Birth and Death:ఆన్‌లైన్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికేట్లు .. కొత్త సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది?

Birth and Death: గతంలో బిడ్డ పుట్టిన ఆసుపత్రి ఒక వార్డులో ఉంటే, ఆ సర్టిఫికేట్ కోసం వేరే ఆఫీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది.

Birth and Death

హైదరాబాద్ మహానగరం ఎవరూ ఊహించనంత శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా పట్టణ ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా జీహెచ్‌ఎంసీ వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెరిగింది. అయితే ఈ సమయంలో ప్రజలకు జనన, మరణ (Birth and Death) ధృవీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) రూపొందించిన ఈ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా ఆటోమేటెడ్ మోడ్‌లో పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.

కొత్త సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత ఏమిటంటే, భాగ్యనగరంలోని ప్రతి ప్రైవేట్ , ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పుడు డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆయా వార్డులకు లింక్ చేశారు. గతంలో బిడ్డ పుట్టిన ఆసుపత్రి ఒక వార్డులో ఉంటే, ఆ సర్టిఫికేట్ కోసం వేరే ఆఫీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఆసుపత్రి లొకేషన్‌ను బట్టి..ఆ వార్డును గుర్తిస్తుంది. దీనివల్ల డేటా మిస్‌మ్యాచ్ అయ్యే అవకాశం అస్సలు ఉండదు.

ఆసుపత్రిలో జననం కానీ మరణం(Birth and Death) కానీ సంభవించగానే హాస్పిటల్ యాజమాన్యం ఆ వివరాలను సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తుంది. వెనువెంటనే తల్లిదండ్రులు లేదా, బంధువుల మొబైల్ నంబర్‌కు ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ ఐడీతో కూడిన ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఈ ఐడీ ఉంటే మీరు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థ వల్ల మధ్యవర్తుల ప్రమేయం కూడా పూర్తిగా తొలిగిపోయింది. కేవలం 7 వర్కింగ్ డేస్‌లోనే సర్టిఫికేట్ జారీ అయ్యేలా టైమ్ లైన్ ఫిక్స్ చేశారు.

Birth and Death

ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా పాత రికార్డులను కూడా ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. ఒకవేళ గతంలో జారీ చేసిన సర్టిఫికేట్లలో తప్పులు ఉంటే, కొత్త వ్యవస్థ ద్వారా ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ అటెస్టేషన్ ఆధారంగా సవరణలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. నేమ్ ఛేంజ్ లేదా అడ్రస్ కరెక్షన్ల కోసం ఇకపై నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ డిజిటల్ తెలంగాణ చొరవ వల్ల లక్షలాది మంది నగరవాసులకు సమయం , డబ్బు ఆదా కానుంది.

Candidates: అభ్యర్థులకు నో-డ్యూ గండం.. అమల్లోకి మరిన్ని కొత్త కండిషన్లు

 

Exit mobile version