Trump Death
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తెరవెనక్కి వెళ్లిపోయిన వేళ..రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతానికి అమెరికాదే పైచేయిగా కనిపిస్తున్నా ఇరాన్ కూడా దీటుగానే స్పందిస్తోంది. అయితే ఇరాన్ ఫైనల్ టార్గెట్ మాత్రం ట్రంప్‌ను మట్టుపెట్టడమేనని అర్థమవుతోంది.
తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్‌ను చంపేస్తామని ఇప్పటికే ఇరాన్ ప్రస్తుత సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు. అటు ట్రంప్ కూడా కొన్ని సందర్భాల్లో తాను దాడుల్లో చనిపోవచ్చంటూ వ్యాఖ్యానించారు.
కాగా ప్రస్తుతం యుద్ధ పరిస్థితులన్నీ తీవ్రంగా మారిపోయిన సమయంలో టెహ్రాన్‌లోని ఎంగెలాబ్ స్క్వేర్‌లో ఓ భారీ హోర్డింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శవపేటికలో(Trump Death) ఉన్నట్లు చిత్రీకరించిన ఈ భారీ వివాదాస్పద హోర్డింగ్ హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా జెండాను పోలిన గుడ్డతో కప్పి.. ఒక తెరిచిన నల్లటి శవపేటికలో డొనాల్డ్ ట్రంప్ మృతదేహం పడి ఉన్నట్లు గ్రాఫిక్ రూపంలో దీనిలో చూపించారు.
డొనాల్డ్ ట్రంప్ కళ్లు, నోరు మూసివేసి, చేతులను ఎరుపు రంగు టైపై ఉంచినట్లు దీనిని డిజైన్ చేశారు. ఆ శవపేటికపై పర్షియన్, ఇంగ్లీష్ భాషల్లో మేము ట్రంప్‌ను అంతం చేస్తాం అని వైట్ గ్రాఫిటీతో స్పష్టంగా రాసి ఉంచారు.ఈ హోర్డింగ్‌పై మినాబ్ పిల్లల జ్ఞాపకార్థం అని కూడా రాశారు.
గతంలో మినాబ్ నగరంలోని ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడి ఘటనను ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ సందేశాన్ని ఉంచింది. మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు, ప్రభుత్వం ప్రకటిస్తున్న సమయంలోనే ఈ ప్రచార హోర్డింగ్ వెలిసింది.
కాగా దీనికి ట్రంప్ కూడా ఘాటుగానే స్పందించారు. తనను హతమార్చడానికి ఇరాన్ కుట్రలు పన్నుతోందన్న నిఘా వర్గాల సమాచారం అందిందన్నారు. తనను టార్గెట్ చేస్తే ఇరాన్ వైపు 1,000 మిసైళ్లను గురిపెట్టి ఉంచామని, ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాదు ఇరాన్ గనుక చర్చలకు రాకపోతే వచ్చే వారం నుంచి ఆ దేశంలోని అన్ని పవర్ ప్లాంట్లు, వంతెనలను బాంబులతో ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ వార్నింగ్‌లపై ఇరాన్ దీటుగా బదులిచ్చింది. అమెరికా గనుక తమ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఈ ప్రాంతంలోని అన్ని అమెరికా స్థావరాలను, మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని హెచ్చరించింది.
Puri Jagannath Rath Yatra : పూరీ రథయాత్రలో విషాదం..తొక్కిసలాటలో భక్తుడు మృతి
