YS Raja Reddy: పాలిటిక్స్‌ వైపు వైఎస్ రాజారెడ్డి అడుగులు?..ఏపీలో రాజకీయ సమీకరణాలు మారతాయా?

YS Raja Reddy:వైఎస్సార్ కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ దృష్టిలో పెట్టుకుంటే, రాజారెడ్డి రాజకీయ ప్రవేశం రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

YS Raja Reddy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Raja Reddy ) మనవడు, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా, మీడియా ప్రశ్నలకు వైఎస్ షర్మిల స్పందిస్తూ, అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి వైఎస్ రాజారెడ్డి తప్పకుండా అడుగు పెడతారని చెప్పడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. వైఎస్సార్ కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ దృష్టిలో పెట్టుకుంటే, రాజారెడ్డి రాజకీయ ప్రవేశం రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశాలు.. షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సమయంలో వైఎస్ రాజారెడ్డి(YS Raja Reddy ) రాక కాంగ్రెస్‌కు అనేక విధాలుగా లాభం చేకూర్చొచ్చు. షర్మిల మార్కు కనిపిస్తున్నా ఆమె వల్ల కాంగ్రెస్‌కు భారీగా కలిసొచ్చే అంశాలు లేకపోవడం వల్ల రాజారెడ్డి అది ఫుల్‌ఫిల్ చేస్తారన్న భావనలో కాంగ్రెస్ అధిష్టానానికి ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ బ్రాండ్ , కుటుంబ వారసత్వం కాంగ్రెస్ పార్టీకి వెనుకబడిన వర్గాలను, ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి బాగా ఉపయోగపడతాయి.

గతంలో షర్మిల చేసిన పాదయాత్ర తరహాలో, రాజారెడ్డి యువతలో ప్రచారం ద్వారా ఒక కొత్త ఫాలోయింగ్‌ను తీసుకురావచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది గ్రాస్‌రూట్స్ కనెక్షన్‌తో పాటు, జాతీయ స్థాయిలో ఒక శక్తివంతమైన కుటుంబ వారసత్వం అండ లభిస్తుంది. రైతుల సమస్యలపై రాజారెడ్డి చేసిన పర్యటనలు, మార్కెట్ విజిట్స్ వల్ల రైతు సంఘాలలో సానుభూతి పెరిగే అవకాశం కూడా ఉంది.

కూటమి పార్టీలపై ప్రభావం..ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలంగా ఉంది. ఇలాంటి సమయంలో వైఎస్సార్ కుటుంబం నుంచి మరో కీలక వ్యక్తి ఎంట్రీ ఇవ్వడం కూటమి పార్టీలకు పెద్ద సవాల్ కాకపోవచ్చు. అయితే క్రమేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వర్గాలను, వెనుకబడిన ప్రజలను, రైతులను ఆకర్షించి, కాంగ్రెస్ కూటమిలో నాలుగవ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో, షర్మిల-రాజారెడ్డి కాంబినేషన్ నగరాల్లో గట్టి పోటీ ఇవ్వగలదని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది ఇతర పార్టీల ఓట్లను చీల్చి, కాంగ్రెస్‌కు వ్యూహాత్మక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

జగన్‌పై ప్రభావం…వైఎస్సార్ కుటుంబంలో గత దశాబ్ద కాలంగా జగన్-షర్మిల మధ్య విభేదాలు బహిరంగంగానే ఉన్నాయి. రాజారెడ్డి రాజకీయ ప్రవేశంతో జగన్‌కు అనేక నష్టాలు కలగొచ్చు. వైఎస్సార్ వారసత్వాన్ని తానే ఏకైక ప్రతినిధిగా కొనసాగిస్తున్నారనే జగన్ వెయిట్ తగ్గే అవకాశం ఉంది. వైఎస్సార్‌ను అభిమానించే వారి ఓట్లు, ముఖ్యంగా యువత, రైతుల ఓట్లు కాంగ్రెస్ వైపు చీలిపోవచ్చు. దీనివల్ల వైఎస్సార్సీపీకి ఉన్న లాయలిస్ట్ ఓటు బ్యాంక్ దెబ్బతినే అవకాశం ఉంది.

YS Raja Reddy

ఇదే సమయంలో, జగన్ ప్రభుత్వంలోని అవినీతి, వ్యవస్థాగత సమస్యలను కుటుంబం బయట నుంచి వచ్చే ఒక ఛాలెంజ్‌గా చూడొచ్చు. వైఎస్సార్ సెంటిమెంట్ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించడంలో కాంగ్రెస్ ఒక ప్లస్ పాయింట్ పొందితే, జగన్‌కు అది ఒక మైనస్ పాయింట్‌గా మారే అవకాశాలు ఎక్కువ.

ఏపీ రాజకీయాలపై ప్రభావం..వైఎస్ రాజారెడ్డి(YS Raja Reddy ) అరంగేట్రం ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చకపోవచ్చు కానీ, అది ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు, సరికొత్త ధృవాల ఏర్పాటుకు ఇది కారణం కావచ్చు. ఒక వ్యక్తికి ఛరిస్మా , గ్రాస్‌రూట్స్ కనెక్షన్ ఉంటే, రాజకీయ సమీకరణాలు మారొచ్చు.

వైఎస్ రాజారెడ్డిలో ఈ లక్షణాలు కనిపిస్తే, రాష్ట్రంలోని పార్టీల అమరిక, ఓటు డైనమిక్స్ నెమ్మదిగా మారే అవకాశం ఉంది.మొత్తంగా చెప్పాలంటే, వైఎస్ రాజారెడ్డి ఎంట్రీతో కూటమి ప్రభుత్వానికి నష్టం లేకపోయినా.. జగన్‌కు మాత్రం భారీ నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Vladimir Putin:విధి ఆడిన అద్భుత నాటకం..దీనిలో వ్లాదిమిర్ పుతిన్‌ పాత్ర ఏంటి?

Exit mobile version