Gold Rates : ఈరోజు బంగారం, వెండి ధరల పరిస్థితి ఏంటి? బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Gold Rates : పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటు గోల్డ్‌తో పాటే ఈ రోజు వెండి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది

Gold Rates

సోమవారం దేశీయ మార్కెట్‌లో పుత్తడి ధరలు(Gold Rates) మరోసారి స్వల్పంగా పెరిగాయి. అయితే అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా బంగారానికి పెరుగుతున్న డిమాండ్‌ వల్ల.. అలాగే గోల్డ్‌ను సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఇన్వెస్టర్లు చూపిస్తున్న ఆసక్తితోనే పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటు గోల్డ్‌తో పాటే ఈ రోజు వెండి భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర(Gold Rates) రూ.1లక్ష 50వేల 270 గా నమోదైంది. గత ట్రేడింగ్ సెషన్‌లో ఈ ధర రూ.1లక్ష49వేల600 గా ఉండగా.. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే రూ.670 వరకూ పెరుగుదల కనిపించింది.

హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ప్రొద్దుటూరు మార్కెట్లు అలాగే దేశంలోని ప్రముఖ సిటీలైన ముంబయి, బెంగళూరు మార్కెట్లలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక జ్యువెలరీ తయారీలో ఎక్కువగా ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.1లక్ష34వేల 040 వద్ద ట్రేడ్ అవుతోంది.

పుత్తడి బాటలోనే సిల్వర్ ధరలు కూడా ఈ రోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ప్రొద్దుటూరు మార్కెట్లలో కిలో వెండి ధర ఏకంగా రూ.2లక్షల 41వేల 999 కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో కిలో వెండి ధర రూ.2లక్షల 37వేల 190 గా ఉండగా.. ఒక్కరోజులోనే సుమారు రూ.4,809 వరకూ పెరగడం గమనార్హం. పారిశ్రామిక రంగం నుంచి వస్తున్న డిమాండ్‌తో పాటు, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులే ఈ భారీ పెరుగుదలకు మెయిన్ రీజన్స్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు వినియోగదారులు కొన్ని కీలకమైన విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగారం కొనేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే క్వాలిటీ గుర్తింపు, ప్యూరిటీని లెక్కించే విధానంతో పాటు మనం కట్టే ఫైనల్ బిల్లుపై పూర్తి క్లారిటీగా ఉండటం ఎంతో అవసరం.

ముందుగా మార్కెట్‌లో 916 హాల్‌మార్క్ ఉన్న గోల్డ్‌ను 22 క్యారెట్ల అత్యంత నాణ్యమైన ఆభరణంగా గుర్తిస్తారు. ఎందుకంటే ఈ హాల్‌మార్క్ అనేది గోల్డ్ ప్యూరిటీకి ప్రభుత్వ పరంగా లభించే అఫీషియల్ గ్యారంటీగా తెలుసుకోవాలి. ఇలా హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీని కొనడం వల్ల నాణ్యతలో మోసపోయే ఛాన్స్ ఉండదు. అంతేకాకుండా, భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో వాటిని తిరిగి అమ్మినపుడు, లేదా ఎక్స్‌ఛేంజ్ చేసినపుడు మార్కెట్ రేటు ప్రకారం మంచి రీసేల్ వాల్యూ వస్తుంది.

సాధారణంగా గోల్డ్ ప్యూరిటీని క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల పసిడి అనేది 99.9% ప్యూర్ అయినది. అయితే, ఇది చాలా మెత్తగా ఉండటం వల్ల దీంతో డైరెక్టుగా ఆభరణాలను తయారు చేయడం వీలుపడదు. అందుకే దీనిని బంగారు నాణేలు, బిస్కెట్స్, బార్ల రూపంలో కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కొనుక్కుంటారు. ఇక జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల పుత్తడిలో..నగకు గట్టిదనం రావడం కోసం కొంత శాతం రాగి , వెండి వంటి ఇతర లోహాలను కలుపుతారు.

Gold Rates

అలాగే చాలామంది గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మార్కెట్‌లో రోజూ పేపర్లలో, టీవీల్లో ప్రకటించే బంగారం, వెండి ధరలు కేవలం ప్రాథమిక ధరలు మాత్రమే. జ్యువెలరీ షాపునకు వెళ్లి నగలు కొనేటప్పుడు చెల్లించే ఫైనల్ బిల్లులో మరికొన్ని ఎక్స్‌ట్రా ఖర్చులు కూడా యాడ్ అవుతాయి. ఆభరణం డిజైన్‌ను బట్టి వసూలు చేసే మేకింగ్ ఛార్జీలు, జ్యువెలరీని చేసేటప్పుడు పోయే నష్టం అంటే వేస్టేజ్, గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వర్తించే జీఎస్​టీ పన్నులు , హాల్‌మార్కింగ్ కోసం వసూలు చేసే నామమాత్రపు ఫీజు అన్నీ కలిపి ఫైనల్ బిల్లు పే చేయాలి.

ఈ మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ రేట్లు అనేవి ప్రతి షాప్‌లోనూ డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే జ్యువెలరీని కొనేటప్పుడు బిల్లును పూర్తిగా చెక్ చేశాక మాత్రమే డబ్బులు చెల్లించాలి. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల గోల్డ్(Gold Rates), సిల్వర్ ధరలు రోజూ మారడమే కాకుండా ఉదయం సాయంత్రం కూడా ఈ ధరలు మారుతుంటాయి కాబట్టి, కొనడానికి వెళ్లే ముందు తాజా ధరలను ఒకసారి చెక్ చేసుకుని వెళ్లాలి.

Pakistan : నీటి కోసం యుద్ధానికైనా వెనుకాడబోమని పాక్ హెచ్చరిక.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్‌

Exit mobile version