Trump
పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచీ అమెరికా, ఇరాన్ కంటే కూడా మిగిలిన ప్రపంచ దేశాలలోనే ఎక్కువగా చమురు సంక్షోభం ఏర్పడింది. ఆయా దేశాలకు చమురు రవాణాకు కీలకంగా మారిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో కొన్ని దేశాలలో చమురు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి.
ఇరాన్, అమెరికా యుద్ధం ముగిస్తే తప్ప హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని దేశాలు పదే పదే విజ్ఞప్తి చేసినా ఇరాన్ మాత్రం అంగీకరించడం లేదు. తాజాగా హర్మూజ్ జలసంధిపై ఇరాన్ చేసిన కీలక ప్రకటన ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారింది.
ఒకవైపు ఒమన్‌తో చర్చలు జరపడానికి ఒప్పుకున్న ఇరాన్ అమెరికాకు మాత్రం మూడు కీలక డిమాండ్లు విధించింది. ఒమన్‌తో కొత్త నౌకా మార్గం ఒప్పందం కుదిరే దశలో ఉన్నా కూడా, అమెరికా తన వైఖరి మార్చుకునే వరకు జలసంధిని పూర్తిగా తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీనిలో భాగంగానే అక్కడ కమర్షియల్ షిప్పింగ్‌పై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
జలసంధి గుండా వెళుతున్న అబుదాబికి చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగినట్లు యూఏఈ అధికారులు తెలిపారు. మరోవైపు అమెరికా ముందున్న డిమాండ్లను చూస్తే.. భవిష్యత్తులో అగ్రరాజ్యం ఎప్పుడూ కూడా ఇరాన్‌ను ఎప్పుడూ బెదిరించకూడదని.. అలాగే ఇరాన్, ప్రాంతీయ భాగస్వామ్య దేశాలతో వివాదాలను ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
దీంతో పాటు తమ ఓడరేవులపై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేసి ఆ ప్రాంతం నుంచి అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించి, ఆంక్షలను ఎత్తివేయాలని కూడా షరతు పెట్టింది.
అయితే ఈ డిమాండ్లపై అమెరికా ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ తెరవెనుక అమెరికా ఇరాన్‌తో రహస్య చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఉండటంతో అమెరికా తన యుద్ధనౌకల మోహరింపును తాత్కాలికంగా నిలిపివేసింది.
చర్చలకు ఆటంకం కలగకుండా ఉండటానికి ఇరాన్‌పై ప్లాన్ చేసిన కొన్ని భారీ సైనిక దాడులను అమెరికా తాత్కాలికంగా విరమించుకుంది. అయితే ఇరాన్ అణు కార్యక్రమాలపై పూర్తి స్థాయి ఒప్పందం కుదిరే వరకు అమెరికా తన నావికాదళ హెచ్చరికలను, ఆంక్షలను మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది.
Self-Acceptance : లోకం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన పనిలేదు..మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటే చాలు..
