Teachers: ఉపాధ్యాయులకు పవన్ సర్ప్రైజ్ గిఫ్ట్స్

Teachers: గురువులకు ఈ టీచర్స్ డే సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో గౌరవం చాటి, వారికి ఒక మధురమైన అనుభూతిని అందించారు.

Teachers

సమాజ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించేవారు గురువులు(Teachers). “అక్షరాభ్యాసం చేయించి, జ్ఞానాన్ని ప్రసాదించే గురువు, తల్లిదండ్రుల కంటే గొప్పవారు” అని మన సనాతన ధర్మం చెబుతుంది. అందుకే గురువులను ‘ఆచార్య దేవో భవ’ అంటూ పూజిస్తాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే మొదలవుతుంది.. పిల్లల తలరాతలను మార్చి, వారి భవిష్యత్తుకు బాటలు వేసేది గురువులే. అలాంటి గురువులకు ఈ టీచర్స్ డే సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో గౌరవం చాటి, వారికి ఒక మధురమైన అనుభూతిని అందించారు.

సెప్టెంబర్ 5న, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలోని ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేకమైన బహుమతిని పంపించారు. తన నియోజకవర్గంలోని దాదాపు 2,000 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆయన దుస్తులను (పురుష ఉపాధ్యాయులకు ప్యాంట్, షర్ట్ క్లాత్, మహిళా ఉపాధ్యాయులకు చీరలు) పంపించారు.

ఈ బహుమతులు పంపిణీ చేయడంలో ఆయన ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించారు. స్వయంగా విద్యార్థుల చేతుల మీదుగా వారి గురువులకు ఈ బహుమతులు అందజేశారు. ఈ అరుదైన గౌరవానికి ఉపాధ్యాయులు(Teachers) ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ జీవితంలో ఇలాంటి బహుమతి ఎప్పుడూ అందుకోలేదని ఉపాధ్యాయులు భావోద్వేగంతో చెప్పారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులను గతంలో అవమానించిన నాయకులను చూసిన తాము.. తొలిసారిగా ఉపాధ్యాయుల(Teachers)కు ఇంతటి నిజమైన గౌరవం, ప్రోత్సాహం ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఉపాధ్యాయులు ఆనందంతో పేర్కొన్నారు.

Teachers

పవన్ కళ్యాణ్ కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే కాకుండా, తన నియోజకవర్గంలోని ప్రజలకు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. గతంలో రక్షాబంధన్ , వరలక్ష్మి వ్రతం సందర్భంగా కూడా మహిళలకు చీరలు, పసుపు-కుంకుమలను పంపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా మారుస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రజల సమస్యలను గుర్తించి, వారి అవసరాలను తీరుస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని ఎన్నుకున్నందుకు పిఠాపురం ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.

Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. 12గంటల పాటు ఆలయం మూసివేత

Exit mobile version