Dating : డేటింగ్ చేస్తే రూ.12 వేలు.. యువతకు ప్రభుత్వం బంపరాఫర్..

Dating : డేటింగ్ చేస్తే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేయడం ఎక్కడైనా విన్నారా.. ?

Dating

ఉద్యోగులు రిటైరయ్యాక పింఛన్లు తీసుకోవడం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కూడా పెన్షన్ ఇవ్వడం చూసాం. అదే సమయంలో ఎన్నికల్లో అధికారం కోసం పార్టీలన్నీ పోటాపోటీగా ఉచిత హామీలు గుప్పించడం కూడా చూసాం. కానీ డేటింగ్(Dating) చేస్తే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేయడం ఎక్కడైనా విన్నారా.. ? అది కూడా ఒక దేశ ప్రభుత్వమే తమ యువతకు ఇలాంటి ఆశ్చర్యం గొలిపే ఆఫర్ ఇచ్చిందంటే షాక్ కు గురవక తప్పదు.

ఇది ఎక్కడో తెలుసా జపాన్ లో… నిజమే జపాన్(Dating) ప్రభుత్వం తమ దేశ యువతకు ఈ బంపరాఫర్ ప్రకటించింది. గత కొంతకాలంగా జపాన్ లో జనాభా తగ్గుతోంది. బ్యాచిలర్స్ పెరిగిపోతున్నారు. దీంతో దీనికి విరుగుడుగా జపాన్ ప్రభుత్వం సంచలన పథకాలు, ఆఫర్లు ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగా సింగిల్స్ కు డేటింగ్ యాప్ సబ్సిడీ ఇచ్చింది. వివాహాలు, సంతానోత్పత్తిని పెంచడమే ప్రధాన లక్ష్యంగా రూ.12 వేల రూపాయల వరకూ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.

ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం జపాన్ అతి తక్కువ ఫెర్టిలిటీ రేట్ తో ఇబ్బంది పడుతోంది. దేశంలో 65 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 29 శాతానికి పెరిగిపోయింది. 9 మిలియన్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. యువత కెరీర్ మీద ఫోకస్ తో పెళ్లిళ్లు చేసుకోవడం, చేసుకున్నా పిల్లలను కనడం లేదు. కుటుంబ పోషణ ఖర్చు పెరిగిపోవడం, ఇతరత్రా వ్యక్తిగత సమస్యలు కారణాలుగా చెబుతున్నారు.

Dating

దీంతో ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వివాహాలు చేసుకునే యువతకు వినూత్నమైన పథకాలను ఆఫర్ చేస్తోంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సింగిల్స్ కోసం ఏకంగా ప్రభుత్వమే డేటింగ్ యాప్ ను రూపొందించింది.

దీనిలో రిజిస్టర్ చేసుకున్న యువత నిబంధనలకు అనుగుణంగా డేటింగ్ చేస్తే నగదు ప్రోత్సాహకాలను అందజేస్తోంది. 18 ఏళ్లు పైబడిన యువత ఆడ/మగ తమ వయసును ధృవీకరించే పత్రాలను సమర్పించి యాప్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగాలు చేసే జంటలకు కూడా 36 గంటల వీక్లీ సెలవు పాలసీ అమలు చేస్తోంది. తద్వారా వారి ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదించేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఈ విధానాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని జపాన్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

Clay Pot :మట్టికుండ నీరు అమృతమే.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

Exit mobile version