Just NationalLatest News

PM-KISAN 21st Installment :పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల.. డబ్బులు జమ కానివారు చేయాల్సినవి

PM-KISAN 21st Installment : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో బటన్ నొక్కి ఈ నిధులను లాంఛనంగా రిలీజ్ చేశారు.

PM-KISAN 21st Installment

పీఎం కిసాన్ 21వ విడత విడుదల(PM-KISAN 21st Installment): రైతులకు భారీ ఊరటరైతుల పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) పథకంలో భాగంగా, 21వ విడత నిధులు విడుదలయ్యాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో బటన్ నొక్కి ఈ నిధులను లాంఛనంగా రిలీజ్ చేశారు.ఈ ఒక్క విడతలో, దేశవ్యాప్తంగా అర్హులైన సుమారు 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున, మొత్తం రూ.18,000 కోట్లకు పైగా నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో నేరుగా జమయ్యాయి.

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019, ఫిబ్రవరి 24న ప్రారంభించింది.పథకం లక్ష్యం: సాగు భూమి ఉన్న రైతులకు వారి పంట పెట్టుబడి అవసరాలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఆర్థిక సాయం: అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి ఏటా రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తారు.: ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా, రూ.2,000 చొప్పున మూడు విడతల్లో (ప్రతి నాలుగు నెలలకోసారి) నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.ఈ 21వ విడతతో సహా ఇప్పటివరకు మొత్తం 21 విడతల్లో(PM-KISAN 21st Installment) దేశంలోని కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.

PM-KISAN 21st Installment
PM-KISAN 21st Installment

సేంద్రియ సాగుపై ప్రధాని పిలుపునిధులు విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న కొన్ని సవాళ్లను ప్రస్తావించారు. రసాయన ఎరువులు మరియు పురుగు మందుల అధిక వినియోగం కారణంగా నేల సారం (Soil Fertility) దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యకు సేంద్రీయ సాగు (Organic Farming) ఒక్కటే పరిష్కారం చూపుతుందని తెలిపారు.

వాతావరణ మార్పుల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ ఈ తరహా వ్యవసాయ విధానాలు సాయపడతాయన్నారు. సేంద్రియ సాగులో ప్రపంచానికి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా పయనిస్తోందని మోదీ తెలిపారు.తృణ ధాన్యాలను ‘సూపర్ ఫుడ్‌’గా అభివర్ణించిన ప్రధాని మోదీ, వాటి సాగును పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు.

పీఎం కిసాన్ పథకం కింద అర్హులుగా ఉన్నా కూడా కొందరి ఖాతాల్లో 21వ విడత(PM-KISAN 21st Installment) నిధులు జమ కాకపోవచ్చు. దీనికి అనేక సాంకేతిక లేదా ధృవీకరణ లోపాలు కారణం కావచ్చు. నిధులు రాని రైతులు ఈ కింది చర్యలు చేపట్టవచ్చు.

  • స్టేటస్ తనిఖీ (Status Check):పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in) ను సందర్శించి, ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.ఇక్కడ తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ‘Installment Status’ను తనిఖీ చేయాలి.
  • స్టేటస్‌లో ‘RFT’ (Request for Transfer) అని ఉంటే నిధులు త్వరలో జమ అవుతాయి.
  • ఒకవేళ ‘FTO is Generated but Payment Confirmation is Pending’ అని ఉంటే, నిధుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు అర్థం.
  • ‘Aadhaar Not Seeded’, ‘Invalid Bank Account’ వంటి లోపాలు ఉంటే, వెంటనే వాటిని సరిదిద్దుకోవాలి.
  • ఆధార్ మరియు బ్యాంకు ఖాతా ధృవీకరణ (e-KYC) తప్పనిసరి. e-KYC పూర్తి చేయకపోతే నిధులు ఆగిపోతాయి.
    దీనిని ఆన్‌లైన్‌లో లేదా మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా పూర్తి చేయాలి.
  • సమస్య పరిష్కారం కాకపోతే, పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్‌లు 155261 లేదా 011-24300606 కు ఫోన్ చేయవచ్చు, లేదా మీ స్థానిక వ్యవసాయ అధికారిని లేదా జిల్లా స్థాయి అధికారులను సంప్రదించొచ్చు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button