Srivari Brahmotsavams

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశ్వయుజ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలగిరులు సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి. ఈ ఏడాది అధికమాసం రావడంతో తిరుమల శ్రీవారికి రెండోసారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటం మరో విశేషంగా నిలిచింది.

అక్టోబర్ 11వ తేదీన రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానుండగా అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి వాహన సేవలు తిరుమాడ వీధుల్లో కన్నుల పండువగా సాగబోతున్నాయి. ధ్వజారోహణం, ధ్వజావరోహణం లేకుండా డైరెక్టుగా అంకురార్పణతోనే ప్రారంభమై చక్రస్నానంతో ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Srivari Brahmotsavams) ముగియడం వీటి ప్రత్యేకం.

ఈ(Srivari Brahmotsavams) ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు జరుగబోతోంది. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారి వాహన సేవలు ఉంటాయి.

పూర్తి షెడ్యూల్ వివరాలు.. అక్టోబర్ 11వ తేదీన రాత్రి అంకురార్పణ. అక్టోబర్ 12వ తేదీన ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం అలాగే అదే రోజు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం. అక్టోబర్ 13వ తేదీన ఉదయం చిన్నశేష,అదే రోజు రాత్రి హంస వాహనం. అక్టోబర్ 14వ తేదీ ఉదయం సింహ, ఆ రాత్రి ముత్యపుపందిరి వాహనం. అక్టోబర్ 15వ తేదీ ఉదయం కల్పవృక్ష,ఆ రాత్రి సర్వభూపాల వాహనం.

Srivari Brahmotsavams

అక్టోబర్ 16వ తేదీ ఉదయం మోహినీ అవతారం,అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనం. అలాగే అక్టోబర్ 17వ తేదీన ఉదయం హనుమంత వాహనం, అదే రోజు సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం, అదే రోజు రాత్రి గజ వాహనం.

అక్టోబర్ 18వ తేదీన ఉదయం సూర్యప్రభ, ఆ రాత్రి చంద్రప్రభ వాహనం. అక్టోబర్ 19వ తేదీన ఉదయం 7 గంటలకు స్వర్ణరథం, రాత్రి అశ్వ వాహనం. చివరగా అక్టోబర్ 20వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానంతో ఏడుకొండలవాడి ఆధ్యాత్మిక వేడుకలు(Srivari Brahmotsavams) ముగుస్తాయి.

Deputy CM Pawan Kalyan : గిరిజన గూడెంలో డిప్యూటీ సీఎం రచ్చబండ.. గిరిపుత్రులకు ఊహించని వరాలు ఇచ్చిన పవన్

↑
Exit mobile version