Modi: చైనాకు మోదీ.. ట్రంప్‌కు షాకివ్వడానికేనా?
Modi: ట్రంప్‌కి షాక్ ఇచ్చిన మోదీ అడుగులు ప్రపంచవ్యాప్తంగా చర్చ

Modi
ట్రంప్ అధ్యక్షతన అమెరికా భారత్‌పై దిగుమతి పన్నులు పెంచినప్పుడు, చాలామందిలో ఇప్పుడు మన దేశం బలంగా నిలబడగలదా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ భారత్ మాత్రం ఎవరి ఒత్తిడికైనా తలవంచలేదని అతి త్వరలోనే సమాధానం చెప్పింది. మన దేశానికి అవసరం అనిపిస్తే కానీ, ఏ దేశంతో అయినా డీల్ చేయగలదని ఓపెన్‌గా చెప్పింది. ఒక సమయంలో అమెరికా అని, ఇంకో సమయంలో చైనా అని పరుగు పెట్టకుండా, భారత్ తన అవసరాలు, మన దేశ ప్రయోజనాల గురించి ముందుగా ఆలోచిస్తోంది.

అమెరికా ప్రముఖ దేశం అయినా, వాళ్ల ఆదేశాల్లా కాకుండా మన వాణిజ్య చర్చల్లో మనకు అనుకూలంగా తీసుకునే నిర్ణయాలనే ప్రధాని మోదీ(Modi) తీసుకుంటున్నారు. తాజాగా, ప్రధాని మోదీ చైనా, జపాన్ వంటి దేశాలకు వెళ్లడం వెనుకే అలాంటి నిర్ణయమే ఉంది. చైనా-భారత్ మధ్య గతంలో వచ్చిన సమస్యలు ఉన్నా, ఇప్పుడు పరస్పర ప్రయోజనాలు చూసుకునే పరిస్థితిని సృష్టించడానికి దృష్టి పెట్టారు. ఇటీవలే జరిగిన గల్వాన్ ఘటన తర్వాత మోదీ అక్కడ పర్యటనకు వెళ్లడం, దేశ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న సంకేతం.

మోదీ (Modi)విదేశీ పర్యటనలు చూస్తేఒక వర్గానికి మాత్రమే కాదు .. మన దేశ ప్రజల్లో అందరికీ ప్రయోజనం కలిగేలా అనే ఉద్దేశంతోనే జరుగుతున్నాయి. జపాన్ ప్రధానిని కలిసి, వ్యాపార, భద్రత, టెక్నాలజీ… ఇలా అన్ని అంశాల్లో కలిసి పనిచేయాల్సిందే అని చెప్పడం, ఆ తర్వాత చైనాలో కీలక సమావేశాల్లో పాల్గొనడం – ఇవన్నీ మన అప్రయోజనాలకు నష్టం చేయకుండా, కొత్త అవకాశాలను తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు.
అమెరికా తరపున ట్రంప్ (Donald Trump) ఒత్తిడులు వచ్చినా, నేరుగా ఒప్పుకోకుండా, మన దేశానికి ఏది మంచిదో అదే ఎన్నుకుంటున్నాం. తన ఆధిక్యం వదలకుండా, ఇతర దేశాల ఒత్తిడులను తీసుకోకుండా, భారతదేశం ప్రస్తుతం మనం మంచిగా, మనకు నష్టం లేకుండా, మన దేశానికి మేలయ్యేలా నడుచుకుంటున్నాం అన్నట్టు ముందుకు సాగుతోంది. ఈ విధానం వల్ల ప్రపంచ దేశాల్లో భారత్ విధానంతో అందరూ నివ్వెరపోతున్నారని రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.