Congress: తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్ డామినేషన్ ..బీఆర్ఎస్‌కు డేంజర్ సిగ్నల్ పడినట్లేనా !

Congress: ఇప్పటివరకు పాత భావోద్వేగాల కంటే, కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి చెప్పిన మాట నెరవేర్చింది అనే ఇమేజ్ మీద బాగా పనిచేసింది.

Congress

తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు కాంగ్రెస్ (Congress)పార్టీకి చాలా పెద్ద నైతిక బలాన్ని (Moral Boost) ఇచ్చాయి. అదే సమయంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ (BRS), బీజేపీలకు మాత్రం ఇది ఒక గట్టి హెచ్చరిక, ఒక సిగ్నల్ రెండూ కూడా ఇచ్చినట్లు అయింది. ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త బలాబలాలను సూచిస్తున్నాయి.

ఫలితాల పెద్ద చిత్రం ఏమిటంటే, ఎవరి స్థాయి ఎంత అనేది స్పష్టంగా తెలుస్తోంది. రెండో విడతలో పోలింగ్ జరిగిన మొత్తం 4,333 సర్పంచ్ పోస్టుల్లో, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఏకంగా 2,245 స్థానాలు గెలిచి, సుమారు 52 శాతం పంచాయతీలపై పట్టు సాధించారు. ఇక బీఆర్‌ఎస్ సుమారు 1,180 నుంచి 1,200 మధ్య సీట్లు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది.

బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆ పార్టీ దాదాపు 260 స్థానాల వరకు మాత్రమే నిలిచి, చాలా దూరంలో మూడో స్థానంలో ఉంది. రెండు ఫేజ్‌లను కలిపి చూస్తే, మొత్తం 8,568 పంచాయతీల్లో కాంగ్రెస్ (Congress)పార్టీ 4,500కి పైగా స్థానాలు గెలుచుకుంది. బీఆర్‌ఎస్ 2,300కి పైగా, బీజేపీ 450కి కాస్త ఎక్కువ స్థానాల్లో గెలిచింది. మిగతా స్థానాలను ఇండిపెండెంట్లు (స్వతంత్రులు), చిన్న పార్టీల అభ్యర్థులు గెలిచారు.

జిల్లాల పరిధిలో చూస్తే, కాంగ్రెస్(Congress) ఏకంగా 27 జిల్లాల్లో మెజారిటీ చూపించింది. అయితే, సిద్దిపేట, కొమరంభీం, జయశంకర్ భూపాలపల్లి, జంగాం జిల్లాల్లో మాత్రం బీఆర్‌ఎస్ ముందంజలో నిలిచింది. నిర్మల్‌లో బీజేపీ కూడా కొద్దిగా పట్టు చూపించింది. ఇది చూస్తే, గ్రామీణ ప్రాంతంలో ఇంకా కొన్ని పాకెట్స్‌లో బీఆర్‌ఎస్, బీజేపీలకు బలం ఉందని అర్థమవుతోంది.

గ్రామీణ ఓటర్ల మైండ్‌సెట్ ఎందుకు ఇలా మారుతోంది అనే దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది, డైరెక్ట్ బెనిఫిట్ అంటే ఓటుకు, సేవలకు మధ్య లింక్ పెరగడం. ఇప్పటివరకు పాత భావోద్వేగాల కంటే, కాంగ్రెస్(Congress) పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి చెప్పిన మాట నెరవేర్చింది అనే ఇమేజ్ మీద బాగా పనిచేసింది.

Congress

ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పింఛన్లు పెంచడం, రైతు రుణాలపై ఊహించిన దానికంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో పాజిటివ్‌గా మార్పు తెచ్చాయని కాంగ్రెస్(Congress) నేతలు చెబుతున్నారు. గ్రామాల్లో పంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు ఇప్పుడు “ఎవరి ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు క్లియర్ చేస్తోంది? ఎవరు మాకు నేరుగా డబ్బు ఇస్తున్నారు?” అన్న లెక్కల మీదే ఓటు వేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ బెనిఫిట్ కలిగినట్లు ఈ ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

రెండోది, బీఆర్‌ఎస్ పై పేరుకుపోయిన ఆంటీ-ఇంకంబెన్సీ (Anti-Incumbency). పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలన తర్వాత, 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే “ఇక ఇంకో ఫేజ్ ట్రై చేద్దాం” అన్న భావన ప్రజల్లో బాగా సెటిల్ అయింది. లోతుగా చూస్తే, అసంతృప్తి అనేది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచే మొదలైంది.

