Pawan : సాయం చిన్నదా పెద్దదా కాదు.. సాటి వారి పట్ల ఎంత ఆలోచించి సాయం చేశామా అన్నదే ముఖ్యం. డబ్బుంటే చాలదు.. పేద వాళ్ల కష్టం తెలుసుండాలి. నాయకుడు అయితే సరిపోదు ప్రజలను అర్ధం చేసుకునే మనసుండాలి. ఈ రెండూ ఉన్నవాడే పవన్ కళ్యాణ్ అనే నాయకుడు.. ఓ హీరో.. ఓ మనసున్న మనిషి. అందుకే నాయకుడు అంటే అధికారం, డబ్బు ఉన్న వ్యక్తి కాదు. పేదల కన్నీళ్లను తన కన్నీళ్లుగా భావించే మనసు ఉన్నవాడు అని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవర్ స్టార్‌గా కోట్ల మంది అభిమానుల గుండెల్లో, ఇప్పుడు ఉపముఖ్యమంత్రి(Deputy Chief Minister)గా సామాన్య ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.
Pawan
కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా, సాటి మనిషి పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయతతో ఆయన చేస్తున్న సాయం ప్రజల్లో భరోసా నింపుతోంది. గతంలో అల్లూరి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలను సందర్శించినప్పుడు వారి దుర్భరమైన జీవనశైలిని చూసి చలించిపోయారు. అప్పుడు రోడ్లపై చెప్పులు లేకుండా నడుస్తున్న వారిని చూసి చలించిపోయి, వారికి పాదరక్షలు పంపించారు. అంతేకాదు, తన తోటలో పండించిన ఆర్గానిక్ పండ్లను అందించి, తాను కూడా వారిలో ఒకడినే అనే భావనను కలిగించారు. ఆ సాయాన్ని , ఆ ప్రేమను అందుకున్న గిరిజనులు ఎంతో సంతోషంతో పొంగిపోయారు.
తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. సాలూరు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలైన చిలక మెండంగి, తాడిప్యూట్టి, బెండ మొండింగి, డోయువరా బాగుజోల, సిరివర గ్రామాల్లోని 222 కుటుంబాలకు చలి నుంచి రక్షణ కోసం రగ్గులు పంపించారు. ఉప ముఖ్యమంత్రి పంపిన ఈ సహాయం తమకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆయన్నుంచి అందిన ఈ ఆప్యాయత తమకు ఎప్పటికీ గుర్తుంటుందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు.తమను ఇంత వరకూ ఇంత ప్రేమగా చూసుకున్న నాయకుడిని చూడనే లేదంటూ ఆనంద భాష్పాలతో చెబుతున్నారు.
ఇటు ఈ సందర్భంగా తీసిన ఛాయాచిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్ మనసుపై సామాజిక మాధ్యమాలలో ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా, ప్రజల కష్టాలను విని వెంటనే.. స్పందించడం, వారికి అండగా నిలబడటం ఆయనను సాధారణ ప్రజలలోనే కాదు గిరిజనలలోనూ ప్రత్యేకంగా నిలబెడుతోందని పవన్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు.