Ration Card
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన మరియు అత్యవసర హెచ్చరిక అందింది. కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల(Ration Card)ను తీసుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 15 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. ఈ డెడ్‌లైన్ లోపు కార్డు తీసుకోని వారు, ఆ తర్వాత రూ. 200 రుసుం (ఫీజు) చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డుల(Ration Card) స్థానంలో నూతన స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం ద్వారా రేషన్ పంపిణీలో మరింత సులభంగా, పారదర్శకంగా వ్యవహరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్రమాలకు, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఈ స్మార్ట్ కార్డులను QR కోడ్‌తో సహా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కార్డులు ATM సైజు తరహాలో ఉండి, వాటిపై కుటుంబ సభ్యుల పేర్లు మరియు రేషన్ నంబర్ స్పష్టంగా ముద్రించబడి ఉంటాయి.
ఇప్పటివరకు(Ration Card) తీసుకోని వారికి తుది అవకాశం..
ఆగస్టు నుంచి ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తున్నా కూడా, ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు వాటిని తీసుకోలేదు.వృద్ధులు, వికలాంగుల వంటి అత్యవసర వ్యక్తులకు రేషన్ డీలర్లు లేదా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్లి కార్డులు అందజేస్తున్నారు.
మిగిలినవారు సచివాలయాలకు వెళ్లి కార్డులు తీసుకోవాలి. అధికారుల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నప్పటికీ, కొందరు అందుబాటులో లేకపోవడం లేదా నిర్లక్ష్యం కారణంగా తీసుకెళ్లకపోవడం జరుగుతోంది.దీంతో ప్రభుత్వం డిసెంబర్ 15 వరకు తుది గడువుగా నిర్ణయించింది.
ఒకవేళ మీరు డిసెంబర్ 15 లోపు స్మార్ట్ కార్డు తీసుకోకపోతే, మీ కార్డు రద్దు అవుతుందనే ఆందోళన అవసరం లేదు. అయితే, ఆ తర్వాత కార్డు పొందాలంటే, దగ్గరలోని సచివాలయాల్లో రూ. 200 రుసుం చెల్లించి, చిరునామాతో సహా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత, కమిషనరేట్ నుంచి నేరుగా లబ్ధిదారుడు పేర్కొన్న చిరునామాకు స్మార్ట్ కార్డు పంపబడుతుంది. ప్రజల నుంచి స్పందన ఆలస్యం అవుతున్నందున, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు నిల్వ సమస్యలను నివారించడానికి ప్రభుత్వం ఈ రుసుము విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
