just AnalysisJust PoliticalLatest News

Political: టాలీవుడ్‌లో పొలిటికల్ రగడ.. ఎండ్ కార్డ్ వేసేదెవరు?

Political: మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ సైలెంట్ కాంప్రొమైజ్ దశలోకి వస్తున్నట్టే కనిపించినా, అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ 'ఎమోషనల్ డివైడ్' కూటమికి ఎంత పెద్ద సవాలుగా మారుతుందన్న చర్చ నడుస్తోంది.

Political

రెండు రోజులుగా తెలుగు రాజకీయాలు, టాలీవుడ్ అభిమానుల మధ్య మళ్లీ అసెంబ్లీ ఫైర్(Political) రాజుకుంది. ఎప్పుడైతే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారో, ఆ క్షణం నుంచే మెగా – నందమూరి అభిమాన వర్గాల మధ్య ఏర్పడిన తాత్కాలిక సయోధ్యకు బ్రేక్ పడింది.

ఈ వివాదం కేవలం ఇద్దరు అగ్ర నటుల మధ్య మాటల యుద్ధం మాత్రమే కాదన్నట్లు.. వైసీపీ నేతలు ఈ అవకాశాన్ని అస్త్రంగా వాడుకుని, అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన కూటమిలో అభిమాన వైరుధ్యాలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ సైలెంట్ కాంప్రొమైజ్ దశలోకి వస్తున్నట్టే కనిపించినా, అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ ‘ఎమోషనల్ డివైడ్’ కూటమికి ఎంత పెద్ద సవాలుగా మారుతుందన్న చర్చ నడుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు టాలీవుడ్, రాష్ట్ర రాజకీయా(Political)ల్లో అభిమాన వర్గాల మధ్య చిచ్చు రేపింది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా బాలకృష్ణ అది అబద్ధం, ఎవరూ గట్టిగా అడగలేదు అంటూ జగన్‌ను ‘సైకో’గా అభివర్ణించడం, ఆపై విదేశాల నుంచే చిరంజీవి ప్రెస్ నోట్ విడుదల చేయడం ఈ వివాదానికి మూలంగా మారిపోయాయి. అయితే మధ్యలో ఈ విషయంలో వైసీపీ లాభపడటానికి చూస్తుండటమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Political
Political

ఇటు రాజకీయ కోణంలో చూస్తే కూటమికి అభిమాన పరమైన రిస్క్ కనిపిస్తోంది.టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో శత్రువులుగా ఉన్న నందమూరి, మెగా అభిమానులు ఒక గూటి కిందకు వచ్చినట్టే కనిపించారు. అయితే, బాలకృష్ణ (టీడీపీ ఎమ్మెల్యే) అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఈ తాత్కాలిక సయోధ్యకు పెద్ద దెబ్బ తగిలించాయి.

ఇది కేవలం ఇద్దరు నటుల వ్యక్తిగత అభిప్రాయ భేదం కాదని.. బాలకృష్ణ మాటలు కూటమి రాజకీయా(Political)ల్లో ఉన్న అంతర్గత అభిమాన వైరుధ్యాలను మరోసారి తెరపైకి తెచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాభిమానులు తమ నాయకుడి సోదరుడి పట్ల చూపిన గౌరవంపై అసెంబ్లీలో బలమైన ప్రతిస్పందన కోరుకోవడం సహజం. ఈ వివాదాన్ని త్వరగా చల్లార్చకపోతే, కూటమిలోని రెండు ప్రధాన వర్గాల మధ్య అభిమాన విభేదాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.

మరోవైపు వైసీపీ నేతలు ఈ వివాదాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ, పరోక్షంగా చిరంజీవిని ఓన్ చేసుకుని, కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టి, అభిమానుల విభజన ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విశ్లేషిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ విషయంలో జరిగిన రచ్చ చల్లారడంతో, తాజాగా ఈ అంశాన్ని హాట్‌గా మార్చాలనుకుంటున్నారని అంటున్నారు.

అలాగే సినీ, సామాజిక కోణం నుంచి చూస్తే కనుక..ఈ వివాదంలో ఇద్దరు నటులు వ్యవహరించిన తీరు వారి ఇమేజ్‌లను మరోసారి స్పష్టం చేసింది.
విదేశాల్లో ఉన్నా కూడా చిరంజీవి హుందాగా స్పందించారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన చర్యలు కేవలం సినిమా పరిశ్రమ శ్రేయస్సు కోసమేనని, అది బాలకృష్ణ సినిమాకు కూడా లాభించిందని గుర్తు చేస్తూ, తన వ్యక్తిగత వైరాన్ని పక్కన పెట్టాలని పరోక్షంగా సూచించారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఉన్న ‘మెగాస్టార్’ ఇమేజ్‌ను మరింత బలపరిచింది.

ఇటు అసెంబ్లీ వంటి పవిత్ర వేదికపై భావోద్వేగానికి లోనై, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. అయితే, ఆయన మాటలు కూటమి పక్షాలను ఇబ్బంది పెట్టేలా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ వివాదం ఇప్పుడు కేవలం మాటల యుద్ధం కాదు. . రెండు బలమైన సినీ వర్గాల అభిమాన రాజకీయ(Political) విభేదాల పునరుద్ధరణకు దారితీసే అవకాశం ఉంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ అంశంపై మీడియా వేడి తగ్గకపోతే, అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్‌ కొనసాగడం ఖాయం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా, ఈ ఎమోషనల్ డివైడ్ వల్ల టీడీపీ, జనసేన తమ బేస్ ఓటు బ్యాంకుల్లో కొంత అస్థిరతను ఎదుర్కోవాల్సి రావొచ్చు.

మొత్తంగా ఈ వివాదం దీర్ఘకాలికంగా నష్టాన్ని కలిగించకూడదంటే, కూటమి నేతలు , నాయకులు ఈ అంశాన్ని వ్యక్తిగత వైరంగా కాకుండా, పార్టీ ప్రాతినిధ్య సమస్యగా పరిగణించి, వెంటనే మధ్యవర్తిత్వం వహించాలి. లేదంటే, వైసీపీ ఈ అంశాన్ని మరింత రాజకీయం చేసేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉంది. అభిమానాలు, ప్రత్యక్ష రాజకీయ ఫాలోయింగ్‌ను విడదీయడం కష్టమని, అందుకే ఈ అంశాన్ని మరింత పెరగకుండా అదుపు చేయడం కూటమి నేతల తక్షణ బాధ్యత అని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button