Eat:ఏం తింటున్నామన్నది కాదు..ఎప్పుడు తింటున్నామన్నదే ముఖ్యం.. ఎందుకో తెలుసా?
Eat: సూర్యుడు ఉదయించినప్పుడు మన జీర్ణవ్యవస్థ అత్యంత చురుగ్గా ఉంటుంది, సూర్యుడు అస్తమించిన తర్వాత అది స్లో అవుతుంది.
Eat
మన ఆరోగ్యం విషయంలో మనం తీసుకునే ఆహారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, అది తీసుకునే సమయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఆధునిక వైద్య శాస్త్రం చెబుతోంది. దీనినే సర్కాడియన్ రిథమ్ డైట్ అంటారు. మన బాడీలో ఒక అంతర్గత గడియారం (Biological Clock) ఉంటుంది. ఇది సూర్యుడి గమనానికి అనుగుణంగా మన జీవక్రియలను కంట్రోల్ చేస్తుంది.
సూర్యుడు ఉదయించినప్పుడు మన జీర్ణవ్యవస్థ అత్యంత చురుగ్గా ఉంటుంది, సూర్యుడు అస్తమించిన తర్వాత అది స్లో అవుతుంది. ఈ ప్రకృతి సిద్ధమైన గడియారానికి వ్యతిరేకంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు, ఎన్ని పోషక విలువలున్న ఆహారం తిన్నా అది అనారోగ్యానికే దారితీస్తుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
సర్కాడియన్ రిథమ్ ప్రకారం, మన బాడీకి పగలు ఆహారం తీసుకోవడం, రాత్రి విశ్రాంతి తీసుకోవడం అలవాటు. ఉదయం పూట మన ఇన్సులిన్ స్థాయిలు ఆహారాన్ని శక్తిగా మార్చడానికి రెడీగా ఉంటాయి. అందుకే ఉదయం అల్పాహారం , మధ్యాహ్నం భోజనం తృప్తిగా చేయాలని అంటారు.
కానీ సూర్యాస్తమయం తర్వాత బాడీ ‘మెలటోనిన్’ అనే హార్మోన్‌ను రిలీజ్ చేయడం ప్రారంభిస్తుంది.. ఇది నిద్రకు సంకేతం. ఈ సమయంలో మనం హెవీ భోజనం చేస్తే, శరీరం ఆ ఆహారాన్ని జీర్ణం చేయలేక ఇబ్బంది పడుతుంది. రాత్రి పూట తీసుకునే ఆహారం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా, అది కొవ్వుగా మారి ఊబకాయానికి, డయాబెటిస్‌కి దారి తీస్తుంది.
చాలా మంది రాత్రి 10 గంటల తర్వాత ఇంకొందరు అయితే ఏకంగా అర్ధరాత్రి పూట భోజనం(Eat) చేస్తుంటారు. దీనివల్ల మన అంతర్గత గడియారం గందరగోళానికి గురవుతుంది. రాత్రి సమయంలో జీర్ణవ్యవస్థ రెస్ట్ తీసుకోవడానికి బదులుగా, ఆహారాన్ని అరిగించడానికి కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల డీప్ స్లీప్ (Deep Sleep) కరువవుతుంది. దీనివల్ల మర్నాడు ఉదయం అలసటగా అనిపించడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

చీకటి పడ్డాక మన బాడీ మెటబాలిజం తగ్గిపోతుంది కాబట్టి, సూర్యాస్తమయానికి ముందు కానీ కనీసం రాత్రి 7 గంటల లోపు భోజనం(Eat) ముగించడం సర్కాడియన్ రిథమ్ డైట్ లోని ప్రధాన సూత్రం. దీనివల్ల శరీరానికి కోలుకోవడానికి (Healing) తగినంత సమయం దొరుకుతుంది.
ఈ జీవనశైలిని పాటించడం వల్ల కేవలం వెయిట్ తగ్గడమే కాకుండా, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది .. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. రాత్రి భోజనానికి, మర్నాడు ఉదయం అల్పాహారానికి మధ్య కనీసం 12 నుంచి 14 గంటల విరామం ఉండటం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి (Autophagy). మనం ప్రకృతితో కలిసి ప్రయాణించినప్పుడు బాడీ తనను తాను నయం చేసుకుంటుంది.
అందుకే ఎప్పుడు పడితే అప్పుడు తినడం మానేసి, శరీర గడియారానికి గౌరవం ఇస్తూ సరైన టైములో ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతితో ముడిపడిన ఈ జీవనశైలే దీర్ఘకాలిక ఆరోగ్యానికి అసలైన రహస్యం అని అందరూ తెలుసుకోవాలని అంటున్నారు.
Women Voters:మున్సిపల్ కురుక్షేత్రంలో మహిళా ఓటర్లదే ఫైనల్ కాల్.. ఈ పోరులో గెలుపెవరిది?




One Comment