Annadata Sukhibhavva
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ‘అన్నదాత సుఖీభవ-Annadata Sukhibhavva ‘ పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా పెండ్లిమర్రిలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు రూ. 3,137 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ(Annadata Sukhibhavva) పథకం కింద ఒక్కో రైతు ఖాతాలో రూ. 5,000 చొప్పున జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధులు రూ. 2,000 కలుపుకొని, మొత్తంగా రూ. 7,000 రైతుల అకౌంట్లలో పడ్డాయి. నిధులు తమ ఖాతాల్లో జమయ్యాయో లేదో చూసుకోవాలని ముఖ్యమంత్రి రైతులకు సూచించారు.
ప్రసంగంలో భాగంగా ముఖ్యమంత్రి వ్యవసాయం మరియు రైతు సంక్షేమంపై తన దృష్టిని స్పష్టం చేశారు. ప్రకృతి సేద్యం (Organic Farming) ఏ దేశంలో ఉంటే ఆ దేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. సేంద్రియ సాగుతో నేల సారం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవచ్చని తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఆలోచనను అమలు చేయాల్సి ఉందని అన్నారు.
తాను కూడా ఒక రైతు బిడ్డనే అని, తన తండ్రికి సేద్యంలో సాయపడ్డానని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయాన్ని అన్ని విధాలా లాభసాటిగా మారుస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్ (వ్యవసాయ సాంకేతికత) – ఈ మూడింటిపై దృష్టి పెట్టడం ముఖ్యమని తెలిపారు. నీరు సమృద్ధిగా ఉంటే నాగరికత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
సీఎం చంద్రబాబు ఈ వేదికగా కొన్ని రాజకీయ , పాలన అంశాలను కూడా ప్రస్తావించారు.ముందుగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం సమస్యపై ఆయన స్పందించారు. గత ఐదేళ్లుగా స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై తమ పార్టీ ఒత్తిడి తెచ్చిందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి శాశ్వత పరిష్కారం చూపాలని, సొంత గనులు కేటాయించాలని కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
సీఐ సతీష్ మృతి ఉదంతంపై అధికార పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ‘చేతకానితనం’గా ఆయన అభివర్ణించారు. ఆ ఘటన హత్యో లేక ఆత్మహత్యో ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని, సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే నిరూపణ చేయాలని, మా వాళ్లపై బురద జల్లడం సరికాదని అన్నారు.
ఏపీలో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ (కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం)తో అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. ఎన్డీయే పొత్తు(Alliance Government)తో రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతోందని, కూటమి సర్కార్ తో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు సూపర్ హిట్ అయ్యాయని పేర్కొన్నారు.
ఎడారిగా మారిన రాయలసీమను సస్యశ్యామలం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాల ప్రయాణం నేటికీ కొనసాగుతోందని తెలిపారు. “చెట్టు కింద నుంచి టెక్నాలజీ అభివృద్ధి” అనేది సుపరిపాలనకు చిహ్నమని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhavva) నిధుల విడుదల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాక, సేంద్రీయ వ్యవసాయం, మౌలిక వసతులు ,రాజకీయ అంశాలపై కూడా స్పష్టమైన వైఖరిని తెలియజేశారు.
PM-KISAN 21st Installment :పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల.. డబ్బులు జమ కానివారు చేయాల్సినవి