మిషన్ భగీరథ, కాల్వల నిర్మాణం, దళితబంధు, డబుల్ రూమ్ ఇళ్ల వంటి స్కీమ్స్‌లో ఉన్న లోపాలు, అసమాన అమలు వంటివి గ్రామీణ ఓటర్లలో గత పాలనపై ఓ అంచానకు వచ్చేలా చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం, తర్వాత పంచాయతీ మొదటి విడతలోనే కాంగ్రెస్ 60%కి పైగా పంచాయతీలు గెలవడం—ఇవన్నీ కూడా బీఆర్‌ఎస్‌పై ఉన్న ఆంటీ-ఇంకంబెన్సీ ఇంకా పూర్తిగా తగ్గలేదని స్పష్టంగా చూపిస్తున్నాయి.

మూడో కారణం,”సెంట్రల్ ఆప్షన్‌గా బీజేపీ బలహీనత. తెలంగాణలో బీజేపీ రాష్ట్రస్థాయిలో పూర్తి ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది. అది “అసెంబ్లీకి మాత్రమే పరిమితమైన అస్తిత్వం”గా మాత్రమే ఉన్నందున, బీఆర్‌ఎస్ పై ఉన్న వ్యతిరేక ఓటు (Anti-Incumbency Vote) లో ఎక్కువ భాగం కాంగ్రెస్ వైపే గట్టిగా మళ్లింది. ఇదే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని చాలా వెనుకకు నెట్టింది.

“తెలంగాణ సాధనలో అత్యంత కీలకమైన కేసీఆర్‌నే ప్రజలు పక్కన పెడుతున్నారా?” అన్న ప్రశ్న ఇక్కడే వస్తుంది. రాష్ట్ర విభజన, ఉద్యమాల్లో కేసీఆర్ పాత్రపై ప్రజల్లో ఎమోషనల్ కనెక్ట్ ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ పంచాయితీ ఫలితాలు చూపించిన అంశం ఏమిటంటే—ఉద్యమ పాత్రను గౌరవించడం అనేది ఒకటి, ప్రస్తుత పాలనపై తీర్పు ఇవ్వడం మరొకటి. ప్రజల దృష్టిలో ఇప్పుడు మూవ్ ఆన్ అయ్యే ఫేజ్ వచ్చింది.

బతుకమ్మ, మిషన్ కాకతీయ, జిల్లాల పునర్విభజన వంటి మార్పులు అయ్యాక, సాధారణ రైతు, గ్రామీణ ప్రజలు మొత్తం ఇప్పుడు ఉద్యోగాలు, పంటకు సరైన ధర, బిల్లులు క్లియర్ అవ్వడం, లోన్ మాఫీ, మంచి వైద్య సౌకర్యాల మీదే ఫోకస్ పెట్టారు. ఈ స్కోర్ కార్డులో బీఆర్‌ఎస్ చివరి 3-4 ఏళ్లలో సంతృప్తి ఇవ్వలేకపోయిందని చాలా సర్వేలు సూచించాయి.

అంతేకాదు కేసీఆర్ కుటుంబ ఐకమత్యం, వారసత్వ వివాదం కూడా ఒక ఫ్యాక్టర్ అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత మధ్య కొన్నేళ్లుగా కనపడని దూరం” ఉందనే చర్చ ఉంది. అధికారికంగా ఏమీ చెప్పకపోయినా, సీట్ల పంపిణీ, మంత్రివర్గంలో పాత్ర, పార్టీ ఆర్గనైజేషన్‌లో ప్రాధాన్యతల విషయంలో అంతర్గత విభేదాలు ఉన్నట్టు బీఆర్‌ఎస్ లోని కొందరు నేతల రియాక్షన్లు చూపించాయి.

