Just NationalJust PoliticalLatest News

CM Vijay : విజయ్ పాలనకు 100 రోజులు..దళపతి మార్క్ కనిపించిందా ?

CM Vijay : 100 రోజుల పాలనలో సీఎం విజయ్ మంచి మార్కులే సాధించినా సరే.. ఇకపై అసలు సవాళ్లు ఎదురు కానున్నాయి.

CM Vijay

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుతీరి సరిగ్గా 100 రోజులు పూర్తయింది. ఎన్నికల సర్వేలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు కొన్ని సీట్లు తగ్గినా చిన్న పార్టీల మద్దతుతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే కొన్ని కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

దీనిలో భాగంగానే సీఎంగా విజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తనను నమ్మి ఓట్లు వేసిన యువత, మహిళల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గృహ వినియోగదారుల కోసం ప్రతి రెండు నెలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు.

అలాగే సున్నితమైన ప్రాంతాల్లో మద్యం దుకాణాల మూసివేత విజయ్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి. పాఠశాలలు, దేవాలయాలు, బస్ స్టాండ్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేయించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా సింగపెణ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 6 వేల కోట్ల వరకూ పంట రుణాల మాఫీని ప్రకటించారు.

బడ్జెట్ లో సైతం మహిళలు , విద్యార్థులు, యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థుల కోసం 2వేల కోట్లతో వెట్రి లాప్టాప్ స్కీమ్ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో దాదాపు లక్ష కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో అవినీతికి చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు .అవినీతి నిరోధానికి కొత్త హెల్ప్‌లైన్ ప్రారంభించారు.

CM Vijay
CM Vijay

అయితే ఈ 100 రోజుల పాలనలో విజయ్ మంచి మార్కులే సాధించినా సరే.. ఇకపై అసలు సవాళ్లు ఎదురు కానున్నాయి. దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఉచిత పథకాల అమలు ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందనే ఆందోళన ఉంది. విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ బిల్లులు, శాంతిభద్రతలపై కొన్ని ప్రాంతాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

టెండర్లలో 2 నుంచి 4 శాతం కమీషన్లు అడుగుతున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు విజయ్ స్పందించకపోవడం తప్పుడు సంకేతాలను పంపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంమీద ఎన్నికల్లో తాను ఇచ్చిన ఉచిత హామీలను, రాష్ట్ర ఆర్థిక వనరులను ఎలా సమన్వయం చేస్తారనేది విజయ్‌కు రానున్న రోజుల్లో అతి పెద్ద పరీక్షగా చెబుతున్నారు.

Free Advice : ఉచిత సలహాలు విని బోర్ కొడుతుందా? ..ఫ్రీ అడ్వైజర్లకి చెక్ పెట్టే స్మార్ట్ ఐడియాలివే..

Related Articles

Back to top button