Strait Of Hormuz
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్స్‌కు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో పాటు.. ఆ మార్గం నుంచి వెళుతున్న ఒక వాణిజ్య నౌకపై అటాక్ చేసింది. దీనికి కౌంటర్ ఇస్తూ యూఎస్ సైన్యం ఇరాన్‌పై భారీ వైమానిక దాడులతో విరుచుకుపడింది.
ఈ ఊహించని పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో మరోసారి యుద్ధ వాతావరణం ముదిరిపోగా, ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ స్థావరాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, తీరప్రాంత నిఘా కేంద్రాలే టార్గెట్‌గా అమెరికా ఫైటర్ జెట్స్ విరుచుకుపడ్డాయి.
ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన దాదాపు 140 సైనిక లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు యూఎస్ ప్రకటించింది. ఈ దాడుల తర్వాత అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. ఇరాన్ మరోసారి చాలా పెద్ద తప్పు చేసిందని, దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.
మరోవైపు తమ దక్షిణ తీరంలోని సైనిక స్థావరాలతో పాటు టెలికమ్యూనికేషన్ టవర్లను టార్గెట్ చేస్తూ యూఎస్ జరిపిన దాడులను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఖండించింది. అంతేకాదు, అమెరికా దాడులకు ప్రతీకారంగా మొదటి స్జేజీలోనే జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ మిస్సైల్స్‌తో దాడి చేసింది.
కాగా అక్కడ ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు.. ఎంక్యూ-9 డ్రోన్ హ్యాంగర్లను నాశనం చేశామని ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. కేవలం జోర్డాన్ మాత్రమే కాకుండా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్రదేశాలపై, అక్కడి యూఎస్ మిలిటరీ బేస్‌లపై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులను కొనసాగించింది.
బహ్రెయిన్, ఖతార్‌లలో ఉన్న అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఆయుధ డిపోలు, రాడార్ కేంద్రాలను టార్గెట్‌గా చేసుకున్నామని, ఈ క్షిపణి దాడుల భయంతో బహ్రెయిన్ అంతటా సైరన్లు మోగుతున్నాయని లోకల్ మీడియా వెల్లడించింది.
అసలు వివాదానికి కారణమైన హర్మూజ్(Strait Of Hormuz) జలసంధి విషయం చూస్తే.. పర్మిషన్ లేని రూట్‌లో ప్రయాణించిన ఒక నౌకను అడ్డుకున్న తర్వాత, తర్వాత ఆదేశాలు వచ్చే వరకు ఈ సముద్ర మార్గాన్ని మూసి వేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఒకవేళ అమెరికా గనుక తమపై మరిన్ని దాడులకు దిగితే మాత్రం ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.
నిజానికి కొన్ని రోజులుగా 3 వాణిజ్య చమురు ట్యాంకర్లపై జరిగిన అటాక్స్ తర్వాతే అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం పెరిగింది. కాల్పుల విరమణ అగ్రిమెంట్ ఇక అమల్లో లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, అసలు ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అమెరికానే అని ఇరాన్ ఎదురుదాడి చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధన రవాణాకు హర్మూజ్(Strait Of Hormuz) జలసంధి అత్యంత కీలకమైన లైఫ్ లైన్ వంటిది. అంతర్జాతీయ ఇంధన సరఫరాలో మెజారిటీ భాగం ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది కాబట్టి.. ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లపై, ముడి చమురు ధరలపై ప్రభావాన్ని చూపే ఛాన్స్ ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
India : ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో వైట్ వాష్.. భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే
