Dead Economy: డెడ్ ఎకానమీపై మోదీ ఆన్సర్ ఓకే ..మరి వాస్తవ పరిస్థితి ఏంటి?
Dead Economy: ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు కథ: భారత్-రష్యా వాణిజ్యమే కారణమా?..భారత్ ఆర్దిక పరిస్థితి ఎలా ఉంది?

Dead Economy
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ చర్చకు దారితీశాయి. భారత ఆర్థిక వ్యవస్థ ‘డెడ్ ఎకానమీ’ (dead economy) అంటూ ఆయన చేసిన విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పరోక్షంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి భారత్ వేగంగా దూసుకుపోతోందని మోదీ స్పష్టం చేశారు.
మరోవైపు ట్రంప్(Donald Trump) వ్యాఖ్యలకు ప్రధాన కారణం భారత్-రష్యా మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాలు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత చాలా దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం మానుకున్నాయి. కానీ, భారత్ రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తూ, అమెరికా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఒత్తిడిని పట్టించుకోలేదు. దీనిపై అమెరికా చాలా కాలంగా అసంతృప్తితో ఉంది. ట్రంప్ తన వ్యాఖ్యల ద్వారా భారత్‌ను రష్యా నుంచి దూరం చేయాలని, లేదా కనీసం తమ అసంతృప్తిని తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాడు.

అమెరికా(US) భారత్(India) పై 25 శాతం సుంకాలు విధించింది. ఇది కేవలం వాణిజ్యపరమైన నిర్ణయంగానే కాకుండా, రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై ఒక హెచ్చరికగానూ భావించవచ్చు. భారత్ తన విధానాలను మార్చుకోకపోతే మరిన్ని ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా చెప్పడానికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్(trump) వ్యాఖ్యలు ప్రధానంగా తన రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని చాలా మంది విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ఎన్నికల సమయంలో, ఇతర దేశాలపై విమర్శలు చేయడం ద్వారా తన ఓటర్లను ఆకట్టుకోవడం ట్రంప్‌కు అలవాటు. భారత్‌పై విమర్శలు చేసి, తాను అమెరికాకు మాత్రమే మద్దతిస్తానని, ఇతర దేశాల నుంచి అమెరికాకు నష్టం జరగకుండా చూస్తానని చెప్పే ప్రయత్నం ఇది.
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ (Dead Economy) అని విమర్శించినప్పటికీ, వాస్తవాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆర్థిక నిపుణులు, ప్రపంచ సంస్థలు చెబుతున్న దాని ప్రకారం..ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) వంటి సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి.
భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. యూకే వంటి దేశాలను అధిగమించి ఈ స్థానానికి చేరుకుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారత్ జర్మనీ, జపాన్‌లను కూడా అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని అనేక ఆర్థిక విశ్లేషణలు చెబుతున్నాయి.
భారత్‌లో ఐటీ, సర్వీసెస్, తయారీ రంగాలు బలంగా వృద్ధి చెందుతున్నాయి. దేశీయ వినియోగం కూడా ఆర్థిక వ్యవస్థకు బలంగా మారింది. మొత్తంగా, ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా, కేవలం రాజకీయ, వాణిజ్య ఒత్తిడి కోసమే చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, వేగంగా వృద్ధి చెందుతోందని ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి. గుర్తిస్తున్నాయి కూడా అన్న విషయాన్ని ట్రంప్ మర్చిపోయారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
One Comment