Modi
భారత ప్రధాని నరేంద్ర మోదీ (modi)ఈ నెల చివర్లో చైనా(China) పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇది గడిచిన ఆరేళ్లలో ఆయన మొదటి చైనా పర్యటన కావడం విశేషం. కానీ నిజంగా ఆసక్తికరమైన విషయం. ఈ సమయంలోనే అమెరికా భారత్‌ను విమర్శిస్తున్నదే కాక, ఒత్తిడి తెస్తోంది. మరి మోదీ (modi)ఏ వైపు మొగ్గు చూపుతారు? వాషింగ్టన్ గట్టున నిలుస్తారా? బీజింగ్ వైపు నడుస్తారా? అన్నది హాట్ టాపిక్ అయింది.
Modi
కొన్ని నెలలుగా అమెరికా(America) వైఖరి భారత్ పట్ల గందరగోళంగా మారింది. రష్యాతో మన చమురు డీల్స్, ఎడ్జ్-టెక్ రంగాల్లో స్వతంత్ర నిర్ణయాలు, మన స్వదేశీ డిఫెన్స్ అభివృద్ధి, ఇవన్నీ వాషింగ్టన్‌లో అసౌకర్యాన్ని రేకెత్తిస్తున్నాయి(all these are triggering discomfort in Washington) అంతేకాదు, డిజిటల్ నిబంధనలు, గ్లోబల్ సౌత్ విషయాల్లో కూడా అమెరికా మన అభిప్రాయాల్ని వ్యతిరేకిస్తూనే ఉంది.
ఇటీవల ఇండియాకు వ్యతిరేకంగా కొన్ని అంతర్జాతీయ ఫోరాల్లో మౌనంగా వ్యవహరించడం గమనార్హం. అంటే, తామే పెద్దన్న అన్నట్టు, మన దేశ నిర్ణయాలను ఆమోదించనట్లే ప్రవర్తిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
అదే సమయంలో చైనా ఆహ్వానం?
ఇక చైనా విషయానికి వస్తే.. SCO సమ్మిట్ కు మోదీ హాజరుకావడం ఒక్కటే కాదు. ఆ సమ్మిట్ లో భాగంగా సైనిక ప్రదర్శనలు, ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ మైక్రో స్ట్రాటజీల్లో భారత్ పాత్ర వంటి అంశాలు చర్చకు వస్తాయి. ఇదంతా చైనాతో మన సాన్నిహిత్యానికి సంకేతం కావచ్చు.
గాల్వాన్ ఘటన తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతలు సర్దుబాటు దిశగా కదులుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికమా లేక దీర్ఘకాలికమా అన్నది మరి చూడాలి.
అసలు మోదీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
భారత విదేశాంగ విధానం గత రెండేళ్లుగా ఓ కొత్త దిశగా సాగుతోంది—స్ట్రాటెజిక్ ఆటోనమీ (స్వతంత్ర వ్యూహం). అంటే, ఒక్క అమెరికా మీద ఆధారపడకుండా, చైనా వంటి పెద్ద దేశాలతో, బ్రిక్స్, SCO వంటి గ్లోబల్ గుంపులలో భారత్ తన పాత్రను గట్టిగా నిలబెట్టుకునే ప్రయత్నం.
మోదీ పాలనలో ఇది తొలిసారిగా కాదు. కానీ ఈసారి పర్యటన సమయంలో అమెరికా ఒత్తిడి పెరిగిన తరుణంలో, చైనాతో మిత్రత్వపు సంకేతాలు పంపించడం అనేక రాజకీయ మరియు ఆర్థిక ఉద్దేశాలతో నిండి ఉంది.
లాభాలు ఏంటంటే..చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థతో స్నేహం పెంచుకుంటే, భారత్‌కు వ్యాపార, పెట్టుబడి, సాంకేతిక రంగాల్లో అవకాశాలు పెరుగుతాయి.
SCOలో భాగస్వామ్యం ద్వారా మధ్యాసియా దేశాలతో కూడా రిలేషన్ బలోపేతం అవుతుంది.
అమెరికా ఆధిపత్యాన్ని కాస్త బ్యాలెన్స్ చేయగలుగుతాం. అలాగే మన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత అన్న సందేశం ఇచ్చినట్లవుతుంది.
బ్రిక్స్, ఎస్సీ ఓ(SCO) వంటి ఫోరా(fora)లో భారత్ తన గొంతును స్పష్టంగా వినిపించగలుగుతుంది.
సవాళ్లు ఏమిటంటే..చైనాతో సరిహద్దు సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారమవ్వలేదు. మళ్లీ ఉద్రిక్తతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పాకిస్థాన్ పట్ల చైనా మద్దతు, కొన్ని వాణిజ్య ఒప్పందాల్లో అసమానతలు భారత్‌కి నష్టంగా మారే ప్రమాదం ఉంది.
అంతేగాక, చైనా పెట్టుబడులు మన డిజిటల్, డిఫెన్స్ రంగాల్లో భద్రతా సమస్యలు తలెత్తించే అవకాశం ఉంది.
ఇక ఈ పర్యటన అనేది ఒక ఆర్ధిక లేదా సైనిక కార్యక్రమం మాత్రమే కాదు..భారత్ విదేశాంగ వ్యూహంలో కొత్త మలుపు. ఒకవైపు అమెరికా “మీ తీరు మాకు నచ్చడం లేదు అంటుంది. ఇంకోవైపు చైనా రా, మనం కలిసి ముందుకు సాగుదాం అని చెబుతోంది.
మరి మోదీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు? అమెరికా గట్టునే నిలబడతారా? లేక చైనా పక్కనే కొత్త నావిక దారి వెతుక్కుంటారా?
ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే వారాలు, నెలలు చెబుతాయి. కానీ ఒకటి మాత్రం అయితే కచ్చితంగా జరుగుతోంది. ఈ పర్యటన ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థితిని కొత్త కోణంలో చూపించనుంది.