Pawan: ఢిల్లీ హైకోర్టుకు పవన్ కళ్యాణ్‌ ..పవన్ లీగల్ ఫైట్ దేనికోసం?

Pawan : AI ఫేక్ కంటెంట్ వల్ల నష్టం ఎవరికన్నా ఎక్కువగా రాజకీయ నాయకులకే. ఎందుకంటే వారి ఇమేజ్ మీద వచ్చే ఒక్క నకిలీ వీడియోతో పార్టీ స్ట్రాటజీలు మారిపోతాయి.

Pawan

దేశ రాజకీయాల్లో ఒకటైపైనే చర్చ నడుస్తోంది అదే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో నకిలీ వీడియోల సునామి. పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లలో సెలబ్రిటీల ముఖం, వాయిస్ తీసుకుని ఎడిట్ చేసి ఎక్కడపడితే అక్కడ అప్‌లోడ్ చేస్తున్నారు . ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టు వద్ద నేరుగా లీగల్ ఫైట్ ప్రారంభించారు.

పవన్ కళ్యాణ్ (Pawan)పేరు, ఫొటోలు, వాయిస్‌తో తయారైన కోటి రకాల AI వీడియోలు ఆన్‌లైన్‌లో తిరుగుతూ, కొన్నింటిలో తప్పుడు ప్రచారం, కొన్నింటిలో నకిలీ మార్కెటింగ్ జరుగుతుండటం పవన్ గుర్తించారు. ఈ విధంగా తయారైన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నంత వేగంగా పవన్ రిప్యూటేషన్‌పై డ్యామేజ్ కూడా పెరుగుతోంది.

గూగుల్, మెటా, ఎక్స్, అలాగే కొన్ని ఈ-కామర్స్ సైట్లలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan) ఫేస్ , వాయిస్‌ను వాడుకుని యాడ్స్, ప్రమోషన్స్ పెట్టినట్లు కోర్టుకు వివరించారు పవన్ లాయర్. దీంతో ఏ ఒక్క అనుమతి లేకుండా జరిగే ఈ AI దుర్వినియోగం దేశంలో డిజిటల్ హక్కుల మీద పెద్ద డిబేట్‌ని తెచ్చింది.

Pawan

ఈ కేసుపై హైకోర్టు వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియా సంస్థలకు ..ఎవరైనా వ్యక్తిపై AI తో చేసిన డిఫేమ్ కంటెంట్ వస్తే వెంటనే తొలగించాలి, అలాగే అతని లాయర్లు ఇచ్చే URLలను వారంలోపు రిమూవ్ చేయాలి అని క్లియర్ ఆదేశాలు ఇచ్చింది .

ఇలాంటి సమస్య బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఎదుర్కొన్నప్పుడు కూడా కోర్టు ఆదేశాలిచ్చినా, ఇప్పటికీ తప్పు వీడియోలు తొలగించబడకుండా ఇంటర్నెట్‌లోకి తిరుగుతున్నాయి. అంటే ఇది ఒకే వ్యక్తికి కాదు, దేశంలోని అనేకమంది ప్రముఖులకు ఎదురవుతున్న పెద్ద సమస్య.

ఈ AI ఫేక్ కంటెంట్ వల్ల నష్టం ఎవరికన్నా ఎక్కువగా రాజకీయ నాయకులకే. ఎందుకంటే వారి ఇమేజ్ మీద వచ్చే ఒక్క నకిలీ వీడియోతో పార్టీ స్ట్రాటజీలు మారిపోతాయి, ప్రజలు కన్‌ఫ్యూజ్ అవుతారు, ప్రత్యర్థులు దాన్ని క్యాష్ చేసుకుంటారు. అలాగే సెలబ్రిటీలకు బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. ఒక చిన్న వీడియో వల్ల కోట్ల రూ. డీల్‌లు కూడా మిస్ కావచ్చు.

Pawan

ఆన్‌లైన్‌లో ఇటువంటి AI స్కామ్స్‌ను కంట్రోల్ చేయాలంటే..సోషల్ మీడియా కంపెనీలు హై లెవల్ ఫేస్ & వాయిస్ డిటెక్షన్ సిస్టమ్స్ పెట్టాలి
అనుమతి లేకుండా ఎవరి ఫోటో/వాయిస్ వాడినా ఆటోమేటిక్‌గా రిమూవ్ చేయాలి.లా అండ్ ఆర్డర్ అప్‌డేట్ చేసి డీప్‌ఫేక్ తయారు చేసే వారిపై భారీ రూ. జరిమానాలు పెట్టాలి. ఫిర్యాదు వస్తే వెంటనే యాక్షన్ తీసే మెకానిజం ఉండాలి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేసు దేశ వ్యాప్తంగా పెద్ద డిస్కషన్ లా మారింది. డిసెంబర్ 22న జరిగే తదుపరి హియర్‌లో దీనిపై ఇంకెంత కఠినమైన నియమాలు వస్తాయో చూడాలి.

ఒక మాటలో చెప్పాలంటే..AI ఫేక్ వీడియోలు ఇప్పుడే ఆగకపోతే రాజకీయాలు, సినిమాలు, సెలబ్రెటీల జీవితాలు అంతెందుకు సోషల్ మీడియా మొత్తం గందరగోళమే అవుతుంది

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version