కుటుంబంలో అంతర్గత వ్యూహ విభేదాలు బయటికి రావడం వల్ల గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ (కార్యకర్తల్లో) కన్‌ఫ్యూజన్ పెరిగింది. “పార్టీని ఎవరు నడుపుతున్నారు—కేసీఆర్? కేటీఆర్? హరీశ్?” అన్న సందేహం, లోకల్ లెవెల్లో చిన్న చిన్న క్యాంపులు ఏర్పడటం కూడా పార్టీ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్‌ను బలహీనపరిచింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి, “మరో కుటుంబ పార్టీ, గోల్డెన్ ఫ్యామిలీ రూల్” అనే వాదనను బాగా రన్ చేసి, బీఆర్‌ఎస్ మీద ఉన్న ఆంటీ-ఇంకంబెన్సీకి అదనపు బలాన్ని చేకూర్చింది. కాబట్టి, కుటుంబ ఐకమత్యం లోపం సెకండరీ ఫాక్టర్ అయినా, దాని ప్రభావం గ్రౌండ్ లెవెల్లో కనిపించడం వల్ల ప్రస్తుత నష్టాన్ని పెంచిందని చెప్పొచ్చు.

గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ నిజంగా స్థిరపడిందా అన్నది ప్రధాన ప్రశ్న. రెండు విడతల కలిపి 8,500కి పైగా పంచాయతీల్లో కాంగ్రెస్ 53 నుంచి 55 శాతం రేంజ్‌లో సర్పంచ్ స్థానాలు గెలవడం, 85%కి పైగా పోలింగ్ నమోదు కావడం— ఇవన్నీ “యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇది సీరియస్ మార్పు” అనే సంకేతాలే. అదే సమయంలో, బీఆర్‌ఎస్ కూడా 2,300కి పైగా పంచాయతీల్లో గెలిచి “పార్టీ పూర్తిగా నాశనం కాలేదు, స్ట్రాంగ్ అపోజిషన్ బేస్‌గా ఉంది” అన్న రిప్లై ఇచ్చింది. అంటే రూరల్ తెలంగాణ ఇప్పుడు క్లియర్ కాంగ్రెస్ డామినెన్స్ , స్థిరమైన బీఆర్‌ఎస్ బేస్ అనే రెండు లేయర్ల స్ట్రక్చర్‌లోకి వెళ్తోంది.

కాంగ్రెస్(Congress) ఈ ఊపును మరో 2 నుంచి 3 సంవత్సరాలు కొనసాగించాలంటే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేటప్పుడు ఎక్కడా యూ-టర్న్ తీసుకోకూడదు. స్కీమ్స్ అమలు, రెవెన్యూ, ఫైనాన్షియల్ బ్యాలెన్స్, స్థానిక లీడర్ల అహంకారాలు—వీటిని కంట్రోల్ చేసుకోకపోతే, ఇదే గ్రామీణ ఓటరు మరోసారి రివర్స్ గేర్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఓటర్లలో వచ్చిన మార్పు సారాంశం ఏమిటంటే, ఉద్యమ ఎమోషన్ నుంచి డెలివరీ-డ్రైవన్ రాజకీయాలకు షిఫ్ట్ అయ్యారు.

పార్టీ కంటే పనితీరు (Performance), కార్యకర్త కంటే సేవ (Service) మీద పట్టు పెరిగింది. కేసీఆర్‌ను ఉద్యమ నేతగా గౌరవించుకుంటూనే, ప్రస్తుతంలో తమ జీవితానికి ఎక్కువ బెనిఫిట్ ఇచ్చే పార్టీ వైపు గ్రామీణ ఓటరు తన మూడ్‌ను మార్చుకున్నాడు. ప్రస్తుత పంచాయతీ ఫలితాలు ఇంకా మధ్యదశలో ఉన్న పాలనకు మొదటి రిపోర్ట్ కార్డు లాంటివి. కాంగ్రెస్(Congress) ఈ మొమెంటమ్‌ని నిరంతర సేవ , క్లీన్ గవర్నెన్స్‌తో నిలబెట్టుకుంటేనే, గ్రామీణ తెలంగాణలో నిజంగానే తన జెండా పాతగలదు. లేదంటే బీఆర్‌ఎస్ మళ్లీ తిరిగి రావడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం కూడా పూర్తిగా మూసుకుపోలేదు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version