Weekly Express: తిరుపతి-షిర్డి వీక్లీ ఎక్స్‌ప్రెస్..తీరనున్న భక్తుల కష్టాలు

Weekly Express: తిరుపతి - సాయి నగర్ షిర్డి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి వి. సోమన్న వర్చువల్‌గా ప్రారంభించారు.

Weekly Express

భారతీయ రైల్వే శాఖ ఆధ్యాత్మిక ప్రయాణాలకు మరింత ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి (తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి) , సాయి నగర్ షిర్డి (షిర్డి సాయిబాబా) మధ్య భక్తుల సౌకర్యార్థం మరో కొత్త రైలు సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించిన రెండవ వీక్లీ ఎక్స్‌ప్రెస్(Weekly Express) కావడం విశేషం.

తిరుపతి – సాయి నగర్ షిర్డి వీక్లీ ఎక్స్‌ప్రెస్(Weekly Express) రైలును కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి వి. సోమన్న వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు, టీటీడీ బోర్డు సభ్యులు హాజరయ్యారు.

ఈ (Weekly Express)నూతన రైలు సేవతో రెండు రాష్ట్రాల్లోని భక్తులకు మధ్యవర్తిగా ఉండే ప్రాంతాల కనెక్టివిటీ కూడా మెరుగుపడుతుంది. తిరుపతి నుంచి షిర్డీ వెళ్లాలన్నా..షిర్డీ నుంచి తిరుపతి వెళ్లాలన్నా భక్తులు ఇబ్బందులు పడేవారు. సరైన కనెక్టివిటీ లేక డబ్బులు,సమయం వృధా అవుతుందని బాధపడేవారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి.

Weekly Express

తిరుపతి నుంచి బయలుదేరే ఈ రైలు ప్రయాణ మార్గంలో గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్ వంటి ప్రధాన నగరాల మీదుగా సాయి నగర్ షిర్డి చేరుకుంటుంది.

ఈ మార్గంలో ఉన్న భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా షిర్డి సాయిబాబా దర్శనం కోసం సులభంగా ప్రయాణించే వీలు కలుగుతుంది.

ఈ రైలు సేవలు ప్రధానంగా వారాంతాల్లో పర్యటించే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ చర్యతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరతాయని భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది.

రెండు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య కనెక్టివిటీ పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రజల మధ్య రవాణా పరంగానే కాకుండా, సాంస్కృతిక సంబంధాలు కూడా బలోపేతం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version